'సెక్స్ రాకెట్ లో ఇరక్కుంటానని అనుకోలేదు'
న్యూఢిల్లీ: తాను బంగారం పంజరంలో చిక్కుకున్న పక్షినని ఢిల్లీ సెక్స్ రాకెట్ నుంచి బయటపడిన రష్యా యువతి పేర్కొంది. ప్రితీంద్రనాథ్ సన్యాల్ తనకు పావుగా వాడుకున్నాడని ఆమె తెలిపారు. సప్ధర్జంగ్ లోని సన్యాల్ ఇంటి నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు ఆమెను కాపాడారు. రష్యా రాయబారా కార్యాలయం జోక్యంతో పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తర్వాత చేతి మణికట్టు కోసుకుని ఆమె ఆత్మాహత్యాయ్నం చేసింది.
'ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఇండియాకు వచ్చాను. అజయ్ అహ్లవత్ నాకు స్పాన్సర్ గా ఉన్నాడు. నా వీసా ఆగస్టు వరకు ఉంది. నన్ను బిజ్ వాసన్ ప్రాంతంలోని అహ్లవత్ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు. నాకు సంబంధించిన అన్ని అంశాలను రాడియా అనే మహిళ చూసుకునేది. ఫామ్ హౌస్ లోనే సన్యాల్ కు నన్ను పరియచం చేశారు. నా బాగోగులు సన్యాల్ చూసుకుంటారని అహ్లవత్ చెప్పాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని సన్యాల్ మాటిచ్చాడు. మేమిద్దం దంపతుల్లా మెలిగేవాళ్లం. ఐటీ ఉన్నతాధికారులు, ఆయుధ డీలర్లకు నన్ను పరిచయం చేశాడు. వాళ్లు నాతో చనువుగా ఉన్నా పట్టించుకునే వాడు కాదు.
సన్యాల్ నా కంటే వయసులో చాలా పెద్దవాడని తెలుసు. డబ్బు కోసం అతడిని పెళ్లిచేసుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే నా కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. కానీ సెక్స్ రాకెట్ లో ఇరుక్కుంటానని ఊహించలేదు. నేను తిరిగి మా దేశానికి వెళ్లిపోవాలనుకుంటున్నా'నని 23 ఏళ్ల రష్యా యువతి తెలిపింది. బాధితురాలు వెల్లడించిన ఆధారాలతో కేసు దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ(సౌత్) ఈశ్వర్ సింగ్ తెలిపారు.