
సాక్షి, ముంబై: గడ్చిరోలి జిల్లా అహేరిలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాజీ మంత్రి రాజే అంబరీష్‌రావు ఆత్రం ఇంటి ముందు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కానిస్టేబుల్.. తన సర్వీస్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తిని హితేష్ బైషారేగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం సబ్ జిల్లా ఆసుపత్రికి తరలించి తదుపరి విచారణ జరుపుతున్నారు
Comments
Please login to add a commentAdd a comment