
సాక్షి, గుంటూరు: జిల్లాలోని తెనాలి పాండురంగపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఇద్దరి మైనర్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాలివి.. నరసింహా ఆ ప్రాంతంలో ఓ పానీపూరీ బండి నిర్వహిస్తున్నాడు. అతను మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలికలు తల్లిదండ్రులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది.
ఆ తల్లిదండ్రులు నరసింహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.