![తుపాకీ తలకు గురిపెట్టుకుని సెల్ఫీ!](/styles/webp/s3/article_images/2017/09/3/61432304015_625x300.jpg.webp?itok=UVWVWYFJ)
తుపాకీ తలకు గురిపెట్టుకుని సెల్ఫీ!
మాస్కో: సెల్ఫీ తీసుకుంటూ ఓ రష్యా మహిళ ప్రాణాలు మీదకు తెచ్చుకుంది. తుపాకీని తలకు గురిపెట్టుకుని సెల్ఫీ తీసుకుంటూ సదరు మహిళ గాయాలపాలైందని మాస్కో పోలీసులు తెలిపారు. తన కార్యాలయంలో సెల్ఫీ తీసుకోవాలని ముచ్చటపడిన మహిళ సెక్యురిటీ గార్డు దగ్గర నుంచి పెల్లెట్ తుపాకీ తీసుకుంది. దాన్ని తలకు గురిపెట్టుకుని సెల్ఫీ తీసుకోవాలనుకుంది. అదే సమయంలో ట్రిగ్గర్ నొక్కడంతో రబ్బరు బుల్లెట్లు ఆమె తలలోకి దూసుకుపోయి ఆస్పత్రి పాలైంది. గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇదే సమయంలో సెంట్రల్ మాస్కోలో ఆర్చ్ డ్ బ్రిడ్జి నుంచి దూకుతూ ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. సెల్ఫీ సరదా ఎన్నో ప్రమాదాలకు కారణమవుతోంది. సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో ఐదో అంతస్థు నుంచి దూకుతూ 9వ తరగతి విద్యార్థి సెల్ఫీ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు.