Saturn
-
‘మూన్ కింగ్’గా మళ్లీ శని గ్రహం.. 83 నుంచి 145కు చంద్రుల సంఖ్య
బ్రిటిష్ కొలంబియా: సౌర కుటుంబంలో అత్యధికంగా చంద్రులు పరిభ్రమిస్తున్న శని గ్రహం ‘మూన్ కింగ్’ కిరీటాన్ని తిరిగి చేజిక్కించుకుంది. ఈ గ్రహం చుట్టూ మరో 62 చంద్రులు పరిభ్రమిస్తున్నట్లు తాజాగా ఖగోళ పరిశోధకులు గుర్తించారు. దీంతో, శని చుట్టూ తిరుగుతున్న చంద్రుల సంఖ్య 83 నుంచి 145కు చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా గుర్తించిన 12 చంద్రులతో కలిపి అత్యధికంగా 95 చంద్రులతో అగ్రభాగాన నిలిచిన గురుగ్రహం మూన్కింగ్గా కొనసాగుతోంది. అయితే, అకాడెమియా సినికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఎడ్వర్డ్ ఏస్టన్ మరో 62 చంద్రులు శని గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గుర్తించారు. హవాయిలోని మౌనాకియాపై ఏర్పాటు చేసిన టెలీస్కోప్‌లో 2019–21 మధ్య నమోదైన డేటా ఆధారంగా సాగిస్తున్న పరిశోధనల్లో ఈ విషయం తేలిందన్నారు. సౌర కుటుంబంలో అత్యధిక చంద్రులతో ‘మూన్కింగ్’కిరీటాన్ని శని దక్కించుకున్నట్లయిందని ఆయన తెలిపారు. -
టైటాన్ సముద్రం లోతు ఎంతో తెలుసా?
శని గ్రహానికి ఉన్న 82 ఉపగ్రహాల్లో టైటాన్ ఉపగ్రహానికి పలు ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా దీనిపై వాతావరణం భూమి తొలినాళ్ల వాతావరణాన్ని గుర్తు చేస్తుంది. భవిష్యత్‌లో జీవ ఆవిర్భావానికి ఈ గ్రహంపై అనుకూలతలు ఎక్కువని శాస్త్రవేత్తలు అంచనా వేస్తుంటారు. జీవావిర్భివానికి సంబంధించిన అవకాశాల గురించి టైటాన్‌పై అతిపెద్ద సముద్రం క్రాకెన్ మారెపై సైంటిస్టులు పరిశోధన జరుపుతున్నారు. తాజాగా ఈ పరిశోధనల్లో ఈ సముద్ర కేంద్రం వద్ద వెయ్యి అడుగుల లోతు ఉంటుందని తేలింది. ఇంతవరకు దీని లోతు 300 అడుగులేనని భావించారు. దీంతో సముద్రం లోపలకి రోబోటిక్ సబ్‌మెరైన్ పంపి ప్రయోగాలు చేయవచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. టైటాన్ ఉత్తర ధృవం వద్ద ఉన్న ఈ సముద్ర విస్తీర్ణం దాదాపు 1.54 లక్షల చదరపు మైళ్లు. భూమిపై ఉన్న కాస్పియన్ సముద్రం కన్నా ఇది పెద్దది. ఇందులో ద్రవరూపం లో ఉండే ఈథేన్, మీథేన్ ఇతర హైడ్రోకార్బన్లున్నాయి. ఇవన్నీ జీవి పుట్టుకకు మూలపదార్ధాలుగా ఉపయోగపడేవి కావడం గమనార్హం. తాజా పరిశోధనతో సముద్రం లోతు తెలిసిందని, టైటాన్‌పై భూమి తొలినాళ్లలో ఉన్న వాతావరణం ఉందని సీసీఏపీఎస్ సంస్థ తెలిపింది. 1997లో నాసా పంపిన కసిని స్పేస్ ప్రోబ్ టైటాన్‌పై ఈ సముద్రాన్ని గుర్తించింది. 2008లో ఈ సముద్రానికి క్రాకెన్ మారె అని పేరుపెట్టారు. ఈ సముద్రం మధ్యలో మైడా ఇన్సులా అనే ద్వీపం కూడా ఉంది. ఈ సముద్రం లోతు తెలియడంతో ఈ దఫా పరిశోధనల్లో సముద్ర అంతర్భాగంలో తిరిగే విధంగా ఒక జలాంతర్గామిని పంపేందుకు సైంటిస్టులు యోచిస్తున్నారు. -
400 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ అద్భుతం..
న్యూయార్క్ : సోమవారం(రేపు) ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రెండు పెద్ద గ్రహాలైన శని, బృహస్పతిలు చాలా దగ్గరగా, ఒకే వరుసలోనికి రానున్నాయి. దీన్నే ‘క్రిస్మస్ స్టార్’ అని పిలుస్తారు. ఇది అత్యంత అరుదుగా జరిగే సంఘటన. ఇక మళ్లీ 60 ఏళ్ల తర్వాతే ఇది జరుగుంది. అంటే 2080లో శని, బృహస్పతిలు చాలా దగ్గరగా, ఒకే వరుసలోకి వస్తారన్న మాట. ఇలాంటి ఘట్టం దాదాపు 400 ఏళ్ల తర్వాత చోటుచేసుకోబోతోందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శని, బృహస్పతి దగ్గరగా, ఒకే వరుసలోకి వచ్చే సంఘటన రాత్రి పూట జరిగి దాదాపు 800 ఏళ్లు అయిందని పేర్కొన్నారు. గెలీలియో టెలీస్కోప్ను కనిపెట్టిన 13 ఏళ్ల తర్వాత 1623లో ‘క్రిస్మస్ స్టార్’ ఆవిష్కృతం అయిందని అంటున్నారు. -
రెండో ప్రపంచ యుద్ధం నాటి మొసలి..
-
హిట్లర్ పెంచుకున్న మొసలి ఇదేనా?
మాస్కో: రెండో ప్రపంచ యుద్ధం నుంచి బయటపడిన 84 ఏళ్ల మొసలి శుక్రవారం ఉదయం మరణించింది. ఈ మేరకు జూ అధికారులు ట్విటర్ వేదికగా సాటర్న్(మొసలి) మరణాన్ని వెల్లడించారు. గౌరవించే వయసులోనే చనిపోయిందని పేర్కొన్నారు. కాగా సాటర్న్ యునైటెడ్ స్టేట్స్లో జన్మించింది. 1936లో దీన్ని జర్మనీలోని బెర్లిన్ జూకు బహుమానంగా ఇచ్చారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనన మయంలో జర్మనీపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో బెర్లిన్ జూపైనా బాంబు దాడులు జరిగాయి. (ఎలుక పెయింటింగ్‌కు ఎంత డిమాండో..) ఎన్నో జీవులు బాంబు ధాటికి నేలకొరిగినప్పటికీ ఈ మొసలి మాత్రం చాకచక్యంగా తప్పించుకోగలిగింది. సుమారు మూడేళ్ల తరువాత బ్రిటీష్ సైన్యానికి కనిపించింది. దీంతో దాన్ని బ్రిటన్ తన మిత్రదేశమైన రష్యాకు బహుమానంగా అందించింది. అలా అది చివరికి మాస్కో జూకు చేరింది. అక్కడే 74 ఏళ్లు జీవించింది. అది చనిపోవడంతో జూ సిబ్బంది భావోద్వేగానికి లోనయ్యారు. సాటర్న్‌ను తమ చిన్ననాటి నుంచి చూస్తూ వచ్చామని దాని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాగా ఇది నాజీల నాయకుడు అడాల్ఫ్ హిట్లర్‌కు చెందిన మొసలిగా ప్రాచుర్యం పొందినప్పటికీ అవన్నీ వుట్టి పుకార్లేనని జూ అధికారులు స్పష్టం చేశారు. (మొసలి నోట్లో తల పెట్టింది..) -
శని త్రయోదశి
వారం... పర్వం చాలామంది శని పేరు వింటేనే అరిష్టం అని, ఆయన విగ్రహాన్ని తాకితే ఆ దోషం ఎక్కడ తమకు అంటుకుంటుందో అని భయపడుతుంటారు. అయితే అవన్నీ అపప్రథలు మాత్రమే. వాస్తవానికి శని న్యాయాధికారి వంటి వాడు. ఆయన అకారణంగా ఎవరినీ బాధించడు. మానవుల పాపకర్మలను అనుసరించి గోచార రీత్యా ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆయా కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. అంతేకాదు, ఆయన చాలా సత్యదేవుడు. దానధర్మాలతో సత్యం, అహింసలను ఆచరిస్తూ, పవిత్రంగా జీవించేవారికి ఎటువంటి ఆపద వాటిల్లకుండా కాపాడుతూ వారికి సకల శుభాలను కలుగ చేస్తాడు. వైరాగ్యం కలిగించి భగవంతుని స్మరించమని గురువై బోధిస్తాడు. భయంతో కాకుండా, భక్తితో ఆయనను వేడుకుంటే సర్వశుభాలు కలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శనిదోష పరిహారానికి... శని త్రయోదశి రోజున తిల, తైలాభిషేకాలు చేయించి దానాలు ఇవ్వాలి. శనికి ప్రీతికరమైంది, శని దోష శాంతిని చేసేది అయ్యప్పదీక్ష. భైరవ స్తోత్రం చేసినా, ఆంజనేయుని అర్చించినా, వేంకటేశ్వరుని ఆరాధించినా శనిదేవుని ప్రసన్నం చేసుకోవచ్చు. శనివారం- త్రయోదశి తిథి శనీశ్వరుని తైలాభిషేకానికి శ్రేష్ఠమైనది. శని బాధలు పడేవారు జమ్మిచెట్టుకు లేదా రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. అలాగే నల్లని వస్త్రం, నల్ల నువ్వులు, నల్లని వస్తువులు, గాజులు, నల్ల ద్రాక్ష మొదలైనవి జమ్మిచెట్టు వద్ద వదిలి వెళితే కష్టాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయని, ఆదివారం నాడు గో పూజ చేస్తే శనిదోషం పరిహారం కాగలదని విశ్వాసం. కాకులకు, నల్లచీమలకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కూడా శనిబాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం వల్ల కూడా శని బాధల నుంచి గట్టెక్కవచ్చునని శాస్త్రం. (ఫిబ్రవరి 6 శని త్రయోదశి) - డి.వి.ఆర్ -
భారీ గ్రహానికి భారీ కన్ను!
శనిగ్రహం ఉత్తర ధ్రువంపై ఇటీవల ఏర్పడిన భారీ సుడిగుండం ఇది. సుమారు 2 వేల కిలోమీటర్ల పరిధిలో ఏర్పడిన ఈ సుడిగుండంలో మేఘాలు, వాయువులు సెకనుకు 150 మీటర్ల వేగంతో సుడులు తిరుగుతున్నాయట. నాసాకు చెందిన ‘క్యాసినీ’ వ్యోమనౌక ఏప్రిల్ 2న ఈ ఫొటోను తీసింది. ‘భారీ గ్రహానికి భారీ కన్ను’గా దీనిని అభివర్ణిస్తూ నాసా ఈ ఫొటోను ఇటీవల విడుదల చేసింది. -
శనిగ్రహం ‘చందమామ’లో సముద్రం!
వాషింగ్టన్: శనిగ్రహానికి సహజ ఉపగ్రహాల్లో ఒకటైన ‘ఎన్సెలడస్’ గర్భంలో ఓ సముద్రం ఉందట! ఎన్సెలడస్పై 40 కి.మీ. మందంలో పేరుకుపోయిన మంచు ఉపరితలం కింద 10 కి.మీ. లోతైన జలాశయం ఉందని, అందులో నీరు ద్రవరూపంలోనే ఉందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎన్సెలడస్ దక్షిణార్ధగోళంపై అక్కడక్కడా ఉన్న పొడవాటి నెర్రెల నుంచి తరచూ నీటి ఆవిరి, వాయువులు ఎగజిమ్ముతాయని, అందు వల్ల దాని గర్భంలో భారీ జలాశయం ఉండవచ్చని శాస్త్రవేత్తలు 2005లోనే అంచనా వేశారు. తాజాగా క్యాసినీ ఉపగ్రహం ఎన్సెలడస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు గురుత్వాకర్షణ ప్రభావం, సమాచార ప్రసార వ్యవస్థలో జరిగిన మార్పులను బట్టి.. అక్కడ సముద్రం ఉందని నిర్ధారించారు. ఆ సముద్రంలో సూక్ష్మజీవులు కూడా మనుగడ సాగించేందుకు అవకాశముందనీ, మన సౌరకుటుంబంలో భూమి తర్వాత జీవం ఉండేందుకు ఎక్కువ అవకాశాలున్న ఖగోళ వస్తువు ఇదేననీ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అన్నట్టూ.. మన భూమికైతే ఒకే చందమామ ఉంది కానీ.. శనిగ్రహానికి మాత్రం.. చిన్నా, చితకా మొత్తం 62 చందమామలున్నాయి తెలుసా..!