వాహన దారుడిపై చేయి చేసుకుంటున్న ట్రాఫిక్ పోలీసులు(ఫైల్)
బంజారాహిల్స్: ఈ నెల 9వ తేదీన రాత్రి జూబ్లిహిల్స్ చెక్‌పోస్ట్‌లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అంకిత్ సింగ్ అనే వాహనదారుడిపై దాడి చేసిన ఘటనలో జూబ్లిహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు జితేందర్, వెంకటేష్‌లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వీరిద్దరినీ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఆ రోజు రాత్రి జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అంకిత్ సింగ్‌ను బయటికి లాగి కిందేసి తొక్కిన దృశ్యాలు వీడియోలో నమోదు కాగా బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఆ వీడియో దృశ్యాలను పరిశీలించిన అధికారులు వీరిద్దరిపై చర్యలు తీసుకున్నారు. యువకుడు ఇచ్చిన ఫిర్యాదుపైనే విచారణ జరిపిన పోలీసు కమిషనర్ తక్షణం కానిస్టేబుళ్లను అటాచ్ చేయాల్సిందిగా ఆదేశించారు. కారులో పక్కన కూర్చున్న వ్యక్తిని సంబంధంలేని విషయంలో తలదూర్చి ఈ కానిస్టేబుళ్లు చితకబాదినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ అంకిత్‌సింగ్ తమను కొట్టినట్లు జితేందర్ ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేయగా జూబ్లిహిల్స్ పోలీసులు అంకిత్‌సింగ్‌ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే వీడియోను మార్ఫింగ్ చేశారని ముందు తననే వారు కొట్టడంతో తాను ఆత్మరక్షణ కోసమే ఎదుర్కోవాల్సి వచ్చిందని బాధితులు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment