న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇద్దరు పసిపాపలపై జరిగిన పాశవిక లైంగిక దాడికి సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. శనివారం రాత్రి వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే, ఈ నేరానికి పాల్పడిన వారిద్దరు కూడా జువెనైల్స్ కావడం పోలీసులను, ఇతర వర్గాలను విస్తుపోయేలా చేసింది. ఈ కేసులో మరిన్ని వివరాలను ఆదివారం మధ్యాహ్నం మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. గత శుక్రవారం ఆడుకుందాం రమ్మని రెండున్నరేళ్ల బాలికపై, కిడ్నాప్ చేసి ఐదేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలో సంచలనం సృష్టించి రాజకీయ వేడిని పుట్టించింది.
తొలిఘటన పశ్చిమ ఢిల్లీలోని నిహాల్ విహార కాలనీలో చోటుచేసుకుంది. ఆడుకుందాం రమ్మని రెండున్నారేళ్ల బాలికను తీసుకెళ్లి లైంగికదాడి చేసి వదిలేసి వెళ్లిపోయారు. ఇక రెండో ఘటన తూర్పు డిల్లీలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు కూలిపనులకు పోయింది చూసి వారి ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి ముగ్గురు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడుతుండగా పాప కేకలు వేయడం చుట్టుపక్కల వారు వచ్చి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు మిగతావారి కోసం గాలించి అరెస్టు చేయగా వారు జువెనైల్స్ అని తేలింది.
ఇద్దరు నిందితులు దొరికారు
Published Sun, Oct 18 2015 9:49 AM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM
Advertisement
Advertisement