![గోవాలో రష్యా యువతిపై దారుణం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/81461988481_625x300.jpg.webp?itok=a--bUd75)
గోవాలో రష్యా యువతిపై దారుణం
పనాజీ: గోవాలో దారుణం జరిగింది. విహారయాత్రకు వచ్చిన రష్యా యువతిని గెస్ట్ హౌస్ యజమాని అత్యాచారం చేశాడు. శుక్రవారం గెస్ట్ హౌస్లో అద్దెకు తీసుకున్న గదిలో ఆమె నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పెర్నెమ్ ఇన్స్పెక్టర్ సంజయ్ దాల్వి చెప్పారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. నిందితుడిని జేమ్స్ డిసౌజాగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.