సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ త్రివిక్రమవర్మ
శ్రీకాకుళం రూరల్ : బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించినా, వారికి నీలిచిత్రాలు చూపించి లోబరుచుకోవడానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ పోలీసు అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా ఎస్పీ సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామంలో నీలిచిత్రాల సంఘటన, బాధ్యులపై తీసుకున్న చర్యలను గుర్తుచేశారు.
ఆయా స్టేషన్‌లలో ఉన్న ఆస్తి నేరాలపై వచ్చిన కేసుల పురోగతి వేగవంతం చేయాలన్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద జన సంచారాన్ని ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. గుట్కాలు, ఖైనీల రవాణాపై నిఘా పెట్టాలని, బెల్డ్‌షాపులపై దాడులు నిర్వహించాలని ఆదేశించారు.
గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు సదస్సులు నిర్వహించాలన్నారు. అనంతరం న్యాయసలహాదారులు నాగమల్లేశ్వరరావు, కె.తిరుమలరావులు అత్యాచార కేసులు ఎలా చేధించాలో సలహాలు అందజేశారు.
సమావేశంలో డీఎస్పీలు ఎం.కృష్ణమూర్తి నాయుడు, వి.భీమారావు, బి.ప్రసాదరావు, జి.స్వరూపారాణి, సీహెచ్ పెంటారావు, కె.వేణుగోపాలనాయుడు, వి.సుబ్రహ్మణ్యం, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment