attach
-
చంద్రబాబుకు భారీ షాక్..
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. కరకట్టపై ఆయన గెస్ట్‌హౌస్‌ను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు, మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ తమ పదవులను దుర్వినియోగం చేసి క్విడోప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్మెంట్లలో అవకతవకలకు పాల్పడి.. బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్‌హౌస్ పొందారని అభియోగాలున్నాయి. చట్టాలను, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారంటూ విచారణలో తేలింది. తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, సన్నిహితులకు ప్రయోజనాలు కల్పించేలా వ్యవహరించారని అభియోగాలున్నాయి. వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నారని చంద్రబాబుపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో క్రిమినల్ లా అమెండమెంట్ 1944 చట్టం ప్రకారం అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని సీఐడీ కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసింది. స్థానిక జడ్జికి సమాచారం ఇస్తూ కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్‌ను అటాచ్ చేసింది. నారాయణ బంధువుల ఆస్తులు అటాచ్ ఈ గెస్ట్‌హౌస్‌తో పాటు నారాయణ బంధువుల ఆస్తులు, బ్యాంకు ఖాతాల్లో డబ్బును సీఐడీ అటాచ్ చేసింది. నారాయణ కుటుంబసభ్యులు, బినామీలకు చెందిన 75,880 చదరపు అడుగుల ఆస్తులు అటాచ్ చేసింది. నారయణ భార్య రమాదేవి, అల్లుడు పునీత్ ఆస్తులు ఇందులో ఉన్నాయి. చదవండి: నోటికొచ్చినట్లు మాట్లాడితే తప్పు ఒప్పు అవుతుందా? నోటీసులు ఆగుతాయా? ఆస్తుల విలువ పెంచుకునేందుకు.. లింగమనేని రమేష్ బినామీగా చంద్రబాబు భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఆయనకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ సైతం మార్చారు. తన ఆస్తలు విలువ పెంచుకునేందుకు రైతులకు నష్టం చేస్తూ రాజధాని ప్లాన్ మార్చారు. లింగమనేని వద్దే హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసింది. హెరిటేజ్ సంస్థలో అప్పటికే లోకేష్ డైరెక్టర్‌గా ఉన్నాడు. రాజధానిలో బినామీల పేరుతో టీడీపీ నేతలు భూమలు కొనుగోలు చేశారు. రాజధాని స్టార్టప్ ప్రాంతంలో నారాయణ భూములు కొన్నారు. రూ.3.66 కోట్లతో 2015 జూన్, జులై, ఆగస్టులో ఈ భూములు కొనుగోలు చేశారు. నారాయణ విద్యాసంస్థల ఉద్యోగి పొత్తూరి ప్రమీల, ట్రెజరర్ రాపూరు సాంబశివరావు పేరుతో భూములు కొన్నారు. చదవండి: కాపులను దగా చేసింది చేసింది బాబు, పవన్ కాదా?: పేర్ని నాని -
అడవి ఏనుగుల బీభత్సం.. వైరల్ వీడియో
చెన్నై : అడవి ఏనుగులు రెండు నగరంలో ప్రవేశించాయి. తెల్లవారుజామును రోడ్ల మీద సంచరిస్తూ బీభత్సం సృష్టించాయి. వివరాలు.. కోయంబత్తూరు సమీపంలోని పూచ్చియూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో జరిగింది ఈ సంఘటన. సోమవారం తెల్లవారుజామున రెండు అడవి ఏనుగులు జనావాసంలోకి ప్రవేశించాయి. రోడ్ల మీద తిరుగుతూ.. ప్రజలను ఇబ్బందులు గురిచేశాయి. అంతటితో ఆగక జనవాసాల మీద దాడి చేస్తూ బీభత్సం సృష్టించాయి. ఈ దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
కాఫీ డే ఫౌండర్‌కు ఐటీ శాఖ ఝలక్
కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త, కెఫే కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థకు ఆదాయ పన్నుశాఖ భారీ షాక్ ఇచ్చింది. ఐటీ సంస్థ మైండ్ ట్రీలో సిద్దార్థకున్న వాటాలను ఐటీ శాఖ ఎటాచ్ చేసింది. ఈ మేరకు మైండ్ ట్రీ శనివారం అందించిన రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది. సిద్ధార్థతోపాటు, సిద్దార్థ అండ్ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు ఉన్న రూ.665కోట్ల విలువైన వాటాలను ఎటాచ్ చేసిందని మైండ్ ట్రీ వెల్లడించింది. సిద్ధార్థకు చెందిన 52.7లక్షల షేర్లు, కాఫీడేకు సంబంధించిన 22.2 లక్షల ఈక్విటీ షేర్ల విక్రయాలు, లేదా బదలాయింపులను కూడా నిషేధించిందని పేర్కొంది. ఐటీ ఆదేశాల ప్రకారం ఈ నిషేధం జనవరి 25నుంచి ఆరునెలల పాటు అమల్లో ఉంటుందని తెలిపింది. మైండ్ ట్రీలో ఆయనకున్న 21 శాతం వాటాను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బెంగళూరు ఐటీ విభాగం ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. డిసెంబరు 2018 త్రైమాసికానికి సిద్ధార్థ మైండ్ ట్రీ లో 3.3 శాతం వాటా (54.69 లక్షల షేర్లు)ను కలిగి ఉండగా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు 1.74 కోట్ల షేర్లు (10.63 శాతం వాటా) ఉన్నాయి. మరో సంస్థ కాఫీ డే ట్రేడింగ్ లిమిటెడ్ 1.05 కోట్ల షేర్లను (6.45 శాతం) కలిగి ఉంది. సంస్థ మిగిలిన ప్రమోటర్లైన సుబ్రతో బాగ్చి, కృష్ణకుమార్ నటరాజన్, ఎన్.ఎస్. పార్థసారథి, రోస్తోవ్ రావణన్లకు కలిపి కంపెనీలో 13 శాతా వాటాను కలిగి ఉన్నారు. మిడ్ సైజ్ ఐటీ సంస్థ మైండ్ ట్రీలోని తన వాటాలను ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, మరో ప్రయివేటు సంస్థ కెకెఆర్‌కు విక్రయించే క్రమంలో తుది దశ చర్చల్లో ఉన్నట్టు సమాచారం. మరో పదిరోజుల్లో ఈ డీల్‌ను సిద్ధార్థ్ పూర్తి చేసుకునేందుకు సిద్ధమవుతుండగా ఐటీ శాఖ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. అయితే ఈ పరిణామంపై అటు మైండ్ టీ ఫౌండర్లు , ఇటు వీజీ సిద్ధార్థ ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా 2017లోనే కాఫీడే సంస్థల యజమాని వీజీ సిద్ధార్థ నివాసం, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఈ సందర్బంగా రూ.650 కోట్ల విలువైన అప్రకటిత ఆస్తులను గుర్తించినట్టు తెలిపింది. అలాగే దీనిపై చర్యలు తీసుకుంటామని కూడా ఐటీ శాఖ ప్రకటించింది. అయితే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నరు, మాజీ కేంద్ర మంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడే వీజీ సిద్ధార్థ. -
పీఎన్బీ స్కాం: రూ. 255కోట్ల హాంకాంగ్ ఆస్తులు ఎటాచ్
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను13వేల కోట్ల రూపాయలకు మోసం చేసి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరిన్నిఆస్తులను ఎటాచ్ చేసింది. హాంకాంగ్‌కు చెందిన రూ. 255 కోట్ల విలువైన ఆస్తులను ఈడీఎటాచ్ చేసింది.మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ ఈ చర్య తీసుకుంది. దీంతో మొత్తం ఎటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ. 4,744కోట్లకు చేరింది. -
యువకుడిని చితకబాదిన కేసులో ఇద్దరు కానిస్టేబుళ్ల బదిలీ
బంజారాహిల్స్: ఈ నెల 9వ తేదీన రాత్రి జూబ్లిహిల్స్ చెక్‌పోస్ట్‌లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అంకిత్ సింగ్ అనే వాహనదారుడిపై దాడి చేసిన ఘటనలో జూబ్లిహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు జితేందర్, వెంకటేష్‌లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వీరిద్దరినీ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఆ రోజు రాత్రి జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అంకిత్ సింగ్‌ను బయటికి లాగి కిందేసి తొక్కిన దృశ్యాలు వీడియోలో నమోదు కాగా బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ వీడియో దృశ్యాలను పరిశీలించిన అధికారులు వీరిద్దరిపై చర్యలు తీసుకున్నారు. యువకుడు ఇచ్చిన ఫిర్యాదుపైనే విచారణ జరిపిన పోలీసు కమిషనర్ తక్షణం కానిస్టేబుళ్లను అటాచ్ చేయాల్సిందిగా ఆదేశించారు. కారులో పక్కన కూర్చున్న వ్యక్తిని సంబంధంలేని విషయంలో తలదూర్చి ఈ కానిస్టేబుళ్లు చితకబాదినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ అంకిత్సింగ్ తమను కొట్టినట్లు జితేందర్ ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేయగా జూబ్లిహిల్స్ పోలీసులు అంకిత్సింగ్ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే వీడియోను మార్ఫింగ్ చేశారని ముందు తననే వారు కొట్టడంతో తాను ఆత్మరక్షణ కోసమే ఎదుర్కోవాల్సి వచ్చిందని బాధితులు వాపోయారు. -
కార్తీ చిదంబరానికి మరో ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఎయిర్ సెల్ మాక్సిస్‌లో సీరియస్‌గా స్పందించిన ఈడీ కోటికిపైగా ఆస్తులను ఎటాచ్ చేసింది. ఎఫ్డీలు, బ్యాంక్ అకౌంట్లతోపాటు గుర్గావ్లో ఇంటిని సీజ్ చేసింది. కార్తీకి చెందిన రూ. 1.16 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోమవారం ఎటాచ్ చేసింది. ముఖ్యంగా అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ASCPL) పేరుతో ఉన్న రూ. 26 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను,ఇతర రూ. 96లక్షల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. గుర్గావ్లోని ఇంటిని బినామీ పేరుతో నిర్వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది. -
రెండు నెలల ముడిపట్టు రాయితీ జమ
వైఎస్సార్సీపీ పోరాట ఫలితం - పెండింగ్ బకాయిలు చెల్లించేవరకు దీక్షలు ఆపేదిలేదంటున్న వైఎస్సార్సీపీ ధర్మవరం: వైఎస్సార్సీపీ పోరాటాలతో ప్రభుత్వం దిగివచ్చింది. చేనేతలకు అందాల్సిన బకాయిలో రెండు నెలల మొత్తాన్ని వారి ఖాతాల్లోకి గురువారం జమ చేసింది. అయితే మొత్తం 19 నెలలు బకాయిలు ఉంటే కేవలం రెండు నెలలకు సంబంధించినవి మాత్రమే జమచేస్తారా..? చేనేతలకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు అందేవరకు దీక్షలు ఆపేదిలేదని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. చేనేతల జీవితాలతో చెలగాటం : ముడిపట్టు రాయితీ పథకం అస్తవ్యస్తంపై వైఎస్సార్సీపీ ఎప్పటికప్పుడు ఉద్యమిస్తోంది. మాజీ ఎమ్మెల్యే, పార్టీ ధర్మవరం సమన్వయకర్త గతేడాది జూలై నెలలోనూ ఈ ఏడాది జనవరిలోనూ , ఆగష్టు నెలలో మరోసారి పట్టణంలో సంతకాల సేకరణ చేపట్టి, సెరిఫెడ్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. ఆగస్టు నెలలో చేపట్టిన ధర్నాలో నెల రోజులు గడువు ఇచ్చి.. నెలలోపు చేనేతలకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోతే రిలే దీక్షలు చేస్తామని హెచ్చరించారు. అయితే ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో గత సోమవరాం నుంచి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ దీక్షలకు చేనేత కార్మికుల నుంచి విశేష స్పందన వస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. దీంతో టీడీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. వెంటనే ముడిపట్టు రాయితీ బకాయి రెండు నెలలకు సంబంధించిన మొత్తం రూ.2వేలు చేనేతల ఖాతాల్లోకి జమ చేశారు. వాస్తవానికి చేనేత ముడిపట్టు రాయితీ మొత్తం 21 నెలలకు గాను ఒక్కో చేనేత కార్మికుడికి రూ.14,800 బకాయి ఉంది. ఈ బకాయిల్లో కేవలం రూ.2వేలు మాత్రమే జమ చేయడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఆందోళన చేస్తేనే బకాయిలు చెల్లిస్తారా...? చేనేతలకు ప్రతినెలా ముడిపట్టు రాయితీని చెల్లించాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షాలు ఆందోళన చేసినప్పుడు మాత్రమే రాయితీ ఇస్తున్నారు. గతంలో రెండు దఫాలు ఇలాగే జరిగింది. ఇప్పుడు కూడా అదే రీతిలో హడావుడిగా రెండునెలల బకాయిలను చేనేతలకు ఇచ్చారు. వాస్తవానికి ముడిపట్టు రాయితీకి సంబంధించి ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఇతర పనులకు వినియోగించుకుంటున్నారా..? లేక అధికార పార్టీ నాయకులు ఏమైనా కాజేశారా..? అన్న విషయం తెలియాల్సి ఉంది. స్వయానా ముఖ్యమంత్రి ధర్మవరంలో చేనేతలకు నిధులు మంజూరు చేసి, చెక్కును అందజేశారు. ఆ నిధులు నిజంగా మంజూరు చేశారా..? ఆ సందర్భానికి చేనేతల బకాయిల విషయం దాటవేసేందుకు నకిలీ చెక్కులను ఇచ్చి మభ్యపెట్టారా.? అని చేనేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 21 నెలలుగా బకాయి అందలేదు మాకు మొత్తం 21 నెలల ముడిపట్టు రాయితీ ఇవ్వాల్సి ఉంది. రెండు నెలల రాయితీ మాత్రమే గురువారం జమ చేశారు. పెరిగిన ముడిపట్టు ధరలతో ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఇవ్వాల్సిన రాయితీ మొత్తం ఇచ్చి ఉంటే కొంత అయినా ఊరట కలిగేది. వైఎస్సార్సీపీ వాళ్లు ధర్నా చేసింటేనే ఆ రెండు నెలల రాయితీ కూడా ఇచ్చారని తెలుస్తోంది. - శివకుమార్, చేనేత కార్మికుడు, పీఆర్టీ వీధి చేనేతరంగాన్ని టీడీపీ భ్రష్టుపట్టిస్తోంది ఈ ప్రభుత్వం చేనేతల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. జీఎస్టీ భారంతో ఇప్పటికే చేనేత రంగం ఇబ్బందులు పడుతోంది. వారికి అండగా ఉండాల్సిందిపోయి ఇబ్బందులకు గురిచేస్తోంది. అందుకే చేనేతల తరఫున పోరాడుతున్నాం. ధర్నాలు చేస్తే ఒక నెల, రెండునెలలు రాయితీ విడుదల చేసి చేతులు దులుపుకోవడం సరికాదు. బకాయి చెల్లించేంత వరకు దీక్ష ఆపేదిలేదు. – కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, ధర్మవరం