మాస్కో: రెండో ప్రపంచ యుద్ధం నుంచి బయటపడిన 84 ఏళ్ల మొసలి శుక్రవారం ఉదయం మరణించింది. ఈ మేరకు జూ అధికారులు ట్విటర్ వేదికగా సాటర్న్(మొసలి) మరణాన్ని వెల్లడించారు. గౌరవించే వయసులోనే చనిపోయిందని పేర్కొన్నారు. కాగా సాటర్న్ యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించింది. 1936లో దీన్ని జర్మనీలోని బెర్లిన్ జూకు బహుమానంగా ఇచ్చారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనన మయంలో జర్మనీపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో బెర్లిన్ జూపైనా బాంబు దాడులు జరిగాయి. (ఎలుక పెయింటింగ్‌కు ఎంత డిమాండో..)
ఎన్నో జీవులు బాంబు ధాటికి నేలకొరిగినప్పటికీ ఈ మొసలి మాత్రం చాకచక్యంగా తప్పించుకోగలిగింది. సుమారు మూడేళ్ల తరువాత బ్రిటీష్ సైన్యానికి కనిపించింది. దీంతో దాన్ని బ్రిటన్ తన మిత్రదేశమైన రష్యాకు బహుమానంగా అందించింది. అలా అది చివరికి మాస్కో జూకు చేరింది. అక్కడే 74 ఏళ్లు జీవించింది. అది చనిపోవడంతో జూ సిబ్బంది భావోద్వేగానికి లోనయ్యారు. సాటర్న్‌ను తమ చిన్ననాటి నుంచి చూస్తూ వచ్చామని దాని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాగా ఇది నాజీల నాయకుడు అడాల్ఫ్ హిట్లర్‌కు చెందిన మొసలిగా ప్రాచుర్యం పొందినప్పటికీ అవన్నీ వుట్టి పుకార్లేనని జూ అధికారులు స్పష్టం చేశారు. (మొసలి నోట్లో తల పెట్టింది..)
Comments
Please login to add a commentAdd a comment