నమ్మశక్యం కాని దృశ్యం! | Giant Alligator Strolls Across Florida Golf Course Like a Total Boss | Sakshi
Sakshi News home page

నమ్మశక్యం కాని దృశ్యం!

Published Thu, Jun 2 2016 11:23 AM | Last Updated on Fri, Oct 5 2018 8:48 PM

నమ్మశక్యం కాని దృశ్యం! - Sakshi

నమ్మశక్యం కాని దృశ్యం!

ఫ్లోరిడా నివాసి చార్లీ హెల్మ్స్, తన స్నేహితులు గోల్ఫ్ ఆడేందుకు గోల్ఫ్ కోర్స్ కు వెళ్లారు. తమకంటే ముందే అక్కడికి వచ్చిన అతిథిని చూసి వాళ్లంతా అవాక్కయ్యారు. 15 అడుగుల భారీ ఎలిగేటర్ అక్కడ ప్రత్యక్షం కావడంతో నోళ్లు వెళ్లబెట్టారు. మొసలి జాతికి చెందిన ఎలిగేటర్ దర్జాగా బఫెలో క్రీక్ గోల్ఫ్ కోర్స్ లో దర్జాగా చక్కర్లు కొట్టింది. నమ్మశక్యంకాని ఈ దృశ్యాన్ని చార్లీ హెల్మ్స్ తన కెమెరాలో బంధించాడు.

అంతేకాకుండా మే 25న తన ఫేస్బుక్ పేజీలో ఈ వీడియో పోస్ట్ చేశాడు. తర్వాత యూట్యూబ్ లోనూ షేర్ చేశాడు. ఆన్లైన్ లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియోను 5 రోజుల్లోనే 40 లక్షల మంది వీక్షించడం విశేషం. గోల్ఫ్ కోర్స్ లోని ప్రతి అంగుళం తనకు తెలుసు అన్నట్టుగా ఎలిగేటర్ కలియదిరిగినట్టు వీడియోలో ఉంది. 'జూరాసిక్ పార్కు'లో సీన్ చూసినట్టుగా ఉంది. మరోవైపు ఎలిగేటర్ చూసి భయపడకుండా దాన్ని వీడియోలో బంధించిన చార్లీ హెల్మ్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement