![The Golfer Is Seen Preparing To Swing At The Tee Box When She Stops After Spotting A Large Group Of Kangaroos Hopping Towards Her - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/29/Gulf.jpg.webp?itok=VbynhZ6R)
కాన్‌బెర్రా: మనం ప్లే గ్రౌండ్‌లో ఆడుకుంటున్నప్పుడు ఏవైనా జంతువులు దండుగా వస్తే కాస్త భయపడతాం. మనకు ఏం చేయాలో కూడా తోచదు. కాసేపు ఆగి అవి వెళ్లాక మళ్లీ ఆట కొనసాగిస్తాం. అచ్చం అలాంటి ఘటనే ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.
(చదవండి: భారత్‌కు చేరిన అద్భుత కళాఖండాలు)
అసలు ఏం జరిగిందంటే ఆస్ట్రేలియాకు చెందిన ఒక గోల్ఫ్ క్రీడాకారిణి గోల్ఫ్ కోర్సులో భాగంగా ప్రాక్టీస్ చేస్తుంటుంది. ఇంతలో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఒక్కసారిగా ఒక్కో కంగారు జంతువు వస్తూ అలా దండుగా మొత్తం కంగారు సముహం వస్తుంది. దీంతో ఆ క్రీడాకారిణికి గోల్ఫ్ చేయడానికి అంతరాయం ఏర్పడుతుంది. కానీ అవి దండుగా మేము కూడా గోల్ఫ్ నేర్చుకుంటాం అన్నట్లుగా క్రీడాకారిణి దగ్గరకు వస్తాయి.
అవి అన్ని గెత్తుతు మొత్తం ఆ ప్రదేశం అంతా తిరుగుతాయి. దీంతో ఆమె ఆశ్యర్యపోతుంది. అంతేకాదు ఆమె దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. దీంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ మేరకు నెటిజన్లు అవి గోల్ఫ్ ఎలా చేస్తారో చూడటానికి వచ్చినట్టున్నాయి కాబోలు అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
(చదవండి: దేశాన్ని రక్షించేందుకే వచ్చాం!)
Comments
Please login to add a commentAdd a comment