ఫిర్యాదుతో సూర్యపవన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సాక్షి, నాగోలు: ఇంట్లో ఉన్న వృద్ధుడికి సేవ చేసేందుకు కేర్ టేకర్‌ను నియమించుకుంటే గంజాయి మత్తులో ఇంటి యజమానిపై దాడి చేశాడు. ఈ ఘటన ఎల్‌బీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌బీనగర్ నాగార్జున కాలనీలో ఉండే దామోదర్‌రావు, గిరిధర్‌ల తండ్రి రంగారావు (96). ఆయనకు సేవలందించడానికి సోదరులు కుత్బుల్లాపూర్ హరికృష్ణ హోమ్ కేర్ అండ్ సరీ్వసెస్ నిర్వాహకుడు వెంకటరమణకు సంప్రదించారు. అతడు కుత్బుల్లాపూర్ రాజీవ్‌గృహకల్పకు చెందిన సూర్యపవన్‌ను వారి ఇంటికి పంపాడు. సోదరిలిద్దరూ కుటుంబంతో పై అంతస్తులో ఉంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్న వారి తండ్రి రంగారావుకు సూర్యపవన్ సేవలు అందిస్తున్నారు.
ఈనెల 27వ తేదీన సాయంత్రం సూర్యపవన్ గట్టిగా కేకలేస్తూ నగ్నంగా తిరుగుతుండగా సోదరిలిద్దరూ కిందకు వచ్చారు. ఎందుకు అలా చేస్తున్నావని వారు ప్రశ్నించగా అతడు వారిపై దాడి చేయడంతో పాటు పిచ్చిపిచ్చిగా సమాధానమిచ్చాడు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్యపవన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారికి అతడు సరైన సమాధానం ఇవ్వలేదు. అతడి వద్ద పోలీసులు గంజాయి ప్యాకెట్, చిన్న మద్యం బాటిల్ స్వాదీనం చేసుకున్నారు. అతడు గంజాయి సేవించడంతో అలా ప్రవర్తంచి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మంగళవారం ఉదయం అతడు పోలీస్‌స్టేషన్‌లోనూ కేకలేస్తూ హల్‌చల్ చేశాడు. ఈ మేరకు పోలీసులు అతడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన్నట్లు సమాచారం. దామోదర్‌రావు ఇచ్చిన ఫిర్యాదుతో ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: 3 వైన్స్‌లు.. 30 ‘బెల్ట్’లు: లాభాల కోసం ‘చీప్’ ట్రిక్స్..
Comments
Please login to add a commentAdd a comment