‘నా చెల్లిని తన పేరుతోనే గుర్తించండి’ | Deepika Padukone Said The Padukone Not Other Padukone | Sakshi
Sakshi News home page

‘నా చెల్లిని తన పేరుతోనే గుర్తించండి’

Published Tue, Sep 25 2018 12:25 PM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM

Deepika Padukone Said The Padukone Not Other Padukone - Sakshi

సోదరి అనిశా పదుకోన్‌తో దీపికా పదుకోన్‌ (ఫైల్‌ ఫోటో)

కుటుంబంలో ఒకరికి పేరు వస్తే చాలు.. మిగతా వారిని కూడా ఆ పేరుతోనే గుర్తిస్తాం. కానీ తన చెల్లి విషయంలో మాత్రం అలా చేయవద్దంటున్నారు బాలీవుడ్‌ పద్మావత్‌ దీపికా పదుకోన్‌‌. తన చెల్లి ప్రతిభ ఆధారంగానే తనను గుర్తించాలని కోరుకుంటున్నారు. బాలీవుడ్‌లో ‘లక్కీ గర్ల్‌’గా పేరు తెచ్చుకోవడమే కాకా దానికి తగ్గ పారీతోషికం అందుకుంటున్న హీరోయిన్‌ దీపికా పదుకోన్‌. అయితే దీపికకు ఓ సోదరి కూడా ఉన్నారు. ఆమె పేరు అనీశా పదుకోన్‌. దీపిక కుటుంబంలో చాలా మంది క్రీడాకారులు ఉన్న సంగతి తెలిసిందే.

స్వయంగా దీపిక తండ్రి ప్రకాశ్‌ పదుకోన్‌ ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు. దీపిక కూడా జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్‌ ఆడారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ప్రవేశించి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో దీపిక సోదరి అనీశా గోల్ఫ్‌ క్రీడాకారిణిగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల మీడియా పత్రిక అనీశాను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూకు ‘ది అదర్ పదుకోన్‌’ అని టైటిల్‌ పెట్టారు. ఇది చూసిన దీపిక వెంటనే ‘అదర్‌ పదుకోన్‌’ కాదు ‘ది పదుకోన్‌’ అంటూ సరి చేశారు. అంతేకాక ‘నా చిట్టి చెల్లిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు.

దీపిక ఇలా అనడానికి కారణం ఉంది.  ప్రకాశ్‌, దీపిక వృత్తిపరంగా తమకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అనీశాకు ఇంకా అంతగా గుర్తింపు రాలేదు. దాంతో తండ్రి, సోదరిల పేరును అనిశాకు ఆపాదిస్తూ ‘మరో పదుకోన్‌’  అంటూ రాశారు. దాంతో దీపిక తన సోదరిని ‘మరో పదుకోన్‌’ అని అనకూడదని, ఆమెకు కూడా సొంత గుర్తింపు ఉంది అని చెప్పడానికిఈ విధంగా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement