కానిస్టేబుల్ ను చితకబాదిన మందుబాబులు | Man urinates on cop's car, beats him up for objecting | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ ను చితకబాదిన మందుబాబులు

Published Sun, Aug 14 2016 1:04 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

కానిస్టేబుల్ ను చితకబాదిన మందుబాబులు - Sakshi

కానిస్టేబుల్ ను చితకబాదిన మందుబాబులు

కళ్యాణ్: తన కారుపై మూత్రవిసర్జన చేయొద్దన్నందుకు కానిస్టేబుల్ పై ఐదుగురు మందుబాబులు దాడిచేసిన ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. కళ్యాణ్-మాలాంగ్ రోడ్డులోని రంగీలా బార్ వద్ద ఈ ఘటన జరిగిందని దర్యాప్తు అధికారి ఎండీ గజాడే తెలిపారు. కానిస్టేబుల్ సతీశ్ దేశాయ్ ప్రైవేటు వాహనంపై నిందితుల్లో ఒకడైన రాహుల్ చౌదరి మూత్రవిసర్జన చేశాడు. ప్రశ్నించిన సతీశ్ పై రాహుల్, అతడి నలుగురు స్నేహితులు మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు.

ఐదు నిమిషాల పాటు కానిస్టేబుల్ ను విచక్షణారహితంగా చితకబాదారు. అయితే ఘటనాస్థలంలో పలువురు ఉన్నప్పటికీ  అతడిని కాపాడేందుకు ప్రయత్నించలేదు. బార్ సిబ్బంది జోక్యం చేసుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎండీ గజాడే చెప్పారు. వీరికి ఈ నెల 16 వరకు పోలీసు కస్టడీ విధించినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement