ఐదుజంటలు పట్టివేత
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర గుట్టలోని హరిత గెస్ట్ హౌస్ పై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి వ్యభిచారం చేస్తున్న ఐదు జంటలను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..హరిత గెస్ట్ హౌస్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో సోమవారం సాయంత్రం ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. వేర్వేరు గదుల్లో ఐదుగురు మహిళలతో గడుపుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కీసర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాడుల్లో ఎస్‌ఓటీ డీసీపీ రామచంద్రారెడ్డి, సీఐలు స్వామి, రంగాస్వామి, ఎస్‌ఐ రాములు ఉన్నారు.