చంద్రుడికి చేరువలో కనిపించిన శుక్రుడు, శని
న్యూఢిల్లీ: అంతరిక్షంలో కనువిందైన దృశ్యం కనిపించింది. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు, భారీ వలయంతో కూడిన గ్రహం శని మన చందమామకు చాలా చేరువలో కనిపించాయి. శనివారం రాత్రి 8.30 గంటలకు ఈ అద్భుతాన్ని జనం వీక్షించారు.
ఇండియాతోపాటు యూకే, అమెరికా, చైనా, తుర్కియే తదితర దేశాల్లో ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే ఇది కంటికి కనిపించడం విశేషం. బైనాక్యులర్స్ లేదా టెలి స్కోప్ ఉన్నవారు మరింత స్పష్టంగా చూడగలిగారు. ముఖ్యంగా శని గ్రహం చుట్టూ ఉన్న వలయాన్ని ఆసక్తిగా గమనించారు. అంతరిక్షంలో ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగా సంభవిస్తుంటాయని సైంటిస్టులు చెప్పారు. ఈ నెల 18వ తేదీన మళ్లీ ఇలాంటి దృశ్యం వీక్షించవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment