సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి భారీ ఎదురు దెబ‍్బ తగిలింది. ఎయిర్ సెల్ మాక్సిస్‌లో సీరియస్‌గా స్పందించిన ఈడీ కోటికిపైగా ఆస్తులను ఎటాచ్ చేసింది. ఎఫ్‌డీలు, బ్యాంక్ అకౌంట్లతోపాటు గుర్గావ్‌లో ఇంటిని సీజ్ చేసింది.
కార్తీకి చెందిన రూ. 1.16 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోమవారం ఎటాచ్ చేసింది. ముఖ్యంగా అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ASCPL) పేరుతో ఉన్న రూ. 26 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లను,ఇతర రూ. 96లక్షల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. గుర్గావ్‌లోని ఇంటిని బినామీ పేరుతో నిర్వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది.