
గోవా బీచ్ (ప్రతీకాత్మక చిత్రం)
సాక్షి, గోవా : రిపబ్లిక్ డే వీకెండ్ సందర్భంగా గోవాకు వచ్చిన ఓ విదేశీ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. అర్పొరా నైట్ మార్కెట్ నుంచి ఉత్తర గోవాలోని మోర్జిమ్ ప్రాంతంలోని హోటల్‌కు వెళ్లేందుకు ఓ బైక్ రైడర్‌ను అద్దెకు తీసుకోగా అతడు ఆమెను బెంబేలెత్తిపోయేలా చేశాడు. ఈ సంఘటన మొత్తాన్ని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో తెలిపింది. పూర్తి వివరాలు పరిశీలిస్తే.. అమెరికాకు చెందిన ఓ మహిళ ఓ బైకిస్టును మాట్లాడుకొని డిన్నర్ చేసేందుకు ఓ రెస్టారెంటుకు తీసుకెళ్లాలని కోరింది. అతడి ప్రవర్తన బాగుందని అనిపించడంతో తనన మోర్జిమ్‌లోని తాను దిగిన హోటల్‌కు తీసుకెళ్లాలని కోరింది.
అయితే, అతడు తీసుకెళ్లే క్రమంలో అంతకుముందు ఆమె వచ్చిన మార్గంలో కాకుండా వేరే దారిలో తీసుకెళ్లడం ప్రారంభించాడు. అనుమానం వచ్చిన ఆమె ప్రశ్నించగా తనకు షార్ట్‌కట్ మార్గాలు తెలుసని చెప్పి దాదాపు 40 నిమిషాలపాటు తిప్పాడు. అనంతరం డ్రైవింగ్ కొనసాగుతుండగానే ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యంగా తాకుతూ ఇబ్బంది పెట్టాడు. దాంతో ఏం జరగబోతుందో ఊహించుకొని బెంబేలెత్తిపోయింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి కాసేపు బైక్ ఆపాలని చెప్పింది. అతడు బైక్ ఆపగానే ఓ రూ.500 వందలు అతడి ముఖాని విసిరి కొట్టి పారిపోయి జనాలు గుంపులుగా ఉన్న చోటుకు వెళ్లి బయటపడింది. ఈ సంఘటన మొత్తం గోవా పర్యాటక శాఖకు తన ఫేస్‌బుక్ ద్వారా వివరించడమే కాకుండా నిందితుడి ఫొటోను కూడా వారికి పంపించింది.
Comments
Please login to add a commentAdd a comment