ప్రధాని మోదీ ఆఫీస్‌ను అమ్మబోయారు! | PM Narendra Modi Varanasi Office Listed On OLX For Sale | Sakshi
Sakshi News home page

ప్రధాని ఆఫీస్‌ను అమ్మబోయారు! 

Published Sat, Dec 19 2020 8:11 AM | Last Updated on Sat, Dec 19 2020 1:13 PM

PM Narendra Modi Varanasi Office Listed On OLX For Sale - Sakshi

వారణాసి : ప్రధాని నరేంద్ర మోదీ ప్రజావ్యవహారాల కార్యాలయాన్ని కొందరు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వారిని అరెస్టు చేశారు. వివరాలు.. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని గురుధామ్ కాలనీలో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయాన్ని రూ.7.5 కోట్లకు కొందరు ఆకతాయిలు ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టారు. ఈ యాడ్ ప్రకారం లక్ష్మీకాంత్ ఓజా అనే వ్యక్తి ప్రధాని కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టాడు. ఇందులో నాలుగు బెడ్ రూమ్‌లు, నాలుగు బాత్‌రూమ్‌లు మొత్తంగా 6,500 చదరపు అడుగులు ఉన్నట్టు పేర్కొన్నారు. రెండు అంతస్థులు, రెండు కార్ల పార్కింగ్‌కు సంబంధించిన స్పేస్ ఉండే ఈ భవనాన్ని మినీ పీఎంవోగా తెలిపారు.

ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో ముందుగా అవాక్కయ్యారు వెంటనే ఆ యాడ్‌‌ను తొలగించారు. బెలుపూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేశారు. కొన్ని అసాంఘిక శక్తులు ఈ రకమైన చర్యలు పాల్పడ్డాయని వారణాసి సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ పాఠక్ తెలిపారు. లక్ష్మీకాంత్ ఓజా సహా నలుగురికి అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement