Russian woman
-
రష్యన్ మహిళకు వింత అనుభవం : రీల్ తెచ్చిన తంటానేనా?
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రష్యాకు చెందిన మహిళాప్రయాణీకురాలికి చేదు అనుభవం ఎదురైంది. రష్యన్ ట్రావెల్ వ్లాగర్ దినారాకు బోర్డింగ్ పాస్‌పై ఒక పాస్‌పోర్ట్ అధికారి ఫోన్ నంబర్‌ను రాసి ఇవ్వడంతో పాటు మళ్లీ ఇండియాకు వచ్చినప్పుడు కాల్ చేయాలని పేర్కొన్నాడన్న ఆరోపణలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని దినారా సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.ఢిల్లీ విమానాశ్రయంలోని పాస్‌పోర్ట్ కంట్రోల్ ఆఫీసర్ తన బోర్డింగ్ పాస్‌పై అతని ఫోన్ నంబర్‌ను రాసి, నెక్ట్స్ టైం వచ్చినపుడు సంప్రదించాలని పేర్కొన్నట్టు దినారా వీడియోలో ఆరోపించింది. దీనికి సంబంధించిన బోర్డింగ్ పాస్‌ను కూడా చూపించింది. ‘‘అరే యార్, ఈ ప్రవర్తన ఏమిటి?" అంటూ ప్రశ్నించింది. అంతేకాదు దీనిపై ఇది సరి అయినదేనా అంటూ పోల్ కూడా నిర్వహించింది.అయితే ఆ అధికారి ఎవరు అనేది స్పష్టంగా వెల్లడించలేదు. అటు అధికారులనుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. View this post on Instagram A post shared by Dinara ~ traveller, India lover 🇮🇳 (@dijidol)అయితే, దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ముఖ్యంగా గతవారం ఇండియన్ భర్త కావాలంటూ ఇటీవల ఆమె చేసిన రీల్‌ను కొంతమంది గుర్తుచేసుకున్నారు. బహుశా అందుకే సదరు ఆ అధికారి అలా చేసి ఉంటాడని పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభంలో, దినారా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోని QR కోడ్‌తో పాటు, "లుకింగ్ ఫర్ ఏ ఇండియన్ హస్బెండ్" అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేసింది. గోడపై పోస్టర్ అతికిస్తున్న ఈ చిన్న క్లిప్‌కు మూడు మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. View this post on Instagram A post shared by Dinara ~ traveller, India lover 🇮🇳 (@dijidol) భారతదేశంలో పర్యటిస్తూ తన అనుభవాలతో వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంద్వారా పాపులర్ అయింది దినారా. ప్రస్తుతం స్వదేశానికి వెళ్లి పోయింది. మాస్కో నుండి ఇన్‌స్టా స్టోరీలను పోస్ట్ చేస్తోంది. -
కృష్ణుని కోసం ప్రాణాలు తీసుకున్న రష్యన్ యువతి
లక్నో: దేవుడంటే ఆమెకు అమిత భక్తి. నిత్యం శ్రీకృష్ణుని నామస్మరణలో మునిగి తేలే ఆమె తన ఆరాధ్య దైవాన్ని ఓ సారి దర్శించాలనుకుంది. అందుకోసం ఆత్మహత్య చేసుకుని ఆ దేవుడి చెంతకు చేరేందుకు ప్రయత్నించిన ఘటన శనివారం ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. రష్యన్ యువతి తత్యానా హెలోవ్స్కయ గతేడాది ఫిబ్రవరి నుంచి యూపీలోని వృందావన్ ధామ్ అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో తను ఉంటున్న భవనంలో ఆరో అంతస్థు నుంచి దూకి అర్ధాంతరంగా తనువు చాలించింది. (చదవండి: చేపల కూర విషయమై గొడవ, హత్య) అయితే ఆమెకు కృష్ణుడిని కలవాలన్న కోరిక ఉండేదని, అందుకోసమే ఇలా ప్రాణత్యాగం చేసి ఉండవచ్చని అదే భవనంలో నివసిస్తున్న స్నేహితురాలు పోలీసులకు తెలిపారు. కాగా ఆత్మహత్య చేసుకున్న యువతి రష్యాలోని రోస్తవ్ నగరానికి చెందినదని, ప్రయాణికురాలి వీసా కింద ఇక్కడకు వచ్చిందని పోలీసులు నిర్ధారణ చేశారు. ఆమె మరణ విషయాన్ని రష్యన్ ఎంబసీకి చేరవేశారు. (చదవండి: వెండి సింహాల చోరుడి అరెస్ట్) -
తిరుపతిలో ఇబ్బందిపడుతున్న రష్యన్ యువతి
-
లాక్డౌన్ కష్టాల్లో రష్యన్ యువతి
యూనివర్సిటీ క్యాంపస్: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చిన రష్యన్ యువతి ఎస్తర్ తిరుపతిలో కష్టాలు పడుతోంది. శ్రీవారి దర్శన భాగ్యం లభించక తెచ్చుకున్న నగదు ఖర్చయిపోయి సాయం కోసం ఎదురుచూస్తోంది. ఈ విషయం తెలుసుకున్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆమెకు నగదు సాయం అందించారు. రష్యాకు వెళ్లేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. రష్యాకు చెందిన ఎస్తర్ (32) ఈ ఏడాది ఫిబ్రవరి 6న తన తల్లి ఒలివియాతో కలిసి ఇండియా వచ్చింది. వృత్తి ఫిజియోథెరపిస్ట్. ఆమెకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఆలయ అలంకరణలో ప్రవేశం ఉంది. టూరిస్ట్ వీసాపై వచ్చాక మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో వివిధ ప్రదేశాలు సందర్శించారు. ఈ లోపు దేశంలో కరోనా ప్రభావం పెరగడంతో లాక్డౌన్ విధించారు. విదేశీ విమానాలు రద్దు చేయడం, తిరిగి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇండియాలోనే గడిపారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకోవటానికి ఈ నెల 19న తిరుపతి వచ్చారు. కోవిడ్ కారణంగా విదేశీ భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం లేదని తెలుసుకుని నిరాశ చెందారు. అధికారులు అవకాశం ఇస్తే దర్శనం చేసుకోవాలని ఎదురుచూశారు. ఈ దశలో వారి వద్ద డబ్బులు అయిపోవడంతో తల్లి ఒలివియా రష్యన్లు ఎక్కువగా వచ్చే యూపీలోని బృందావనం పట్టణం చేరింది. కరోనా కారణంగా విదేశీ యాత్రికులు రాకపోవడంతో అక్కడ నిరాశ ఎదురైంది. ఈ కారణంగా తల్లి ఉత్తరప్రదేశ్‌లో, కూతురు తిరుపతిలో ఉండాల్సి వచ్చింది. చేతిలో డబ్బులేని కారణంగా తాను ఉన్న హోటల్ గది ఖాళీ చేసి ఇస్కాన్‌లో ఆశ్రయం కోసం ప్రయత్నించింది. అక్కడ యాత్రికుల వసతిపై ఆంక్షలు ఉండటంతో ఇస్కాన్‌లో ఉండే సదా రాందాస్ తాను భోజనం వరకు తగిన ఏర్పాట్లు చేయగలనని, వసతి కోసం ఎక్కడైనా ఇంటిని అద్దెకు ప్రయత్నిస్తానని చెప్పారు. అయితే చేతిలో డబ్బులేక అలిపిరి రోడ్లో తిరుతున్న ఎస్తర్ పరిస్థితి గమనించి కపిల తీర్థం సమీపంలోని ఒక రెసిడెన్సీలో వసతి కల్పించారు. ఆమె మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ వద్ద ప్రస్తుతం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయ న్నారు. డబ్బు కోసం యూపీలోని బృందావనం వెళ్లిన తన తల్లి అక్కడే ఇరుక్కుపోయిందన్నారు. ఎవరైనా సహాయం చేస్తే తన తల్లితో కలిసి రష్యా వెళ్లిపోతానని చెప్పారు. తనకు ఉచితంగా సాయం వద్దని తనకు తెలిసిన వైద్యం అవసరమైన వాళ్లకు అందిస్తానని తెలిపారు. ఆమె వసతి పొందుతున్న రెసిడెన్సీ ఉద్యోగి పాండు మాట్లాడుతూ అలిపిరి రోడ్డులో తిరుగుతుంటే వివరాలు తెలుసుకుని వసతి కల్పించామన్నారు. ఆమె కష్టాలు తెలిసి కొంతమంది సçహాయం చేయటానికి ముందుకొచ్చారన్నారు. ఎస్తర్ కష్టాలు తెలుసుకుని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తక్షణం స్పందించారు. తన పీఏ ఆర్.వెంకటేశ్వర్లును పంపి నగదు సాయం అందించారు. శ్రీవారి దర్శనం కల్పిస్తాం: చెవిరెడ్డి ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆమెను మంగళవారం స్వయంగా కలిసి భరోసా ఇచ్చా రు. తన కోటాలో శ్రీవారి దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తన సొంత నిధులతో రష్యాకు పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అప్పటివరకు భోజన వసతి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. -
పాలకూర పప్పు, పన్నీర్ రుచిగా వండుతా
సాక్షి, సిటీబ్యూరో: ఆ యువతిది రష్యా. మాస్కోలో బాలీవుడ్ డ్యాన్స్ చూసి ముచ్చట పడింది. భారతీయ సంప్రదాయ నృత్యాల గురించి తెలుసుకుంది. కథక్ నాట్యం పట్ల ఆకర్షితురాలైంది. జీవితాంతం కథక్ నృత్య కళాకారిణిగానే కొనసాగాలని నిశ్చయించుకుంది. 9 ఏళ్ల శిక్షణ తర్వాత తొలిసారిగా సోలో ప్రదర్శన ఇవ్వడానికి తాను నృత్యం నేర్చుకున్న హైదరాబాద్నగరానికి ఇటీవల వచ్చింది. ఆమె కథక్ నృత్యకారిణి కేథరిన్ క్రివెంకో. తొలి నాట్య ప్రదర్శన అనంతరం తన అనుభవాలను ‘సాక్షి’తో ఇలా పంచుకుంది. భారతీయ వంటలు నేర్చుకున్నా.. ఇండియాకు రాకముందు నాకు ఇంగ్లిష్ సరిగా రాదు. కొన్ని హిందీ పదాలు తప్ప ఎక్కువగా తెలియదు. ఇండియా వంటలు వండటం నేర్చుకున్నాను. పాలకూర పప్పు, పన్నీర్, ఎగ్ కర్రీ, బటర్ చికెన్, మేథీ చికెన్ నేర్చుకున్నాను. 2015లో త్యాగరాజ సంగీత కాలేజ్‌లో హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నాను. విజయ్ మరార్ వీడియోల్లో పనిచేశాను. తెలంగాణ బతుకమ్మ వీడియోలో ఫ్రెండ్స్‌తో కలిసి కనిపిస్తాను. హైదరాబాద్.. సెల్ఫ్ సఫీషియెంట్.. ఇండియాలో అన్ని ప్రదేశాల కంటే హైదరాబాద్ అంటే ఇష్టం. ఇది నా హోం. ఈ సిటీ ఎందుకు ఇష్టమంటే.. ఇక్కడ ఏం తినాలన్నా లభిస్తుంది. మొఘలాయి, ఆంధ్రా, ఇటాలియన్, చైనీస్, జపనీస్ ఇలా అన్ని క్విజైన్ ఫుడ్స్ లభిస్తాయి. ఇక్కడ అనేక సంస్కృతులు ఉన్నాయి. సంప్రదాయ బద్ధమైన లైఫ్‌కి అవకాశం ఉంది. ఇక్కడ బస్సు, మెట్రో, ఆటోలో కూడా సులభంగా వెళ్లగలం. హైదరాబాద్‌లో భద్రత విషయంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. నా వరకు హైదరాబాద్ బ్యూటీ సిటీ. రష్యన్స్ లైక్ లామకాన్.. కథక్ శిక్షణ పూర్తయిన తర్వాత కూడా మధ్య మధ్యలో ఇండియాకు వచ్చి వెళ్లేదాన్ని. స్నేహితులతో కలిసి నృత్య ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. డిసెంబర్ 13న నా మొదటి సోలో ప్రదర్శన ఇచ్చాను. కళలకు, కళాకారులకు ఎంతో విలువనిచ్చే లామకాన్లోనే నా మొదటి సోలో ప్రదర్శన ఇవ్వటం నాకు ఎనలేని సంతోషాన్నిచ్చింది. బాలీవుడ్ డ్యాన్స్ బాగా పాపులర్.. కలర్‌ఫుల్ దుస్తులు, జాయ్‌ఫుల్‌గా ఉండటం వల్ల రష్యాలో బాలీవుడ్ డ్యాన్స్ చాలా పాపులర్. మా దేశంలో చాలా చోట్ల బాలీవుడ్ డ్యాన్స్ నేర్పించే సెంటర్లు ఉన్నాయి. 2010లో మాస్కోలోని ఓ స్కూల్లో బాలీవుడ్ డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్లాను. అప్పుడు నాకు ఇండియాలో క్లాసికల్ డ్యాన్సులున్నాయనే సంగతి తెలియదు. అక్కడ బేసిక్ కథక్ స్టెప్స్నేర్పించారు. 10– 15 నిమిషాలు కథక్ డ్యాన్స్ చూపించారు. నాకు చాలా నచ్చింది. అప్పుడు ఫ్రెండ్ ఇండియన్ అంబసీలో కథక్ నేర్పిస్తున్న సంగతి చెప్పింది. అలా కథక్ నాట్య గురువు రాఘవ్రాజ్ భట్ వద్ద ఏడాది పాటు కథక్ నృత్యంలో శిక్షణ పొందాను. తర్వాత ఆయన స్కాలర్షిప్ అప్లై చేసి ఇండియాలో కథక్ నేర్చుకోమ్మని సూచించారు. స్కాలర్‌షిప్‌తో ఇండియాకు వచ్చి ఆకృతి కథక్ కేంద్రంలో మంగళా భట్ వద్ద 2013– 16 వరకు కథక్ నేర్చుకున్నాను. బాలీవుడ్ సినిమాలు చూసేదాన్ని.. చిన్నప్పటి నుంచే నేను బాలీవుడ్ చిత్రాలు చూసేదాన్ని. అలా హిందీ భాష తెలుసు. కుచ్ కుచ్ హోతా హై, రబ్ దే బనాది జోడీ, దిల్ తో పాగల్ హై, దిల్, ఖయామత్ సే ఖయామత్ తక్ నా ఫేవరెట్ చిత్రాలు. మా అమ్మ హిందీ చిత్రాల వీడియో క్యాసెట్లు తీసుకువచ్చేది. రష్యాలో చాలా మంది బాలీవుడ్ చిత్రాలు చూస్తారు. ఇండియాకు వచ్చిన తర్వాతే.. ఇండియన్ డ్యాన్స్ అంటే బాలీవుడ్ డ్యాన్స్ అని అనుకునేదాన్ని.బాలీవుడ్ నృత్యాల్లో కథక్, కూచిపూడి, బాంగ్డా కలిపి ఉంటాయని తెలియదు. ఇండియాకు వచ్చిన తర్వాతే ఈ నృత్యాల గురించి తెలిసింది. బాలీవుడ్ డాన్స్‌తో పాటు భరతనాట్యం, కథక్, కూచిపూడి, మోహిని అట్టం కూడా ఇప్పుడు రష్యాలో విరివిగా నేర్చుకుంటున్నారు. ఇండియన్స్, ఇండియా నుంచి నేర్చుకుని వెళ్లిన వాళ్లు ఈ నృత్యాలు నేర్పిస్తుంటారు. 25 మందికి శిక్షణ ఇస్తున్నా.. ఎప్పటికీ కథక్ నృత్యం చేస్తుండాలని, శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రస్తుతం 25 మంది విద్యార్థులు నా వద్ద శిక్షణ పొందుతున్నారు. కథక్ సరదాగా నేర్చుకునే నృత్యం కాదు. ఈ నృత్యానికి ఆసక్తి, డిసిప్లిన్, శ్రద్ధ లేకపోతే కష్టం. నా దగ్గర కథక్ నేర్చుకుంటున్న వాళ్లలో 19 నుంచి 50 ఏళ్ల వయసున్న వాళ్లున్నారు. -
విదేశీయులతో శృంగారంలో పాల్గొనకండి!
మాస్కో : సాకర్ వరల్డ్ కప్ సందర్భంగా రష్యా మహిళలు శ్వేతజాతియేతర విదేశీయులతో శృంగారంలో పాల్గొనకూడదని ఆ దేశ ప్రజాప్రతినిధి ఒకరు సూచించారు. శ్వేతజాతియేతర విదేశీయులతో లైంగిక సంబంధం పెట్టుకుంటే.. మిశ్రమ జాతి (మిక్స్డ్ రేస్) పిల్లలతో సింగిల్ మదర్‌గా మహిళలు మిగిలిపోయే అవకాశముందని అన్నారు. రష్యా మహిళలు విదేశీయులతో చేసుకుంటున్న వివాహ సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయని, రష్యా మహిళలు విదేశాల్లో చిక్కుకుపోవడం, లేదా వారు దేశంలో ఉంటే.. వారి పిల్లలు విదేశాల్లో ఉండటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని సీనియర్ చట్టసభ సభ్యురాలు, కుటుంబ వ్యవహారాలు, మహిళా శిశు పార్లమెంటు కమిటీ చైర్మన్ తమరా ప్లెట్‌న్యోవా తెలిపారు. 1980లో మాస్కో ఒలింపిక్స్ సందర్భంగా విదేశీయులతో సంబంధాల కారణంగా రష్యా మహిళలు పిల్లలను కన్నారు. అప్పట్లో గర్భనిరోధక పద్ధతులు అంతగా అందుబాటులో లేకపోవడంతో ఇలా పుట్టిన చిన్నారులు ‘ఒలింపిక్ పిల్లలు’గా ముద్రపడ్డారు. అంతర్జాతీయ క్రీడల సందర్భంగా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా పురుషులతో సంబంధాల వల్ల రష్యా మహిళలకు పుట్టిన శ్వేతజాతియేతర పిల్లలను పిలిచేందుకు సోవియట్ హయాంలో ఈ పదాన్ని వాడేవారు. ఈ పిల్లలు రష్యాలో వివక్షను ఎదుర్కొన్నారు. ఈ విషయమై ఓ ప్రశ్నకు బదులిచ్చిన తమరా.. ‘మన పిల్లలకు మాత్రమే మనం జన్మనివ్వాలి. సోవియట్ కాలం నుంచి మిశ్రమ జాతి పిల్లలు ఎన్నో కష్టాలు పడ్డారు’ అని ఆమె స్థానిక రేడియో కార్యక్రమంలో పేర్కొన్నారు. నేటి నుంచి ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. -
'సెక్స్ రాకెట్ లో ఇరక్కుంటానని అనుకోలేదు'
న్యూఢిల్లీ: తాను బంగారం పంజరంలో చిక్కుకున్న పక్షినని ఢిల్లీ సెక్స్ రాకెట్ నుంచి బయటపడిన రష్యా యువతి పేర్కొంది. ప్రితీంద్రనాథ్ సన్యాల్ తనకు పావుగా వాడుకున్నాడని ఆమె తెలిపారు. సప్ధర్‌జంగ్ లోని సన్యాల్ ఇంటి నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు ఆమెను కాపాడారు. రష్యా రాయబారా కార్యాలయం జోక్యంతో పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తర్వాత చేతి మణికట్టు కోసుకుని ఆమె ఆత్మాహత్యాయ్నం చేసింది. 'ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఇండియాకు వచ్చాను. అజయ్ అహ్లవత్ నాకు స్పాన్సర్ గా ఉన్నాడు. నా వీసా ఆగస్టు వరకు ఉంది. నన్ను బిజ్ వాసన్ ప్రాంతంలోని అహ్లవత్ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు. నాకు సంబంధించిన అన్ని అంశాలను రాడియా అనే మహిళ చూసుకునేది. ఫామ్ హౌస్ లోనే సన్యాల్ కు నన్ను పరియచం చేశారు. నా బాగోగులు సన్యాల్ చూసుకుంటారని అహ్లవత్ చెప్పాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని సన్యాల్ మాటిచ్చాడు. మేమిద్దం దంపతుల్లా మెలిగేవాళ్లం. ఐటీ ఉన్నతాధికారులు, ఆయుధ డీలర్లకు నన్ను పరిచయం చేశాడు. వాళ్లు నాతో చనువుగా ఉన్నా పట్టించుకునే వాడు కాదు. సన్యాల్ నా కంటే వయసులో చాలా పెద్దవాడని తెలుసు. డబ్బు కోసం అతడిని పెళ్లిచేసుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే నా కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. కానీ సెక్స్ రాకెట్ లో ఇరుక్కుంటానని ఊహించలేదు. నేను తిరిగి మా దేశానికి వెళ్లిపోవాలనుకుంటున్నా'నని 23 ఏళ్ల రష్యా యువతి తెలిపింది. బాధితురాలు వెల్లడించిన ఆధారాలతో కేసు దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ(సౌత్) ఈశ్వర్ సింగ్ తెలిపారు. -
గోవాలో రష్యా యువతిపై దారుణం
పనాజీ: గోవాలో దారుణం జరిగింది. విహారయాత్రకు వచ్చిన రష్యా యువతిని గెస్ట్ హౌస్ యజమాని అత్యాచారం చేశాడు. శుక్రవారం గెస్ట్ హౌస్‌లో అద్దెకు తీసుకున్న గదిలో ఆమె నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పెర్నెమ్ ఇన్స్పెక్టర్ సంజయ్ దాల్వి చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. నిందితుడిని జేమ్స్ డిసౌజాగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. -
వారణాసిలో దారుణం
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో దారుణం జరిగింది. రష్యా మహిళ(23)పై దుండగుడు యాసిడ్ తో దాడి చేశాడు. ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలిని హుటాహూటిన సమీపంలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలు నివాసముంటున్న ఇంటి యజమాని మనవడే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం వారణానికి వచ్చిన బాధితురాలు నందానగర్ కాలనీలోని హృదయ్ లాల్ శ్రీవాస్తవ ఇంట్లో పెయింగ్ గెస్ట్ గా దిగింది. మూడో అంతస్థులోని తన గదిలో నిద్రిస్తుండగా హృదయ్ లాల్ మనవడు సిద్ధార్థ శ్రీవాస్తవ తనపై యాడిస్ తో దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. వీసా గడువు ముగియడంతో స్వదేశానికి తిరిగి వెళ్తానని చెప్పడంతో తనపై దాడికి దిగినట్టు పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్ధార్ధ్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
తుపాకీ తలకు గురిపెట్టుకుని సెల్ఫీ!
మాస్కో: సెల్ఫీ తీసుకుంటూ ఓ రష్యా మహిళ ప్రాణాలు మీదకు తెచ్చుకుంది. తుపాకీని తలకు గురిపెట్టుకుని సెల్ఫీ తీసుకుంటూ సదరు మహిళ గాయాలపాలైందని మాస్కో పోలీసులు తెలిపారు. తన కార్యాలయంలో సెల్ఫీ తీసుకోవాలని ముచ్చటపడిన మహిళ సెక్యురిటీ గార్డు దగ్గర నుంచి పెల్లెట్ తుపాకీ తీసుకుంది. దాన్ని తలకు గురిపెట్టుకుని సెల్ఫీ తీసుకోవాలనుకుంది. అదే సమయంలో ట్రిగ్గర్ నొక్కడంతో రబ్బరు బుల్లెట్లు ఆమె తలలోకి దూసుకుపోయి ఆస్పత్రి పాలైంది. గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే సమయంలో సెంట్రల్ మాస్కోలో ఆర్చ్ డ్ బ్రిడ్జి నుంచి దూకుతూ ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. సెల్ఫీ సరదా ఎన్నో ప్రమాదాలకు కారణమవుతోంది. సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో ఐదో అంతస్థు నుంచి దూకుతూ 9వ తరగతి విద్యార్థి సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు.