Maha CM Uddhav Thackeray Tests Corona Positive, Attends Cabinett Meeting Virtually - Sakshi
Sakshi News home page

Uddhav Thackeray Covid Positive: ‘మహా’లో మరో ట్విస్ట్‌.. సీఎం ఉద్ధవ్‌ థాక్రే, గవర్నర్‌కు కరోనా పాజిటివ్‌

Published Wed, Jun 22 2022 1:03 PM | Last Updated on Wed, Jun 22 2022 3:42 PM

Corona Positive For Uddav Thackeray - Sakshi

ముంబై: మహారాష్ట్రలో పాలిటిక్స్‌ ఆసక్తికరంగా మారాయి. సీఎం ఉద్ధవ్‌ థాక్రే కరోనా బారినపడ్డారు. బుధవారం ఆయన కరోనా టెస్టులు నిర్వహించగా.. పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లారు. 

ఇదిలా ఉండగా.. సీఎంకు కరోనా సోకడంతో వర్చువల్‌గా కేబినెట్‌ భేటీలో పాల్గొననున్నట్టు తెలిపారు. కాగా, కేబినెట్‌ భేటీ అనంతర ఉద్దవ్‌ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. మరోవైపు.. రాజీకయ సంక్షోభం నెలకొన్న వేళ మహారాష్ట్రలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం ఉదయం.. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ‍్యారీ కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో గవర్నర్‌ కోశ్యారీ.. ముంబైలోని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో గోవా గవర్నర్‌ శ్రీధరణ్‌ పిళ్లైకి కేంద్రం.. అదనంగా మహారాష్ట్ర బాధ్యతలను కూడా అప్పగించింది. 

ఇది కూడా చదవండి: ‘మహా’ సంకటం: కీలక పరిణామం అసెంబ్లీ రద్దు.?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement