Anchor Anasuya & Sri Reddy Reacts on 'Chicago Sex Rocket' Issue - Sakshi
Sakshi News home page

Published Sat, Jun 16 2018 12:36 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Anasuya Sri Reddy Response On America Sex Racket - Sakshi

శ్రీరెడ్డి, అనసూయ (ఫైల్‌ ఫొటో)

హైదరాబాద్‌ : టాలీవుడ్‌లో సంచలనం రేకిత్తించిన చికాగో సెక్స్‌ రాకెట్‌ బాధితుల్లో ఇద్దరు టాప్‌ హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు బయటకు రాకపోయినప్పటికీ సౌత్‌ స్టార్సేనని ప్రచారం జరుగుతోంది. అమెరికాలో టాలీవుడ్‌ నటీమణులతో వ్యభిచారం నిర్వహిస్తున్న తెలుగు దంపతులను ఫెడరల్‌ ఏజెన్సీలు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన కిషన్‌ మోదుగుముడి అలియాస్‌ రాజు అలియాస్‌ శ్రీరాజు, అతని భార్య చంద్రలు టాలీవుడ్‌కు చెందిన నటీమణులను తాత్కాలిక వీసా మీద అమెరికాకు తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు అభియోగాలు నమోదుచేశారు.  అయితే ఈ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ మా అసోసియేషన్‌ జూన్‌ 24 సమావేశం కానున్నట్లు ప్రకటించింది. ఈ అమెరికా దంపతులు గతంలో తమను కూడా సంప్రదించారని నటి శ్రీరెడ్డి, యాంకర్‌ కమ్‌ నటి అనసూయలు ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. 

మాట్లాడే తీరు నచ్చక తిరస్కరించాను: అనసూయ
ఈ ఉదంతంపై యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ స్పందిస్తూ.. ‘ చాలా రోజులుగా నేను అమెరికా వెళ్లలేదు. 2014లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌లో ఓ ఈవెంట్‌కు హాజరయ్యాను. 2016లో అమెరికా నెంబర్‌తో శ్రీరాజ్‌ అనే వ్యక్తి నన్ను సంప్రదించాడు. తెలుగు అసోసియేషన్‌ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరుకావాలని కోరాడు. అతను మాట్లాడే విధానం నచ్చక నేను తిరస్కరించాను. నేను తిరస్కరించినా కూడా పోస్టర్‌లో నాఫొటోను ప్రచురించారు. ఆ ఈవెంట్‌లో పాల్గొనడం లేదని అప్పట్లో నేను ట్విటర్‌ ద్వారా స్పష్టం చేశాను’ అని అనసూయ తెలిపారు.

పాపులారిటీని బట్టి ధర: శ్రీరెడ్డి
క్యాస్టింగ్‌ కౌచ్‌పై ఉద్యమిస్తూ వార్తాల్లో నిలిచిన నటి శ్రీరైడ్డి సైతం.. ఆ అమెరికా దంపతులు తనను కూడా సం‍ప్రందించారని తెలిపారు. ‘అవకాశాల్లేని హీరోయిన్లను ఈవెంట్స్‌ కోసం అమెరికాకు రప్పించి.. అక్కడ వారిని మభ్యపెట్టి వ్యభిచారాంలోకి దింపుతున్నారు. అలా వెళ్లిన ఆర్టిస్టులకు సుమారు 1000 అమెరికా డాలర్లు ఆఫర్‌ చేస్తున్నారు. ఈ ఆఫర్‌ వారి పాపులారిటీని బట్టి ఉంటుంది.’ అని ఆమె చెప్పుకొచ్చారు.

జూన్‌24 న సమావేశం : శివాజీ
ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు ఆర్టిస్టులను హెచ్చరించినట్లు మూవీఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీ రాజా తెలిపారు. ఆయన ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘ కిషన్‌ మోదుగుముడి నిర్వహించే వ్యవహారలపై మాకు అవగాహన ఉంది. అతను ఓ రెండు సినిమాలకు కో ప్రోడ్యూసర్‌, ప్రొడక్షన్‌ మెనేజర్‌గా చేసినట్లున్నాడు. ఈవెంట్స్‌ ప్రదర్శనల కోసం విదేశాలకు వెళ్లే ఆర్టిస్టులను జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాం. కొన్నేళ్ల కిత్రం నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యవహారాలను కొన్ని గుర్తించాం. అమెరికా, సింగపూర్‌, దుబాయ్‌, ఆస్ట్రేలియాలోని కార్యక్రమాలకు వెళ్లే ఆర్టిస్టులకు వీసా సమస్యల గురించి అవగాహన లేదు. ఈ ఉందంతంపై మా అసోసియేషన్‌ జూన్‌ 24న సమావేశం అవుతోంది. విదేశాలకు వెళ్లే ఆర్టిస్టులు అక్కడి కార్యక్రమాల వివరాలను మాకు అందజేయాలి. అప్పుడు ఆర్గనైజర్స్‌తో మాట్లాడి కార్యక్రమాల విషయాన్ని ధృవీకరిస్తామని’ ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement