
ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. ముంబైలోనని మలబార్ హిల్ ప్రాంతంలోని ముఖ్యమంత్రి అధికార నివాసం వర్ష వద్ద విధులు నిర్వహించే ఇద్దరు మహిళా పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిద్దరూ సీఎం అధికార నివాసం వద్ద కేవలం ఒకట్రెండు రోజులే విధుల్లో ఉన్నారని, వీరికి నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్ ఫలితాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా ఆరుగురు పోలీసులను క్వారంటైన్‌కు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఇక మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలోనే అత్యధికంగా 4,666కు పెరిగింది. పుణేలోని రుబీ హాల్ క్లినిక్‌లో 19 మంది నర్సులు సహా 25 మంది పారామెడికల్ సిబ్బందికి నిర్వహించిన కరోనా టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment