మహారాష్ట్రకు చెందిన మహిళా కానిస్టేబుల్. ఎన్నో కష్టాలు పడి మగవాడిలా మారింది. కుటుంబాన్ని, సమాజాన్ని ఎదురించి పురుషుడిగా సర్జరీ చేయించుకుంది. తర్వాత కొన్నాళ్లకు ఓ యుతిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ జంట బిడ్డకు జన్మనివ్వడంతో.. కానిస్టేబుల్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. వివరాలు.. బీద్ జిల్లా రాజేగాన్ గ్రామానికి చెందిన లలితా సాల్వే(35) కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది.
25 ఏళ్ల వయసులో (2013) తన శరీరంలో మార్పులు రావడాన్ని గమనించింది. ఆసుప్రతికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోగా.. ఆమెలో మగవారిలో ఉండే వై క్రోమోజోమ్‌లు ఉన్నట్లు తేలింది. (ఆడవారిలో రెండు ఎక్స్ క్రోమోజోములు మాత్రమే ఉంటాయి). జెండర్ డిస్ఫోరియాతో బాధపడుతున్న ఆమెకు లింగ మార్పిడి సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు.
ఈ క్రమంలో లలితా సాల్వే 2017లో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. బాంబే హైకోర్టుతోపాటు 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతివ్వడంతో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. 2018 నుంచి 2020 వరకు మూడు సర్జరీల ద్వారా పురుషుడిగా మారింది. దీంతో లలితా నుంచి తన పేరును లలిత్ కుమార్ సాల్వేగా మార్చుకుంది. అనంతరం 2020లో ఛత్రపతి శంభాజీనగర్‌కు (ఔరంగాబాద్) చెందిన సీమాను పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. వివాహమైన నాలుగేళ్ల తర్వాత జనవరి 15న ఆ జంటకు బాబు పుట్టాడు.
చదవండి: Video: అకస్మాత్తుగా కూలిన అయిదు అంతస్తుల భవనం
లలిత్ సాల్వే మాట్లాడుతూ.. స్త్రీ నుంచి పురుషుడిగా మారిన తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అనేక పోరాటాలు చేసి చివరికి తన జెండర్ మార్చుకునట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment