
ప్రతీకాత్మకచిత్రం
పనాజీ : గోవాలోని పాలోలెమ్ బీచ్ సమీపంలో బ్రిటన్‌కు చెందిన మహిళా టూరిస్ట్‌పై లైంగిక దాడితో పాటు దోపిడీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కనకోనా రైల్వే స్టేషన్ నుంచి బుధవారం తెల్లవారుజామున పాలోలెమ్ బీచ్‌కు వెళుతున్న 48 ఏళ్ల బ్రిటన్ మహిళను అడ్డగించిన దుండగుడు ఆమెను బెదిరించి రోడ్డు పక్కన పంటపొలంలోకి బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనలో నిందితుడిని తమిళనాడుకు చెందిన రామచంద్రప్పగా గుర్తించారు. బాధితురాలి నుంచి నిందితుడు రూ 20,000 నగదు, పాస్‌పోర్ట్, మరికొన్ని వస్తువులు దొంగిలించాడని, నగదు మినహా మిగిలిన వాటిని నేరం జరిగిన 50 మీటర్లలోపు లభించాయని గోవా ఐజీపీ జస్పాల్ సింగ్ వెల్లడించారు. బాధితురాలు పేర్కొన్న వివరాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని మార్గో రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కనకోనా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment