సాక్షి, హైదరాబాద్ : రాయదుర్గంలోని తన గెస్ట్‌హౌజ్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై సినీ నటుడు ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన భూమికి తామే హక్కు దారులమంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాయద్గుంలోని పాన్‌మక్తలో ఉన్న భూమి ప్రభుత్వ భూమేనని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. CS/7 లో భూమి ఉందా లేదా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. తాము కొనుగోలు చేసింది పాన్ మక్త స్థలమే అని ఆయన సమాధానమిచ్చారు.
కాగా వాదనలు పూర్తైన క్రమంలో... గతంలో ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్‌కు బదిలీ చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. ఇందుకు సమ్మతం తెలిపిన కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా గురువారం డివిజన్ బెంచ్‌లో ఇరువర్గాలు మరోసారి వాదనలు వినిపించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment