సెంట్రల్‌ జైలును గెస్ట్‌హౌస్‌లా మార్చేశారు ! | Central jail was converted to guest house in tamil nadu | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ జైలును గెస్ట్‌హౌస్‌లా మార్చేశారు !

Published Wed, Jul 19 2017 3:42 PM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

Central jail was converted to guest house in tamil nadu

దొడ్డబళ్లాపురం(కర్ణాటక): పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలును తమిళనాడు గెస్ట్‌హౌస్‌లా మార్చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదని, రాష్ట్రంలో నిజాయితీ అధికారులకు ఆత్మహత్య భాగ్యం, బదిలీ భాగ్యం కలిగిస్తున్న కీర్తి కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్‌ అశోక్‌ అన్నారు. ఇక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...సెంట్రల్‌ జైలులో జరుగుతున్న అక్రమాలను మీడియా వీడియోలు, ఫొటోల రూపంలో ప్రసారం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం బాధాకరమన్నారు.

ఇలా అవినీతిని, అక్రమాలను వెలుగులోకి తెచ్చే అధికారులను బదిలీ చేయడం, వేధించడం చేస్తే రాష్ట్రంలో ఏ అధికారి విధులు సరిగ్గా నిర్వహిస్తాడని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వచ్చే నెల 12,13,14 తేదీలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు బెంగళూరు విచ్చేయనున్నారని, రాష్ట్ర నేతలతో సమావేశమై రాష్ట్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే దిశలో ఏ విధంగా పనిచేయాలో దిశానిర్దేశనం చేయనున్నారన్నారు. 150 అసెంబ్లీ సీట్లు గెలిచే విధంగా ఆపరేషన్‌ 150 లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement