AP Government Attached Chandrababu Guest House in Karakatta - Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు భారీ షాక్..

Published Sun, May 14 2023 11:55 AM | Last Updated on Mon, May 15 2023 9:38 AM

Ap Government Attached Chandrababu Guest House In Karakatta - Sakshi

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు భారీ షాక్‌ తగిలింది. కరకట్టపై ఆయన గెస్ట్‌హౌస్‌ను ఏపీ ప్రభుత్వం అటాచ్‌ చేసింది. క్రిమినల్‌ లా అమెండ్మెంట్‌ 1944 చట్టం ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు, మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. సీఆర్డీయే మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడి.. బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్‌ పొందారని అభియోగాలున్నాయి. చట్టాలను, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారంటూ విచారణలో తేలింది.

తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని అభియోగాలున్నాయి. వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్‌ తీసుకున్నారని చంద్రబాబుపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో క్రిమినల్‌ లా అమెండమెంట్‌ 1944 చట్టం ప్రకారం అటాచ్‌ చేయాలని ప్రభుత్వాన్ని సీఐడీ కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేసింది. స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై లింగమనేని గెస్ట్‌ హౌస్‌ను అటాచ్ చేసింది.

నారాయణ బంధువుల ఆస్తులు అటాచ్‌
ఈ గెస్ట్‌హౌస్‌తో పాటు నారాయణ బంధువుల ఆస్తులు, బ్యాంకు ఖాతాల్లో డబ్బును సీఐడీ అటాచ్ చేసింది. నారాయణ కుటుంబసభ్యులు, బినామీలకు చెందిన 75,880 చదరపు అడుగుల ఆస్తులు అటాచ్ చేసింది. నారయణ భార్య రమాదేవి, అల్లుడు పునీత్ ఆస్తులు ఇందులో ఉన్నాయి.

చదవండి: నోటికొచ్చినట్లు మాట్లాడితే తప్పు ఒప్పు అవుతుందా? నోటీసులు ఆగుతాయా?

ఆస్తుల విలువ పెంచుకునేందుకు..
లింగమనేని రమేష్ బినామీగా చంద్రబాబు భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఆయనకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్ సైతం మార్చారు. తన ఆస్తలు విలువ పెంచుకునేందుకు రైతులకు నష్టం చేస్తూ రాజధాని ప్లాన్ మార్చారు.  లింగమనేని వద్దే హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసింది. హెరిటేజ్ సంస్థలో అప్పటికే లోకేష్ డైరెక్టర్‌గా ఉన్నాడు.

రాజధానిలో బినామీల పేరుతో టీడీపీ నేతలు భూమలు కొనుగోలు చేశారు. రాజధాని స్టార్టప్ ప్రాంతంలో నారాయణ భూములు కొన్నారు. రూ.3.66 కోట్లతో 2015 జూన్,  జులై, ఆగస్టులో ఈ భూములు కొనుగోలు చేశారు. నారాయణ విద్యాసంస్థల ఉద్యోగి పొత్తూరి ప్రమీల, ట్రెజరర్ రాపూరు సాంబశివరావు పేరుతో భూములు కొన్నారు.

చదవండి: కాపులను దగా చేసింది చేసింది బాబు, పవన్‌ కాదా?: పేర్ని నాని 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement