చంద్రుడిపై మానవ నివాసం.. ఇళ్లు కట్టేది ఎవరంటే? | Nasa Plans To Build Homes On The Moon For Humans By 2040 | Sakshi
Sakshi News home page

చంద్రుడిపై మానవ నివాసం.. ఇళ్లు కట్టేది ఎవరంటే?

Published Tue, Oct 3 2023 7:12 PM | Last Updated on Tue, Oct 3 2023 9:32 PM

Nasa Plans To Build Homes On The Moon For Humans By 2040 - Sakshi

ప్రముఖ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ నాసా కీలక నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రకారం..చంద్రుడిపై ఇళ్లను నిర్మించే యోచనలో నాసా ఉన్నట్లు తెలుస్తోంది. 

50 ఏళ్ల క్రితం నాసా చేపట్టిన అపోలో 17 మిషన్‌లో భాగంగా ఆస్ట్రోనాట్స్‌ లూనార్‌ సర్ఫేస్‌లో సుమారు 72 గంటల పాటు గడిపారు. భవిష్యత్‌లో అంతకంటే ఎక్కువ సేపు గడిపేలా ఆ దిశగా నాసా ప్రయోగాల్ని ముమ్మరం చేసింది. 

అమెరికాలోని డజన్ల మంది ఆస్ట్రోనాట్స్‌ చెప్పిన వివరాల ఆధారంగా 2040 నాటికి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని నాసా భావిస్తోంది. ఇందుకోసం ముందుగా చంద్రుడిపై 3డి ప్రింటర్‌ను పంపి, ఆపై నిర్మాణాలను నిర్మించాలనేది నాసా ప్రణాళిక. ఈ 3డీ ప్రింటర్‌ సాయంతో రాక్‌ చిప్స్‌, ఖనిజాలను ఉపయోగించి ఇళ్ల నిర్మాణ చేపట్టనుంది.


ఇందుకోసం నాసా అత్యాధునిక సాంకేతికత కోసం యూనివర్సిటీలు, ప్రైవేట్ కంపెనీలతో చేతులు కలపనుంది.  ఈ సందర్భంగా మేం ఉమ్మడి లక్ష్యంతో సరైన సమయంలో సరైన వ్యక్తులందరినీ ఒకచోటకు చేర్చాం. అందుకే మేము అక్కడికి చేరుకుంటామని నేను భావిస్తున్నాను’ అని నాసా సాంకేతిక విభాగం డైరెక్టర్‌ నిక్కీ వర్కీసర్‌ తెలిపారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement