కృష్ణపట్నం పోర్టులో గోల్ఫ్ కోర్సు
కృష్ణపట్నం పోర్టులో గోల్ఫ్ కోర్సు
Published Sun, Jul 24 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
ముత్తుకూరు :వ్యాపార, వాణిజ్య, ఎగుమతి–దిగుమతుల్లో అభివృద్ధి చెందుతున్న కృష్ణపట్నం పోర్టులో తాజాగా గోల్ఫ్ కోర్సు నిర్మించారు. దేశంలోని ఓడరేవుల్లో ఎక్కడా లేని విధంగా ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ గోల్ఫ్ కోర్సును ఆదివారం కేంద్ర మంత్రులు సురేష్‌ప్రభు, ఎం.వెంకయ్యనాయుడులు ప్రారంభిస్తారు. ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఈ కోర్సు ఏర్పాటు చేసినట్టు కేపీసీఎల్ ఎండీ చింతా శశిధర్ చెప్పారు. ఆంబే వ్యాలీ కోర్సు నిర్మించిన రూపశిల్పి డేవిడ్ హేమ్‌స్టాక్ దీనికి రూపకల్పన చేశారన్నారు. హోమ్ ఆఫ్ గోల్ఫ్ సెయింట్ ఆండ్యూస్ ప్రేరణతో దీనిని నిర్మించామన్నారు. దీనికి 18 రంధ్రాలుంటాయన్నారు. యూఎస్‌జీఏ ఆమోదించిన స్వచ్ఛమైన ఇసుకతో ఈ కోర్సును నిర్మించారని శశిధర్ తెలిపారు. సముద్రంతో అనుసంధానం చేసిన మొదటి గోల్ఫ్ కోర్సు ఇదేనన్నారు. దీనికి ‘సీవీఆర్ లింక్స్’ అని నామకరణం చేశామన్నారు.
Advertisement