వారణాసిలో దారుణం | Russian woman critical after acid attack in Varanasi | Sakshi
Sakshi News home page

వారణాసిలో దారుణం

Published Fri, Nov 13 2015 2:00 PM | Last Updated on Fri, Aug 17 2018 2:10 PM

వారణాసిలో దారుణం - Sakshi

వారణాసిలో దారుణం

వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో దారుణం జరిగింది. రష్యా మహిళ(23)పై దుండగుడు యాసిడ్ తో దాడి చేశాడు. ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలిని హుటాహూటిన సమీపంలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలు నివాసముంటున్న ఇంటి యజమాని మనవడే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.

మూడు రోజుల క్రితం వారణానికి వచ్చిన బాధితురాలు నందానగర్ కాలనీలోని హృదయ్ లాల్ శ్రీవాస్తవ ఇంట్లో పెయింగ్ గెస్ట్ గా దిగింది. మూడో అంతస్థులోని తన గదిలో నిద్రిస్తుండగా హృదయ్ లాల్ మనవడు సిద్ధార్థ శ్రీవాస్తవ తనపై యాడిస్ తో దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. వీసా గడువు ముగియడంతో స్వదేశానికి తిరిగి వెళ్తానని చెప్పడంతో తనపై దాడికి దిగినట్టు పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్ధార్ధ్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement