Golf Course
-
ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రాబోయే ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. అయితే ట్రంప్ క్షేమంగానే ఉన్నట్టు ఆయన ప్రచార బృందం వెల్లడించింది. ఫ్లోరిడాలో తన వెస్ట్ పామ్ బీచ్ నివాసం సమీపంలోని సొంత గోల్ఫ్ కోర్స్ లో గోల్ఫ్ ఆడుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతానికి ఇంతకన్నా వివరాలేవీ లేవు‘అని ట్రంప్ ప్రచార బృందం అధికార ప్రతినిధి స్టీవెన్ చెంగ్ తెలిపారు. ట్రంప్ క్షేమమేనని ఆయన భద్రత వ్యవహారాలు చూసే సీక్రెట్ సర్వీస్ విభాగం కూడా ధ్రువీకరించింది. కాల్పుల శబ్దం వినిపించగానే గోల్ఫ్ కోర్స్ ను మూసేసి ట్రంప్ ను అక్కడి నుంచి హుటాహుటిన తరలించినట్టు తెలిపింది. మరోవైపు.. కాల్పుల ఘటన అనంతరం తాను సేఫ్‌గా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఘటన గురించి అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు అధికారులు నివేదించారు. ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్టు కూడా సమాచారం లేదని స్థానిక పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. నాకు సమీపంలోనే కాల్పులు జరిగాయి. పరిస్థితి అదుపులో లేదనేది రూమర్లే. మీ అందరికీ ఓ విషయం గట్టిగా చెప్పదల్చుకున్నా. నేను బాగున్నా. సురక్షితంగా ఉన్నా. ఏదీ నన్ను అడ్డుకోలేదు. నన్నెవరూ ఆపలేరు. ఎప్పటికీ లొంగేదే లేదు.:: డొనాల్డ్ ట్రంప్ట్రంప్ సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. ఆయనపై హత్యాయత్నానికి పాల్పడేందుకు సిద్ధమైన అనుమానితుడు భద్రతా సిబ్బంది అదుపులో ఉన్నాడు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. మన దేశంలో రాజకీయ హింసకు చోటు లేదని పునరుద్ఘాటిస్తున్నా. ట్రంప్‌నకు అన్ని విధాలా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని భద్రతా సిబ్బందిని ఆదేశించా.:: అధ్యక్షుడు జో బైడెన్ట్రంప్ను లక్ష్యంగా చేసుకొనే దుండగుడు ఏకే 47 మోడల్ వంటి తుపాకీతో సంచరించాడు. మాజీ అధ్యక్షుడిని హత్య చేయాలనే ఉద్దేశంతోనే సదరు దుండగుడు ఆయుధంతో అక్కడికి వచ్చినట్లు గుర్తించాం. నిందితుడు ర్యాన్ వెస్లీ రౌత్ డొనాల్డ్ ట్రంప్‌నకు 400 నుంచి 500 గజాల దూరంలోనే తన ఆయుధంతో సిద్ధమవుతుండగా భద్రతా ఏజెంట్లు కాల్పులు జరిపాయి. నిందితుడు ప్రస్తుతం మా అదుపులో ఉన్నాడు.. విచారణ చేపట్టాం.:::ఎఫ్‌బీఐ ఈ ఘటనపై కమలా హారిస్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అమెరికాలో రాజకీయ హింసకు తావులేదని అన్నారామె. I have been briefed on reports of gunshots fired near former President Trump and his property in Florida, and I am glad he is safe. Violence has no place in America.— Vice President Kamala Harris (@VP) September 15, 2024 ఇదీ చదవండి: ‘టారిఫ్’పై ట్రంప్‌కే ఓటుఇటీవలే హత్యాయత్నంఅధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మళ్లీ బరిలో ఉన్న 78 ఏళ్ల ట్రంప్ పై రెండు నెలల క్రితమే హత్యాయత్నం జరగడం తెలిసిందే. జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్ అనే యువకుడు సమీపంలోని గోడౌన్ మీదినుంచి ఆయనపై కాల్పులకు తెగబడ్డాడు. కుడి చెవికి తూటా తగిలింది. ట్రంప్ రక్తమోడుతూనే అమాంతం దయాస్ కిందకు ఒరిగి తనను తాను కాపాడుకున్నారు. భద్రతా సిబ్బంది వెంటనే దుండగున్ని కాల్చి చంపారు. అనంతరం ట్రంప్ ను హుటాహుటిన అక్కడినుంచి తరలించారు. నాటినుంచి ఆయనకు భద్రతను మరింత పెంచారు. -
వీడి కథేంటో.. కారు డిక్కీలో కూర్చొని డబ్బులు విసిరేస్తూ..!
కొంత మంది బడా బాబులు తమ కూతుళ్లు లేదా కొడుకుల వివాహాలప్పుడూ లేదా ఎన్నికల్లో గెలిచిన డబ్బులను బహిరంగంగా వెదజల్లడం చూస్తుంటాం. అంతేందుకు ఇటీవలే బెంగుళూరులో ఒక వ్యక్తి ఫ్లై ఓవర్‌పై డబ్బులు వెదజల్లి ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేసిన ఉదంతాన్ని కూడా చూశాం. అవన్నీ మరువక మునుపే అచ్చం అలాంటి మరో ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు కదులుతున్న కారులోంచి కరెన్సీ నోట్లను విసిరారు. ఇటీవలే విడుదలైన ఫర్జీ అనే వెబ్సీరిస్లోని సీన్ మాదిరిగా సీన్‌ని రీ క్రియేట్ చేసినట్లుగా చేశారు. ఈ మేరకు ఏసీపీ వికాస్ కౌశిక్ మాట్లాడుతూ..సదరు యువకులను గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వాళ్లు సినిమాలోని సీన్ మాదిరిగా చేయడం కోసం ఇలాంటి దుస్సాహాసానికి ఒడిగట్టినట్లు తెలిపారు. ఆ యువకులు గోల్ఫ్‌కోర్సు రోడ్డు వద్ద కరెన్సీని విసిరినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సదరు వ్యక్తులును గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. #WATCH | Haryana: A video went viral where a man was throwing currency notes from his running car in Gurugram. Police file a case in the matter. (Police have verified the viral video) pic.twitter.com/AXgg2Gf0uy — ANI (@ANI) March 14, 2023 (చదవండి: ట్రైన్లో మహిళపై మూత్ర విసర్జన ఘటన:టీసీపై సస్పెన్షన్ వేటు) -
గోల్ఫ్ కోర్సులో క్రూర మృగాల వేట.. ఆటకు బ్రేక్
ఓ భారీ జిరాఫీని అప్పుడే వేటాడిన నాలుగు యువ సింహాలు, రెండు శివంగులు.. ఆ ‘ఆహారాన్ని’ సొంతం చేసుకొనేందుకు కదన రంగంలోకి దిగి వాటిని తరుముతున్న 20 హైనాలు. తమ వేటను తిరిగి చేజిక్కించుకొనేందుకు ఎదురుదాడికి ప్రయత్నిస్తున్న ఆడ సింహాలు.. ఆ ఇందులో పెద్ద వింత ఏముంది.. ఆఫ్రికా అడవుల్లో ఇలాంటి దృశ్యాలన్నీ సర్వసాధారణమేగా అనుకుంటున్నారా? కానీ ఇదంతా జరిగింది అడవిలో కాదు.. అడవి మధ్య ఉన్న ఓ గోల్ఫ్ కోర్స్‌లో! దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్ నడిమధ్యన ఉన్న స్కుకుజా గోల్ఫ్ క్లబ్లో తాజాగా కొందరు ఆటగాళ్లు గోల్ఫ్ ఆడుతుండగా వారి ఆటకు ఈ క్రూర మృగాలు ఇలా బ్రేక్ వేశాయి! ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అడవికి, గోల్ఫ్‌కోర్స్‌కు మధ్య ఎటువంటి రక్షణ కంచె లేకపోవడంతో జంతువులు తరచూ ఇలా లోపలకు దూసుకొస్తాయట. గోల్ఫ్‌కోర్స్‌లో ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి గుంటల్లో దప్పిక తీర్చుకొనేందుకు జిరాఫీలతోపాటు చిరుత పులులు, ఖడ్గ మృగాలు, ఏనుగులు, అడవి దున్నలు తరచూ అక్కడకు వస్తుంటాయట!! అందుకే ఇక్కడ గోల్ఫ్ ఆడాలనుకొనే ఆటగాళ్లకు ఎంతో గుండెధైర్యం కావాలట! అదొక్కటే కాదు.. అడవి జంతువులేవైనా దాడి చేసి చంపేస్తే క్లబ్ నిర్వాహకుల బాధ్యతేమీ లేదంటూ అగ్రిమెంట్‌పై సంతకం చేసిన వారినే ఇందులోకి అనుమతిస్తారట!! క్రూగర్ నేషనల్ పార్క్ సిబ్బంది కోసం 1972లో ఈ గోల్ఫ్‌కోర్స్‌ను తొలుత ఏర్పాటు చేయగా ఆ తర్వాత క్రమంగా స్థానికులతోపాటు పర్యాటకులకు కూడా ఇందులో ఆడేందుకు అవకాశం కల్పించారు. అందుకే దీన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత కఠినమైన, క్రూరమైన గోల్ఫ్కోర్స్గా పిలుస్తున్నారు. చదవండి: రణరంగంలా మారిన బాగ్ధాద్.. కాల్పుల్లో 15మంది మృతి -
ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?
కాన్బెర్రా: మనం ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు ఏవైనా జంతువులు దండుగా వస్తే కాస్త భయపడతాం. మనకు ఏం చేయాలో కూడా తోచదు. కాసేపు ఆగి అవి వెళ్లాక మళ్లీ ఆట కొనసాగిస్తాం. అచ్చం అలాంటి ఘటనే ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. (చదవండి: భారత్‌కు చేరిన అద్భుత కళాఖండాలు) అసలు ఏం జరిగిందంటే ఆస్ట్రేలియాకు చెందిన ఒక గోల్ఫ్ క్రీడాకారిణి గోల్ఫ్ కోర్సులో భాగంగా ప్రాక్టీస్ చేస్తుంటుంది. ఇంతలో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఒక్కసారిగా ఒక్కో కంగారు జంతువు వస్తూ అలా దండుగా మొత్తం కంగారు సముహం వస్తుంది. దీంతో ఆ క్రీడాకారిణికి గోల్ఫ్ చేయడానికి అంతరాయం ఏర్పడుతుంది. కానీ అవి దండుగా మేము కూడా గోల్ఫ్ నేర్చుకుంటాం అన్నట్లుగా క్రీడాకారిణి దగ్గరకు వస్తాయి. అవి అన్ని గెత్తుతు మొత్తం ఆ ప్రదేశం అంతా తిరుగుతాయి. దీంతో ఆమె ఆశ్యర్యపోతుంది. అంతేకాదు ఆమె దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. దీంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ మేరకు నెటిజన్లు అవి గోల్ఫ్ ఎలా చేస్తారో చూడటానికి వచ్చినట్టున్నాయి కాబోలు అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: దేశాన్ని రక్షించేందుకే వచ్చాం!) View this post on Instagram A post shared by Wendy Powick (@wendywoo.golf) -
గోల్ఫ్ కోర్స్.. ఆకాశమంత ఎత్తు
అదితి అశోక్... ఒలింపిక్స్‌లో ఎవరూ ఊహించని విధంగా మౌనంగా పాయింట్లు తెచ్చుకుంది. దేశం దృష్టిని గోల్ఫ్ వైపు మళ్లించింది. మన దేశంలో గోల్ఫ్ ఇంతగా విస్తరించి ఉందా అనే సందేహాన్ని, నిజమేననే సమాధానాన్ని ఏకకాలంలో చెప్పింది అదితి. మరో విషయం... మన దేశంలో గిన్నిస్ రికార్డు సాధించిన గోల్ఫ్ కోర్స్ ఉంది. ప్రపంచంలో ఎత్తైన గోల్ఫ్ కోర్స్ సిక్కింలో ఉంది. పేరు... యాక్ గోల్ఫ్ కోర్స్. ఎంత ఎత్తులో అంటే... ఒక్కమాటలో చెప్పాలంటే ఆకాశమంత ఎత్తులో. కొలత వేసి చెప్పాలంటే పదమూడు వేల అడుగుల ఎత్తులో. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైన గోల్ఫ్ కోర్స్ ఇది. ప్రపంచం మొత్తంలో ఇంతకంటే ఎత్తైన ప్రదేశంలో గోల్ఫ్ కోర్స్‌లు లేవా అనే సందేహం వచ్చినా కూడా తప్పు కాదు. పెరూలో ఒకప్పుడు పద్నాలుగు వేల అడుగులకు పైగా ఎత్తులో గోల్ఫ్ కోర్స్ ఉండేది. రికార్డు కూడా దానికే ఉండేది. అయితే గడచిన రెండు దశాబ్దాలుగా గోల్ఫ్ క్రీడాకారులు ఆ గోల్ఫ్ క్లబ్ వైపు చూడడమే లేదు. అంత ఎత్తులో ఆల్టిట్యూడ్ సమస్యలు, తల తిరగడం, ముక్కు నుంచి రక్తం కారడం వంటి ఇబ్బందులు తలెత్తుతుండడంతో అది ఇప్పుడు వాడుకలో లేదు. ఇప్పుడు రికార్డు మన సిక్కిమ్, యాక్ గోల్ఫ్ క్లబ్‌దే. పైగా ఇది పద్దెనిమిది హోల్స్ గోల్ఫ్ క్లబ్. దీనిని భారత ఆర్మీ నిర్వహిస్తోంది. ఈ పేరు ఎందుకు? సిక్కిమ్ వాళ్లు హిమాలయాల్లో సంచరించే యాక్ (జడలబర్రె) మీద ప్రయాణించడాన్ని గర్వంగా భావిస్తారు. దేవతల పూజల్లో ఉపయోగించే చామరాలను ఈ జడలబర్రె వెంట్రుకలతో తయారు చేస్తారు. ఇక్కడికి ఎవరికి వాళ్లుగా వెళ్లడం కంటే టూర్ ప్యాకేజ్‌లో వెళ్లడమే సౌకర్యంగా ఉంటుంది. సిల్క్ రూట్లోని ప్రదేశాలను కవర్ చేసే కొన్ని టూర్ ప్యాకేజ్‌లలో ఈ యాక్ గోల్ఫ్ కోర్స్ ఉంటుంది. -
కరోనా రూల్స్ బ్రేక్ చేసిన కివీస్ ఆటగాళ్లు.. ఆందోళనలో టీమిండియా
సౌతాంప్టన్: మరి కొద్ది గంటల్లో(జూన్ 18న) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2021ప్రారంభం కానుండగా, కొందరు కివీస్ ఆటగాళ్లు కరోనా నిబంధనలను అతిక్రమంచి గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని ప్రముఖ క్రీడా వెబ్సైట్ క్రిక్ బజ్ పేర్కొంది. న్యూజిలాండ్ ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, హెన్రీ నికోల్స్, మిచెల్ సాంట్నర్, డారిల్ మిచెల్, ఫిజియో టామీ సిమ్సెక్ ఈ ఉదయం బయో బబుల్‌ను దాటి బయటకు వెళ్లారని సదరు వెబ్సైట్ వెల్లడించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు బయో బబుల్‌ను వీడి బయటకు వెళ్లిరావడం పట్ల భారత జట్టు యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇది కచ్చితంగా బయో బబుల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినట్టేనని టీమిండియా మేనేజ్మెంట్ వాదిస్తోంది. ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. అయితే దీనిపై న్యూజిలాండ్ వాదన మాత్రం వేరేలా ఉంది. హోటల్, గోల్ఫ్ కోర్సు ఒకే ప్రాంగణంలో ఉన్నందున తమ ఆటగాళ్లు గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని, ఇది బయో బబుల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినట్లు కాదని ఆ జట్టు మేనేజ్మెంట్ వాదిస్తోంది. ఇదిలా ఉంటే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్, న్యూజిలాండ్ జట్లు మంగళవారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించాయి. రెండు జట్ల ఆటగాళ్లు సౌతాంప్టన్‌లోని ఒకే హోటల్లో బస చేస్తున్నారు. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, కోలిన్ గ్రాండ్‌హోమ్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్, విల్ యంగ్. చదవండి: WTC Final: చారిత్రక మ్యాచ్‌కు వరుణ గండం..? -
అనిల్ అంబానీ వీడియో వైరల్.. చిక్కుల్లో గోల్ఫ్ కోర్స్
ముంబై: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్ కరాళ నృత్యం చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహమ్మారి కట్టడి కోసం కఠిన ఆంక్షలు విధించింది. కర్ఫ్యూ, లాక్డౌన్ అమలుతో కోవిడ్ కట్టడి కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్న జనాలు స్వీయ నియంత్రణ పాటించకపోతే.. కోవిడ్‌ను అదుపు చేయలేం. ఇలాంటి సమయంలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. జనాలకు ఆదర్శంగా నిలవాలి తప్ప వారి ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు. కానీ కొందరు ప్రముఖులు తాము వీటన్నింటికి అతీతులం అనుకుంటారు. ఆంక్షలు లెక్కచేయకుండా నచ్చినట్లు ప్రవర్తించి ఇతరులను ఇబ్బంది పెడతారు. తాజాగా వ్యాపారవేత్త అనిల్ అంబానీ ఇలానే ప్రవర్తించారు. ఆయన చేసిన ఓ పని వల్ల ఓ ప్రైవేట్ గోల్ఫ్ కోర్స్ యజమాని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ వివరాలు.. మహారాష్ట్రలో ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ అనిల్ అంబానీ వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా.. కుటుంబంతో కలిసి మహాబలేశ్వర్ విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ గోల్ఫ్ కోర్సులో అనిల్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈవినింగ్ వాక్ చేశారు. అయితే లాక్డౌన్ విధించడంతో ప్రస్తుతం సదరు గోల్ఫ్ కోర్సు మార్నింగ్, ఈవినింగ్ వాక్ కోసం జనాలు ఎవరిని అనుమతించడం లేదు. సామాన్యులను అనుమతించని గోల్ఫ్ కోర్స్ అనిల్ అంబానీ కుటుంబాన్ని అనుమతించింది. వారు ఈవినింగ్ వాక్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహాబలేశ్వర్ సివిల్ అధికారులు సదరు ప్రైవేట్ గోల్ఫ్ కోర్స్ అధికారులకు నోటీసులు జారీ చేయడమే కాక ఆ గ్రౌండ్‌ను మూసి వేశారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘అనిల్ అంబానీతో పాటు అతడి కుటుంబ సభ్యులు గోల్ఫ్ కోర్స్‌లో ఈవినింగ్ వాక్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో మేం సదరు గోల్ఫ్ కోర్స్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశాం’’ అన్నారు. ఇక గోల్ఫ్ కోర్స్ అధికారి మాట్లాడుతూ ‘‘కోవిడ్ ఆంక్షలు అమల్లోకి రాకమునుపే అనిల్ అంబానీ కుటుంబం ఇక్కడకు వచ్చింది. వారు ఇక్కడ ఓ బంగ్లాలో ఉంటున్నారు’’ అని తెలిపారు. చదవండి: కోర్టు ఫీజుల కోసం నగలు అమ్ముకున్నా: అంబానీ -
గోల్కొండ ఖిల్లా.. ఇలా అయితే ఎలా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం తొలిరూపు గోల్కొండ.. భాగ్యనగరం అనగానే ముందుగా గుర్చొచ్చే చారిత్రక నిర్మాణం. కాకతీయులు పునాది వేయగా, కుతుబ్‌షాహీలు ఆక్రమించుకుని మరింత అభివృద్ధి చేశారు. ఆ తర్వాత అసఫ్జాహీలు ఏలారు. ఇన్ని రాజవంశాల చేతులు మారినా.. పదిలంగా నిలిచిన ఆ మహా కోటకు ఇప్పుడు ప్రమాదం ముంచుకొచ్చింది. చాలా ఏళ్లు కావడంతో స్వతహాగా ఏర్పడుతున్న పగుళ్లు క్రమంగా పెరిగి మూలాలనే పెకిలిస్తున్నాయి. వాటికి వేగంగా మరమ్మతులు జరగక క్రమంగా కోటకు బీటలు వేస్తున్నాయి. ఇంతటి ప్రమాదపు అంచుల్లో ఉన్న కోటకు ఇటీవలి భారీ వర్షాలు పెద్ద కుదుపునే ఇచ్చాయి. రికార్డు స్థాయి వర్షంతో ఒక్కసారిగా గోడలన్నీ కదిలిపోయి నిట్టనిలువునా కూలిపోయేందుకు సిద్ధమయ్యాయి. ఆ వర్షాల సమయంలోనే ఓ బురుజు, మరో మహా కోట ప్రాకారం, నవాబులు జలకాలాడిన కటోరా హౌస్ ప్రహరీ నేలమట్టమైంది. మరికొన్ని గోడలు కూడా కూలే ప్రమాదం ఉంది. వాన కాదు కదా బలంగా గాలివీచినా రాళ్లు జారిపడేలా మారింది ఈ మహా కట్టడం. కేంద్రం వెంటనే స్పందించకుంటే కోటలోని చాలాప్రాంతాలు మట్టిదిబ్బగా మారటం ఖాయం. రూ.6 నుంచి రూ.8 కోట్లు కావాలి ఇటీవలి వర్షాలకు కూలిన ప్రాంతాలను పునరుద్ధరించాలంటే రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు అవసరం అవుతాయని సమాచారం. ప్రస్తుతం స్థానిక అధికారులు అంచనాలు రూపొందించి మరమ్మతు కోసం అనుమతి కోరుతూ ఢిల్లీకి ప్రతిపాదన పంపారు. దానికి సమ్మతిస్తూ సరిపడా నిధులు కేటాయిస్తేనే వీలైనంత తొందరలో పునరుద్ధరణ పూర్తవుతుంది. వచ్చే వానాకాలం లోపు ప్రధాన పనులు చేపట్టడంతో పాటు, బలహీనంగా ఉన్న చోట్ల మరమ్మతు చేయకపోతే ఏడాదిలో మరిన్ని గోడలు కూలడం ఖాయం. నిధులేవి.. ఇంతపెద్ద గోల్కొండ నిర్వహణకు కేంద్ర పురాతత్వ సర్వేక్షణ విభాగం కేటాయిస్తున్న నిధులు సంవత్సరానికి రూ.కోటిన్నర మాత్రమే. శతాబ్దాల నాటి నిర్మాణం కావటంతో అడుగడుగునా మరమ్మతు చేస్తే తప్ప నిర్మాణం పదిలంగా ఉండని పరిస్థితిలో ఈ నిధులు ఏ మూలకూ చాలట్లేదు. మరోవైపు ఏ చిన్న మరమ్మతు చేయాల్సి వచ్చినా ఢిల్లీకి అనుమతి కోసం పంపి, అక్కడి నుంచి అనుమతి వచ్చేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతోంది. ఇక మరమ్మతు పనుల్లో నైపుణ్యం ఉన్న పనివారు దొరక్కపోవటం జాప్యానికి మరో కారణం. నిత్యం నిశితంగా పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు మరమ్మతులు వేగంగా చేపడితేనే ఈ కట్టడం పదిలంగా ఉంటుంది. చారిత్రక కట్టడాలను దత్తత ఇచ్చేందుకు గతేడాది కేంద్రం శ్రీకారం చుట్టింది. గోల్కొండ బాధ్యత జీఎమ్మార్‌కు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ఎవరైనా దాతలు ముందుకొస్తే దత్తత ఇచ్చేందుకు ఏఎస్ఐ సిద్ధంగా ఉన్నా ఎవరూ స్పందిచట్లేదు. (చదవండి: టూరిస్టుల గోల్కొండ) జారిపోయిన బండరాళ్లు.. గోల్కొండ కోట పైభాగంలో జగదాంబ దేవాలయం వైపు వెళ్లే దారిలో 50 అడుగుల ఎత్తయిన కోట గోడ నిలువునా జారిపోయింది. గతంలో ఇక్కడ కొన్ని పగుళ్లు ఏర్పడ్డాయి. దానికి మరమ్మతు చేయటంలో జాప్యం జరిగింది. ఆ తర్వాత కూడా పైభాగంలోనే పనులు చేపట్టారు. బలహీనంగా ఉన్న కింది భాగానికి పూర్తిస్థాయి మరమ్మతు జరగలేదు. దీంతో భారీ వర్షాలకు కిందిభాగం మరింత బలహీనపడి కూలింది. దీంతో పైనుంచి రాళ్లు జారి పడిపోయాయి. ఫలితంగా గోడ వెనుక ఉండే మట్టి పూర్తిగా జారిపోయింది. మజ్నూ బురుజు.. దాదాపు కనుమరుగు మజ్నూ బురుజు. నయాఖిల్లాలో ఉంది. ప్రస్తుతం దీని చుట్టూ గోల్ఫ్ కోర్సు అభివృద్ధి అయి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు సరిగ్గా 20 రోజుల ముందు దీనికి పైభాగంలో భారీ పగులు ఏర్పడింది. బురుజు పైభాగంలో 18 అడుగుల పొడవైన ఫిరంగి ఉంది. ఇది ఔరంగజేబు సైన్యం ఏర్పాటు చేసింది. దాని వెనుకవైపు పిట్టగోడ తరహాలో ఓ గోడ అప్పట్లోనే కట్టారు. ఆ గోడ నుంచి పగులు మొదలైంది. భారీ వర్షాల సమయంలో ఆ పగులు నుంచి నీరు లోపలికి చేరటంతో మట్టి జారి పైనుంచి దిగువ వరకు సగం బురుజు కూలిపోయింది. సగం బురుజు కూలగా, మిగతా సగం కూడా బలహీనపడింది. దానిపై టన్నుల బరువుండే ఫిరంగి ఉంది. ప్రస్తుతం అది కొంత భాగం గాలిలో వేళ్లాడుతోంది. క్రేన్‌తో దాన్ని పదిలంగా తీసి పనులు చేపట్టాలి. (చదవండి: గోల్కొండ కోట వద్ద నిర్మాణాలా..?) ఇలా అయితే కష్టమే.. జగదాంబ దేవాలయానికి మరోవైపు వెళ్లే మార్గం. ఆ పక్కన కూలిన గోడ లాగానే ఇక్కడ కూడా ప్రధాన కట్టడానికి పైనుంచి దిగువ వరకు భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు దీనికి అత్యవసరంగా శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతు అవసరం. లేకుంటే, సాధారణ వర్షాలకు కూడా అది కూలిపోయే ప్రమాదం ఉంది. ఇటీవల కురిసిన స్థాయి భారీ వర్షం భవిష్యత్తులో కురిస్తే ఈ గోడ నామరూపాల్లేకుండా పోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. రోడ్డు నిర్మాణంలో లోపం? కుతుబ్‌షాహీ నవాబుల కుటుంబం జలకాలాడేందుకు 460 ఏళ్ల కింద రూపుదిద్దుకున్న భారీ జలాశయాన్ని కటోరా హౌస్ అంటారు. దీన్ని ఆనుకునే రోడ్డు ఉంది. దానివైపు దాదాపు 5 అడుగుల ఎత్తుతో 60 మీటర్ల పొడవైన గోడ ఉంది. గతంలో రోడ్డు నిర్మించినప్పుడు, ఆ తర్వాత మరమ్మతులు చేసినప్పుడు వరద నీటి ప్రవాహ మార్గం చెదిరిపోయింది. వర్షాల వరద ప్రవాహం గతి తప్పి, గోడను ఆనుకుని ఉన్న మట్టి జారింది. ఇటీవలి వర్షాలకు ఆ గోడ దాదాపు 40 మీటర్ల మేర కటోరా హౌస్‌లోకి పడిపోయింది. ఇక్కడ నిర్వహణలో శాస్త్రీయత లోపించటం వల్లే ఈ గోడ కూలిందని స్పష్టమవుతోంది. -
పిలవని పెళ్లికి వెళ్లిన ట్రంప్
న్యూజెర్సీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలవని పేరంటానికి వెళ్లి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. సాధారణంగా భద్రత లేకుండా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లరు. అలాంటిది న్యూజెర్సీలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ కోర్స్‌లో జరిగిన ఈ పెళ్లికి ఏకంగా ప్రెసిడెంట్ హాజరుకావడంతో అక్కడున్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. ఈ సందర్భంగా వధూవరులకు ట్రంప్ శుభాకాంక్షలు చెప్పారు. వాళ్లతో కలిసి సెల్ఫీలు కూడా దిగారు. కాగా, ట్రంప్ ఇప్పటికి పలుమార్లు పెళ్లిళ్లకు ఇలానే ముందస్తు సమాచారం లేకుండా హాజరై ఆశ్చర్యపర్చారు. తాజాగా మరైన్ వన్ చాపర్‌లో పెళ్లి వేదిక వద్దకు ట్రంప్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. -
మంగళగిరిలో ఎయిర్‌పోర్టు.. విశాఖలో గోల్ఫ్ కోర్సు
- రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం - ఉడీ కాల్పుల్లో మృతిచెందిన జవాన్లకు శ్రద్ధాంజలి సాక్షి, అమరావతి: రాష్ట్ర కొత్త రాజధాని అమరావతికి అతిసమీపంలో మంగళగిరిలో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో విజయవాడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన మంత్రి మండలి వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విశాఖపట్నంలో గోల్ఫ్ కోర్సు ఏర్పాటుకు, విశాఖపట్నం జిల్లా అడవివరం గ్రామంలో పీపీపీ పద్ధతిన ప్రైవేట్ విద్యా సంస్థలకు భూములను కేటాయింపునకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు రూ. రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. శుక్రవారంలోగా పరిహారం అందేలా ఆదేశించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తారు. జమ్ముకాశ్మీర్‌లోని ఉడీ సెక్టార్ పరిధిలో సైనిక్ శిబిరంపై తీవ్రవాదుల నరమేధాన్ని కేబినెట్ తీవ్రంగా ఖండించడంతో పాటు ఈ ఘటనలో శత్రుమూకలను తరిమికొట్టిన సైనికులను అభినందిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించింది. మంత్రి పల్లె రఘునాధరెడ్డి మీడియాకు వెల్లడించిన వివరాలు.. ► విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో మెరైన్ అవుట్ ఫాల్ పైప్‌లైన్ నిర్మాణంలో నష్టబోయిన నిర్వాసితులకు జీవో ఎంఎస్ నెంబర్ 68 ప్రకారం రూ. 61 కోట్ల ప్రత్యేక బడ్జెట్ మొత్తాన్ని పరిహారంగా మంజూరుకు అనుమతి. ఏపీఐఐసీ చెల్లించే ఈ ప్యాకేజీ ఐదు వేల కుటుంబాలకు వర్తిస్తుంది. ► పశుసంవర్థక శాఖలో స్టేట్ లెవెల్ కమిటీ ద్వారా 300 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం. ► విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం సుంకి, ఉలిభద్ర గ్రామాల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఉద్యానవన కళాశాలకు 90 అధ్యాపక, అధ్యాపకేతర పోస్టుల మంజూరుకు ఆమోదం. ► మంగళగిరిలో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయం. విశాఖ విమానాశ్రయం నుంచి 60 శాతం ఎయిర్ ట్రాఫిక్ పెంచాలని, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపాలని నిర్ణయం. ► విశాఖ జిల్లా అడవివరంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్థతిలో ఇంటర్నేషనల్ స్కూల్‌ను అభివృదికి తగిన అభివృద్ధిదారుగా ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ, నోవా ఎడ్యుకేషనల్ సొసైటీలతో కూడిన కన్సార్షియం ఎంపిక చేయడానికి అనుమతి. ► జిల్లా స్థాయి టూరిజం కౌన్సిళ్లు. గోల్ఫ్ టూరిజాన్ని ప్రమోట్ చేయడం కోసం విశాఖ జిల్లా ముదసరిలోవలో 12.71 ఎకరాల పురపాలకశాఖ భూమిని మెస్సర్స్ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్‌కు కేటాయింపు. పట్టణ ఇళ్ల పథకంలో సబ్సిడీ: నారాయణ పట్టణ ప్రాంతాల ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణ పథకంలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతోపాటు లబ్ధిదారుల పేరిట బ్యాంకులోన్లు ఇప్పించి పూర్తి స్థాయిలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారని మంత్రి నారాయణ తెలిపారు. ఇంటి నిర్మాణానికి సొంత భూమి ఉన్న లబ్ధిదారులకు కేం ద్రం లక్షన్నర, రాష్ట్రం మరో లక్షన్నర రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తోందన్నారు. -
కృష్ణపట్నం పోర్టులో గోల్ఫ్ కోర్సు
ముత్తుకూరు :వ్యాపార, వాణిజ్య, ఎగుమతి–దిగుమతుల్లో అభివృద్ధి చెందుతున్న కృష్ణపట్నం పోర్టులో తాజాగా గోల్ఫ్ కోర్సు నిర్మించారు. దేశంలోని ఓడరేవుల్లో ఎక్కడా లేని విధంగా ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ గోల్ఫ్ కోర్సును ఆదివారం కేంద్ర మంత్రులు సురేష్‌ప్రభు, ఎం.వెంకయ్యనాయుడులు ప్రారంభిస్తారు. ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఈ కోర్సు ఏర్పాటు చేసినట్టు కేపీసీఎల్ ఎండీ చింతా శశిధర్ చెప్పారు. ఆంబే వ్యాలీ కోర్సు నిర్మించిన రూపశిల్పి డేవిడ్ హేమ్స్టాక్ దీనికి రూపకల్పన చేశారన్నారు. హోమ్ ఆఫ్ గోల్ఫ్ సెయింట్ ఆండ్యూస్ ప్రేరణతో దీనిని నిర్మించామన్నారు. దీనికి 18 రంధ్రాలుంటాయన్నారు. యూఎస్జీఏ ఆమోదించిన స్వచ్ఛమైన ఇసుకతో ఈ కోర్సును నిర్మించారని శశిధర్ తెలిపారు. సముద్రంతో అనుసంధానం చేసిన మొదటి గోల్ఫ్ కోర్సు ఇదేనన్నారు. దీనికి ‘సీవీఆర్ లింక్స్’ అని నామకరణం చేశామన్నారు. -
నమ్మశక్యం కాని దృశ్యం!
ఫ్లోరిడా నివాసి చార్లీ హెల్మ్స్, తన స్నేహితులు గోల్ఫ్ ఆడేందుకు గోల్ఫ్ కోర్స్ కు వెళ్లారు. తమకంటే ముందే అక్కడికి వచ్చిన అతిథిని చూసి వాళ్లంతా అవాక్కయ్యారు. 15 అడుగుల భారీ ఎలిగేటర్ అక్కడ ప్రత్యక్షం కావడంతో నోళ్లు వెళ్లబెట్టారు. మొసలి జాతికి చెందిన ఎలిగేటర్ దర్జాగా బఫెలో క్రీక్ గోల్ఫ్ కోర్స్ లో దర్జాగా చక్కర్లు కొట్టింది. నమ్మశక్యంకాని ఈ దృశ్యాన్ని చార్లీ హెల్మ్స్ తన కెమెరాలో బంధించాడు. అంతేకాకుండా మే 25న తన ఫేస్బుక్ పేజీలో ఈ వీడియో పోస్ట్ చేశాడు. తర్వాత యూట్యూబ్ లోనూ షేర్ చేశాడు. ఆన్లైన్ లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియోను 5 రోజుల్లోనే 40 లక్షల మంది వీక్షించడం విశేషం. గోల్ఫ్ కోర్స్ లోని ప్రతి అంగుళం తనకు తెలుసు అన్నట్టుగా ఎలిగేటర్ కలియదిరిగినట్టు వీడియోలో ఉంది. 'జూరాసిక్ పార్కు'లో సీన్ చూసినట్టుగా ఉంది. మరోవైపు ఎలిగేటర్ చూసి భయపడకుండా దాన్ని వీడియోలో బంధించిన చార్లీ హెల్మ్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. -
హైదరాబాద్ చుట్టూ గోల్ఫ్ కోర్సులు
రాయదుర్గం: విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నగరం చుట్టూ అంతర్జాతీయ ప్రమాణాలతో 5 నుంచి 10 గోల్ఫ్ కోర్సుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు వెల్లడించారు. గచ్చిబౌలిలోని డాక్టర్ వైఎస్సార్ నిథమ్‌లో మంగళవారం జాతీయ స్థాయి సదస్సు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరం చుట్టూ ఉన్న శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, నర్సాపూర్, సదాశివపేట్, కీసర వంటి ప్రాంతాలలో ఈ గోల్ఫ్ కోర్సులను 200 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. నగరం నుంచి 50 కిలోమీటర్ల లోపు, ఔటర్ రింగురోడ్డు నుంచి అరగంటలో వెళ్లే ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారన్నారు. స్థలం ఉన్న వారు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే అనుమతి ఇస్తామని, లేకుంటే లీజుకు ఇచ్చినా టీఎస్‌టీడీసీ ఏర్పాటు చేస్తుందన్నారు. హైదరాబాద్‌లోని గోల్ప్ కోర్సు 130 ఎకరాల్లో ఉందని, అంతర్జాతీయ ఆటగాడు టైగర్‌వుడ్ లాంటి వారు ఆడేందుకు ఆసక్తి కనబరుస్తారని అందుకే ఈ నిర్ణయిం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి కేంద్రం రూ. 90 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని ఆయన తెలిపారు. భువనగిరి కోట అభివృద్ధికి రూ. 4.8 కోట్ల కేంద్ర నిధులతో పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీఎస్‌టీడీసీ మేనేజింగ్ డెరైక్టర్, నిథమ్ డెరైక్టర్ డాక్టర్ కిష్ట్రినా చోంగ్తూ పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్వహణలో ‘ఎమ్మార్’ గోల్ఫ్ కోర్స్!
దీనిపై నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం సాక్షి. హైదరాబాద్: హైదరాబాద్‌లోని మణికొండలో ఎమ్మార్ ప్రాపర్టీస్ నిర్మించిన గోల్ఫ్ కోర్స్‌ను స్వయంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గోల్ఫ్‌కోర్స్‌తోపాటు విల్లాలు, విలాసవంతమైన అపార్టుమెంట్ల నిర్మాణానికి 1998లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 535 ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే. దుబాయ్‌కు చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ గోల్ఫ్ కోర్స్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. అయితే న్యాయ వివాదాల కారణంగా దాని నిర్వహణ ఆగిపోయింది. గోల్ఫ్ కోర్స్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని కొందరు విల్లాల యజమానులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి చర్యల నిమిత్తం సీఎం కేసీఆర్ శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. గోల్ఫ్ కోర్స్ నిర్వహణను చేపట్టే విషయాన్ని పరిశీలించాలని, అందులో ఖాళీగా ఉన్న భూమిని ఏ అవసరాలకు వినియోగించాలన్న దానిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. గోల్ఫ్ కోర్స్, విల్లాలు, క్లబ్, అపార్టుమెంట్ల నిర్మాణం తరువాత దాదాపు 50 ఎకరాల భూమి ఖాళీగా ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. జింకల పార్కుకు ప్రహారీ నిర్మాణం నగరంలోని ఎల్.బి. నగర్ పరిధిలో ఉన్న హరిణి వనస్థలి జింకల పార్కును సంరక్షించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పార్కు స్థలం కబ్జా కాకుండా చుట్టూ ప్రహారీగోడను నిర్మించాలని సూచించారు. పార్కు అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.50 లక్షలు ఇచ్చేందుకు ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అంగీకరించారు. కేబీఆర్ పార్కు మాదిరి బొటానికల్ గార్డెన్ హైదరాబాద్‌లోని బొటానికల్ గార్డెన్‌ను బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు (కేబీఆర్) మాదిరి తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వాకింగ్ కోసం వాక్‌వే నిర్మించాలని సూచించారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.