golf player
-
రొనాల్డో కోసం ఏదైనా.. టాప్‌లెస్‌గా దర్శనం
అమెరికాకు చెందిన మాజీ గోల్ఫ్ క్రీడాకారిణి పెయిజ్ స్పిరానక్ పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు వీరాభిమాని. ముఖ్యంగా రొనాల్డో సుయ్ (Sui Celebration)కు పెద్ద ఫ్యాన్. తాజాగా ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్న రొనాల్డో తన జట్టు పోర్చుగల్‌ను విజేతగా నిలిపే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించిన పోర్చుగల్ డిసెంబర్ 7న స్విట్జర్లాండ్‌తో తలపడనుంది. ఇదిలా ఉంటే రొనాల్డో సుయ్ సెలబ్రేషన్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని సెలబ్రేషన్‌ను ఇప్పటికే చాలా మంది అనుసరించారు. క్రికెటర్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే రొనాల్డోకు వీరాభిమాని అయిన పెయిజ్ స్పిరానక్ మాత్రం కాస్త వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంది. బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించాకా.. తాను వేసుకున్న టాప్‌ను తొలగించి సుయ్ సెలబ్రేషన్ చేసుకుంది. ఆ తర్వాత ఇన్నర్ వేర్‌పై మోకాళ్లపై కూర్చొని లవ్ యూ రొనాల్డో అంటూ నవ్వులు చిందించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. .@PaigeSpiranac here to give us her best Brandi Chastain celebration How’d she do? pic.twitter.com/TWRbdtZ9VM — PointsBet Sportsbook (@PointsBetUSA) November 30, 2022 చదవండి: FIFA: మ్యాచ్ సమయంలో మెస్సీ ఎందుకు నడుస్తాడో తెలుసా? FIFA WC: మహా తుంటరోడు.. తండ్రి లక్షణాలు ఒక్కటీ రాలేదు! -
ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?
కాన్బెర్రా: మనం ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు ఏవైనా జంతువులు దండుగా వస్తే కాస్త భయపడతాం. మనకు ఏం చేయాలో కూడా తోచదు. కాసేపు ఆగి అవి వెళ్లాక మళ్లీ ఆట కొనసాగిస్తాం. అచ్చం అలాంటి ఘటనే ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. (చదవండి: భారత్‌కు చేరిన అద్భుత కళాఖండాలు) అసలు ఏం జరిగిందంటే ఆస్ట్రేలియాకు చెందిన ఒక గోల్ఫ్ క్రీడాకారిణి గోల్ఫ్ కోర్సులో భాగంగా ప్రాక్టీస్ చేస్తుంటుంది. ఇంతలో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఒక్కసారిగా ఒక్కో కంగారు జంతువు వస్తూ అలా దండుగా మొత్తం కంగారు సముహం వస్తుంది. దీంతో ఆ క్రీడాకారిణికి గోల్ఫ్ చేయడానికి అంతరాయం ఏర్పడుతుంది. కానీ అవి దండుగా మేము కూడా గోల్ఫ్ నేర్చుకుంటాం అన్నట్లుగా క్రీడాకారిణి దగ్గరకు వస్తాయి. అవి అన్ని గెత్తుతు మొత్తం ఆ ప్రదేశం అంతా తిరుగుతాయి. దీంతో ఆమె ఆశ్యర్యపోతుంది. అంతేకాదు ఆమె దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. దీంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ మేరకు నెటిజన్లు అవి గోల్ఫ్ ఎలా చేస్తారో చూడటానికి వచ్చినట్టున్నాయి కాబోలు అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: దేశాన్ని రక్షించేందుకే వచ్చాం!) View this post on Instagram A post shared by Wendy Powick (@wendywoo.golf) -
అదితి ఓ సెన్సేషన్.. ఈ పోరు చరిత్రలో నిలవాల్సిందే!
క్రీడాభిమానుల గుండె వేగం పెంచే ఆట క్రికెట్ ఒక్కటేనా?.. ఛా.. ఛా.. ఈసారి ఒలింపిక్స్‌లో అలాంటి క్షణాలు చాలానే కనిపించాయి. క్వార్టర్స్, సెమీస్, ఫైనల్.. అంటూ హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్.. ఆఖరికి రూల్స్‌పై కూడా సరిగా అవగాహనా- ఆటపై అంతగా ఆసక్తి సైతం లేని గోల్ఫ్‌ను సైతం కోట్ల భారతావనిని ఆసక్తిగా తిలకించేలా చేశారు మన ఆటగాళ్లు. అలాంటి ఉత్కంఠంతో చివరిదాకా మ్యాచ్‌ను కొనసాగించి.. ఓడినా చరిత్ర సృష్టించింది భారత యువగోల్ఫర్ అదితి అశోక్ . సాక్షి, వెబ్‌డెస్క్: ఆటల్లో రిచ్చెస్ట్ గేమ్‌గా గోల్ఫ్‌కు ఓ పేరుంది. అలాంటి ఆటలో.. అదీ ఒలింపిక్స్‌లో మొట్టమొదటిసారి ఫైనల్‌దాకా చేరుకుని భారత్‌కు పతాక ఆశలు చిగురింపజేసింది 23 ఏళ్ల అదితి. టోక్యో ఒలింపిక్స్‌కి ముందు.. ప్రారంభమైన తర్వాతా పతకాన్ని తెస్తారనే ఆశలు ఉన్న పేర్ల లిస్ట్‌లో అదితి పేరు కనీసం ఏదో ఒక మూలన కూడా లేదు. కారణం.. మహిళా గోల్ఫ్ ర్యాకింగ్స్లో ఆమెది 200వ ర్యాంక్. అలా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. పతాక పోరు దాకా అదితి చేరుకోవడం, ఆ పోరాటంలో ఓడి కోట్ల మంది హృదయాలను గెల్చుకోవడం ప్రత్యేకమనే చెప్పాలి. బెంగళూరుకు చెందిన అదితి అశోక్.. టోక్యో ఒలింపిక్స్‌లో నిన్నటి పొజిషన్లో(మూడో రౌండ్) రెండో స్థానంలో నిలవగా.. అదృష్టం బావుండి ఇవాళ్టి వాతావరణం బాగోలేకపోతే దాదాపు పతాకం ఖాయమయ్యేదే. అయితే శనివారం ఉదయం సైటమాలోని కాసుమిగాసెకి కౌంట్రీ క్లబ్లో జరిగిన ఫైనల్ గేమ్ రసవత్తరంగా నడిచింది. అయినా అతిది అద్భుతమైన ఆట తీరును కనబరిచింది. టాప్ పొజిషన్లో నిలిచి ఒకానొక టైంలో అభిమానుల్లో స్వర్ణం ఆశలు రేకెత్తించి ఉత్కంఠ పెంచిన అదితి.. ఆపై రెండు, మూడు.. చివరికి స్వీయ తప్పిదం-ప్రత్యర్థులకు కలిసి రావడంతో నాలుగో స్థానానికి సెటిల్ అయ్యింది. పతకం దక్కించుకోకపోతేనేం.. గోల్ఫ్ ఆటలోనూ అసలైన మజాను కోట్ల మంది భారతీయులకు రుచి చూపించింది అదితి. ఇక రియో ఒలింపిక్స్‌లో 41 వ స్థానంలో టైతో నిష్క్రమించిన అదితి అశోక్.. ఈసారి ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా ఫైనల్ దాకా దూసుకెళ్లడం విశేషం. క్యాడీగా(గోల్ఫ్ బ్యాగులు మోస్తూ సాయం చేసే వ్యక్తి) తల్లి వెంటరాగా.. 200వ ర్యాంక్‌తో బరిలోకి దిగిన ఈ యువ కెరటం ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ నెల్లీ కోర్డా, మాజీ ఛాంపియన్ లైడియా కో(11), ఎమిటీ క్రిస్టియన్(72), మోన్ ఇనామీ(28)మధ్య గట్టి పోటీ ఇస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఒకానొక దశలో ప్రపంచ నెంబర్ వన్, మాజీ నెంబర్ వన్లకు ముచ్చెమటలు పోయించింది ఈ భారత గోల్ఫ్ ప్లేయర్. చదవండి: భారత హాకీ: పతాకం నుంచి పతనం.. ఆపై పతకం గోల్ఫ్ ఆట తీరు అర్థంకాకపోయినా.. అదితి ఆడుతున్నంతసేపూ ఉత్కంఠను తట్టుకోలేకపోయారు యావత్ భారత క్రీడాభిమానులు. గోల్ఫ్ అంటే ఆసక్తి లేనోళ్లను.. సైతం శనివారం పొద్దుపొద్దున్నే టీవీలకు, సెల్‌పోన్లకు అతుక్కుపోయేలా చేసింది అదితి అశోక్. అంతేకాదు కొందరిని ఆటలోని పదాలను, ఆట తీరును అర్థం చేసుకునేలా చేసింది. ఇక ఒలింపిక్ జాబితాలో పీటీ ఉష, దీపా కర్మాకర్, ఈ ఒలింపిక్స్‌లో ఉమెన్స్ హాకీ టీం.. ఇప్పుడు అదితి అశోక్.. ఇలా ఫోర్త్ సెటిల్ సెంటిమెంట్(తృటిలో పతకం చేజార్చుకున్న ఆటగాళ్ల) ప్రస్తావనను మరోసారి తెర మీదకు తెచ్చింది. -
గోల్ఫ్ దుర్గమ్మ
ఒక ఉత్సాహం.. ఒక నిరుత్సాహం. ‘తొలి ఇండియన్’ గా ఉత్సాహం. ఫైనల్స్‌కు చేరనందుకు నిరుత్సాహం. పదహారేళ్ల అణికకు.. ఒకే ఈవెంట్లో రెండు అనుభవాలు. పేరులో దుర్గమ్మ ఉంది. పేరు తెచ్చుకునే ప్రావీణ్యం ఉంది. ముందుముందు ఆట చాలా ఉంది. దిగులు పడకు ఛాంపియన్! పదహారేళ్ల నోయిడా అమ్మాయి అణికా వర్మ కాలిఫోర్నియాలోని ‘గ్రానైట్ బే హై స్కూల్’లో చదువుతోంది. స్కూల్ ప్రాంగణంలో ఉన్నంత వరకు ఆమె పేరు గురించి ఎవరికీ రాని ఒక ప్రశ్న, స్కూల్ అయ్యాక ఆమె ఒకసారి గోల్ఫ్ కోర్సులోకి అడుగు పెట్టాక తప్పనిసరిగా వచ్చేస్తుంది! ‘‘వావ్.. అనికా! అనీకా సోరెన్స్టామ్ పేరు పెట్టారా నీకు మీ అమ్మానాన్న’’ అని గోల్ఫ్ కోర్సులో ఒక్కరైనా అడగకుండా ఉండరు. ఆమె కోచ్ నోవా మాంట్గొమరీ అయితే మొదటే ఆ ప్రశ్న అడిగారు. అందుకు సమంజమైన కారణమే ఉంది. 48 ఏళ్ల అనీకా సోరెన్స్టామ్ జగత్ప్రసిద్ధ స్వీడిష్ గోల్ఫ్ క్రీడాకారిణి. ఆమె పేరులోని ‘అనీకా’ నే, అంతటి ప్లేయర్ కావాలని అణికకు కూడా పెట్టారని ఎవరైనా అనుకోవడం సహజమే. ఆ ప్రశ్నకు నవ్వుతుంది అణిక. ‘‘అలా అనేం కాదు. అణిక అంటే దుర్గామాత. స్త్రీ శక్తి. ఆ పేరునే నాకు పెట్టారు’’ అని చెబుతుంది. ఇప్పుడీ ‘దుర్గమ్మ’ గోల్ఫ్‌లో తన శక్తిని చాటి 125 ఏళ్ల చరిత్ర గల ‘యు.ఎస్. ఉమెన్స్ అమెచ్యూర్ చాంపియన్‌షిప్’ కు ఆడిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందింది. బుధవారం మేరిలాండ్, రాక్విల్లోని ‘ఉడ్మౌంట్ కంట్రీ క్లబ్’ తరఫున ఆడిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఒక్క షాట్ తేడాతో ఓడిపోయినప్పటికీ, ‘ఆడటం’ అన్నది అణికను విజేతగా నిలబెట్టింది. అసలు అణిక కోసమే ఈ ‘తొలి’ అనే గుర్తింపు ఎదురు చూస్తున్నట్లుగా ఉందనుకోవాలి! 2016లో అప్పటికి పద్దెనిమిదేళ్ల వయసు ఉన్న అదితి అశోక్ ‘ఉమెన్ అమెచ్యూర్’ లో ఆడేందుకు అర్హత సాధించినప్పటికీ, ‘హీరో ఉమెన్స్ ఇండియన్ ఓపెన్’ను ఎంచుకుని, అక్కడ విజేతగా నిలిచింది. అప్పటి నుంచీ ఏ మహిళా ఇండియన్ గోల్ఫర్ కూడా యు.ఎస్. అమెచ్యూర్ వరకు రాలేదు. ఈ ఆగస్టు 3న జరిగిన టూ–స్ట్రోక్ ప్లే రౌండ్‌తో అణిక ఆ గుర్తింపును సాధించింది. 9న ఫైనల్స్. అయితే అంతవరకు వెళ్లలేకపోవడాన్ని వైఫల్యం అని కాకుండా, ఆమె ఎంతవరకు వెళ్లిందో అంతవరకే విజయంగా చూడాలి. అణిక గత ఏడాదే ‘హీరో ఉమెన్స్ ఇండియన్ ఓపెన్’తో తొలిసారి వార్తల్లోకి వచ్చింది. అప్పుడు ఆమె వయసు 15. హీరో ఉమెన్స్ అనేది యేటా జరిగే ‘లేడీస్ యూరోపియన్ టూర్’ ఈవెంట్. ఆ ఈవెంట్లో అణిక బెస్ట్ ఇండియన్ ప్లేయర్‌గా ఐదో స్థానంలో నిలిచింది. ఇరవై దేశాల క్రీడాకారిణులలో ఐదో స్థానం అంటే చిన్న సంగతేమీ కాదు. కూతురిలోని గోల్ఫ్ టాలెంట్‌ని గడప దాటించాలని అనుకున్న అణిక తండ్రి తన కుటుంబాన్ని నోయిడా నుంచి కాలిఫోర్నియాలోని శాక్రమెంటోకి మార్చేశారు. అణిక తల్లిదండ్రుల ఇద్దరి పేర్లు ఒకేలా ఉంటాయి. ఆయన సొనేల్. ఆమె పేరు సోనాల్. ఆట సరంజామా ఉండే గోల్ఫ్ కార్ట్‌లో కూతుర్ని కూర్చోబెట్టుకుని సొనేల్ స్వయంగా తనే గోల్ఫ్ కోర్సులో డ్రైవ్ చేస్తుంటారు. అంత ముద్దు కూతురంటే. గోల్ఫ్ కార్ట్‌లో తండ్రి పక్కన అణిక -
‘నా చెల్లిని తన పేరుతోనే గుర్తించండి’
కుటుంబంలో ఒకరికి పేరు వస్తే చాలు.. మిగతా వారిని కూడా ఆ పేరుతోనే గుర్తిస్తాం. కానీ తన చెల్లి విషయంలో మాత్రం అలా చేయవద్దంటున్నారు బాలీవుడ్ పద్మావత్ దీపికా పదుకోన్. తన చెల్లి ప్రతిభ ఆధారంగానే తనను గుర్తించాలని కోరుకుంటున్నారు. బాలీవుడ్లో ‘లక్కీ గర్ల్’గా పేరు తెచ్చుకోవడమే కాకా దానికి తగ్గ పారీతోషికం అందుకుంటున్న హీరోయిన్ దీపికా పదుకోన్. అయితే దీపికకు ఓ సోదరి కూడా ఉన్నారు. ఆమె పేరు అనీశా పదుకోన్. దీపిక కుటుంబంలో చాలా మంది క్రీడాకారులు ఉన్న సంగతి తెలిసిందే. స్వయంగా దీపిక తండ్రి ప్రకాశ్ పదుకోన్ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. దీపిక కూడా జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడారు. ఆ తర్వాత బాలీవుడ్లో ప్రవేశించి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో దీపిక సోదరి అనీశా గోల్ఫ్ క్రీడాకారిణిగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల మీడియా పత్రిక అనీశాను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూకు ‘ది అదర్ పదుకోన్’ అని టైటిల్ పెట్టారు. ఇది చూసిన దీపిక వెంటనే ‘అదర్ పదుకోన్’ కాదు ‘ది పదుకోన్’ అంటూ సరి చేశారు. అంతేకాక ‘నా చిట్టి చెల్లిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది’ అనే క్యాప్షన్ ఇచ్చారు. View this post on Instagram not the ‘other’ Padukone...’The’ Padukone! I’m soo proud of you my little baby girl...❤️ @anishapadukone A post shared by Deepika Padukone (@deepikapadukone) on Sep 24, 2018 at 6:45am PDT దీపిక ఇలా అనడానికి కారణం ఉంది. ప్రకాశ్, దీపిక వృత్తిపరంగా తమకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అనీశాకు ఇంకా అంతగా గుర్తింపు రాలేదు. దాంతో తండ్రి, సోదరిల పేరును అనిశాకు ఆపాదిస్తూ ‘మరో పదుకోన్’ అంటూ రాశారు. దాంతో దీపిక తన సోదరిని ‘మరో పదుకోన్’ అని అనకూడదని, ఆమెకు కూడా సొంత గుర్తింపు ఉంది అని చెప్పడానికిఈ విధంగా చేశారు. -
గోల్ఫ్‌లోనూ సత్తా చాటాడు
సాక్షి, ముంబయి : ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ గోల్ఫ్ క్రీడాకారుడిగానూ రాణిస్తున్నాడు. మెర్సిడెస్ ట్రోఫీ గోల్ఫ్ మీట్ నేషనల్స్‌కు మాధవన్ క్వాలిఫై అయ్యాడు. ఏప్రిల్ 4-6 తేదీల్లో పూణే ఆక్స్ఫర్డ్ గోల్ప్ రిసార్ట్‌లో జరిగే జాతీయ ఫైనల్స్‌లో మాధవన్ పోటీ పడనున్నాడు. గోల్ఫ్ నేషనల్ ఫైనల్స్‌లో పాల్గొనేందుకు తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని మాధవన్ సంతోషం వ్యక్తం చేశారు. ఫైనల్స్‌కు జరిగిన ఎంపికలో మాధవన్ 69.6 స్కోర్ సాధించి సత్తా చాటారు. నేటి ఫలితాల్లో 78 స్కోర్‌తో రోహన్ నిగం బెస్ట్ గ్రాస్ విన్నర్‌గా నిలిచాడు. -
నవ్వుని చెరగనివ్వలేదు
అనంతరం ప్రముఖ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, ప్రముఖ నటి నీనాగుప్తాల కూతురు.. మసాబా. తల్లి రంగు, తండ్రి పోలికలతో పుట్టింది. తండ్రిలోని ఆవేశం, తల్లిలోని ఆలోచన కూడా కలగలుపుకుని పెరిగింది. అందుకే ఆమెని చూస్తే... రిచర్డ్స్, నీనా... ఇద్దరూ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటారు. అయితే ఆ ఇద్దరి కారణంగానే సమాజం ఆమెను వేలెత్తి చూపించింది. కానీ మసాబా చలించలేదు. చలించివుంటే... ఆమె ఈరోజు టాప్ ఫ్యాషన్ డిజైనర్ అయ్యేది కాదు! ఊహ తెలిసేనాటికి మసాబా ముందు ఓ పెద్ద ప్రశ్న నిలబడింది. ‘ఈ సమాజానికి ఏం సమాధానం చెప్పాలి’... ఇదే ఆ ప్రశ్న. అతి చిన్న వయసులో ఓ ఆడపిల్లకి అలాంటి ప్రశ్న ఎదురవడం చిన్న విషయమేమీ కాదు. కానీ మసాబాకు తప్పలేదు. తల్లి ఉంది. తండ్రి కూడా ఉన్నాడు. కానీ వాళ్లిద్దరూ కలిసి లేరు. కారణం... తనకు తండ్రి అయిన వ్యక్తి, తన తల్లికి తాళి కట్టలేదు. అంటే... సమాజం వింతగా చూసే పరిస్థితుల్లో ఉంది తాను. కానీ మసాబా ఎప్పుడూ ఆ విషయం గురించి ఆలోచించలేదు. ఇంకా చెప్పాలంటే... ఆమె తల్లి ఆమెనలా ఆలోచించనివ్వలేదు. అందుకే తాను సమాజం వైపు ఎప్పుడూ తలెత్తుకునే చూశానంటుందామె. పెళ్లి కాకుండానే తల్లి అయిన మహిళని సమాజం ఎలా చూస్తుందో నీనాకి బాగా తెలుసు. కానీ ఆమె సమాజాన్ని ఎదిరించాలని నిర్ణయించుకున్నారు. మసాబాకు జన్మనిచ్చారు. తన బిడ్డని ప్రపంచానికి గర్వంగా చూపించారు. ఏనాడూ తండ్రిమీద విద్వేషాన్ని కూతురిలో రగల్చలేదామె. అందుకే తల్లితో పాటు తండ్రి దగ్గర కూడా సమానంగా పెరిగింది మసాబా. ఇద్దరి ప్రేమనూ అందిపుచ్చుకుంది. ఇద్దరి అనురాగాన్నీ ఆస్వాదించింది. కానీ వాళ్ల బంధం గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచించలేదంటుంది. ‘‘అమ్మానాన్నల మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కూడా నాకు తెలుసు. అందుకే ఏనాడూ నేను ఆ విషయం గురించి వాళ్ల దగ్గర ఎత్తలేదు, వాళ్లను ప్రశ్నించలేదు’ అంటుంది మసాబా. అలాగని ఆమె అందరి పిల్లల్లాగే ఆనందంగా పెరిగిందా అంటే అదీ లేదు. అమ్మానాన్నలు కళ్లలో పెట్టుకున్నా... లోకులు ఆమెను పక్కన పెట్టాలనే చూసేవారు. తండ్రిలాగే అచ్చమైన వెస్టిండీస్ వ్యక్తిలా కనిపించే ఆమెను చూసి ఇండియాలో కొందరు హేళన చేసేవారు. తండ్రి బాటలో నడిచి క్రీడాకారిణి కావాలని అనుకుంటే... రిచర్డ్స్ కూతురా, అయితే అతడి ఆవేశమూ ఉండి ఉంటుంది, క్రీజు మీద చిందులేస్తుందో ఏమో’ అంటూ వెస్టిండీస్‌లో కొందరు కామెంట్ చేసేవారు. ఓ క్షణం మనసు చివుక్కుమన్నా... మరుక్షణం దాన్ని మర్చిపోయేది మసాబా. నవ్వు ముందు బాధ నిలబడలేదు అన్నది ఆమె సిద్ధాంతం. నేటి వరకూ దానినే అనుసరిస్తూ వచ్చింది. తనను చూసి ఎవరైనా ఎగతాళిగా నవ్వితే, దాన్ని స్వీకరిస్తూ నవ్వేది. తనను చూసి ఎవరైనా ప్రేమగా నవ్వితే, తిరిగి అభిమానంగా నవ్వేది. అన్నిటికీ నవ్వునే సమాధానంగా సంధించడం అలవాటు చేసుకున్నాక జీవితమంతా ఆనందమయమైపోయింది అంటుంది... నవ్వుతూనే. గోల్ఫ్ ప్లేయర్ కావాలనుకుంది మసాబా. కానీ తన దుందుడుకు స్వభావానికి ఆటలు సరిపడవని అర్థం చేసుకుంది. అందుకే ఫ్యాషన్ ప్రపంచం వైపు దృష్టి పెట్టింది. రెండే రెండేళ్లలో భారతదేశంలోని టాప్ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. విదేశాలకు తన డిజైన్లను విస్తరించింది. స్టయిల్‌కి మారుపేరులా ఉండే తన తల్లిని చూసే ఫ్యాషన్ అంటే ఏంటో తెలుసుకున్నాననే మసాబా... తన డిజైనర్ స్టూడియోను తల్లికే అప్పగించింది. తను మాత్రం... తన ప్రతిభను మరిన్ని మెట్లు ఎక్కించే ప్రయత్నంలో నిరంతర యజ్ఞం చేస్తోంది! - సమీర నేలపూడి