హర్యానాలో ఇద్దరు దళిత బాలికల రేప్, హత్య | Two minor Dalit girls raped, murdered in separate incidents | Sakshi
Sakshi News home page

హర్యానాలో ఇద్దరు దళిత బాలికల రేప్, హత్య

Published Mon, Jan 15 2018 4:12 AM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM

Two minor Dalit girls raped, murdered in separate incidents - Sakshi

చండీగఢ్‌: హర్యానాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దళిత బాలికలు అత్యాచారానికి, దారుణహత్యకు గురయ్యారు.  కురుక్షేత్ర జిల్లాకు చెందిన ఓ బాలిక(15) పదో తరగతి చదువుకుంటోంది. గత మంగళవారం ట్యూషన్‌కు వెళ్లి తిరిగి రాలేదు. గుర్తు తెలియని దుండగులు ఆమెపై అత్యాచారం చేసి అనంతరం శరీర భాగాలను ఛిద్రం చేసి కాల్వలో పడేశారు.

ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పానిపట్‌ జిల్లాకు చెందిన ఓ బాలిక(11) శుక్రవారం సాయంత్రం చెత్తను పారేసేందుకు బయటకు వెళ్లగా కొందరు ఆమెను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఉరివేసి చంపారు. ఈ ఘటనలో మృతురాలి పొరుగింట్లో ఉండే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement