Venus
-
ఆకాశంలో అద్భుతం
న్యూఢిల్లీ: అంతరిక్షంలో కనువిందైన దృశ్యం కనిపించింది. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు, భారీ వలయంతో కూడిన గ్రహం శని మన చందమామకు చాలా చేరువలో కనిపించాయి. శనివారం రాత్రి 8.30 గంటలకు ఈ అద్భుతాన్ని జనం వీక్షించారు. ఇండియాతోపాటు యూకే, అమెరికా, చైనా, తుర్కియే తదితర దేశాల్లో ఎలాంటి పరికరాలు అవసరం లేకుండానే ఇది కంటికి కనిపించడం విశేషం. బైనాక్యులర్స్ లేదా టెలి స్కోప్ ఉన్నవారు మరింత స్పష్టంగా చూడగలిగారు. ముఖ్యంగా శని గ్రహం చుట్టూ ఉన్న వలయాన్ని ఆసక్తిగా గమనించారు. అంతరిక్షంలో ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగా సంభవిస్తుంటాయని సైంటిస్టులు చెప్పారు. ఈ నెల 18వ తేదీన మళ్లీ ఇలాంటి దృశ్యం వీక్షించవచ్చని సూచించారు. -
గ్రహాంతరవాసీ... నీవున్నావా?
విశ్వాంతరాళాల్లో గ్రహాంతరవాసుల ఉనికి, గుర్తుతెలియని ఎగిరే వస్తువు (యూఎఫ్‌వో)ల జాడకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలుగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయని కొందరు ఔత్సాహికులు ఆరోపిస్తుంటే తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని, ఈ విషయంలో పారదర్శకత అవసరమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వివిధ దేశాల పార్లమెంటరీ కమిటీలూ ఈ విషయమై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రహాంతరవాసులు, యూఎఫ్‌వోలకు సంబంధించి మన దగ్గర ఉన్న సమాచారం ఏమిటి, వాటి నిజానిజాలు ఎంత అన్నది పరిశీలిద్దాం. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి ఇటీవల మెక్సికో కాంగ్రెస్‌లో ఓ ప్రత్యేక సమావేశం జరిగింది. అయితే అనూహ్యంగా సమావేశ మందిరంలో ప్రదర్శించిన వింత ఆకారంలోని రెండు భౌతికకాయాలు యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ప్రముఖ జర్నలిస్టు, యూఎఫ్‌వో పరిశోధకుడు జైమీ మౌసాన్ ప్రదర్శనకు పెట్టిన ఆ భౌతికకాయాలు 45 ఏళ్ల క్రితం ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్పీల్బర్గ్ గ్రహాంతరవాసులపై కల్పిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రం ఈటీ (ఎక్స్ట్రా టెరె్రస్టియల్)లో చూపిన గ్రహాంతరవాసిని పోలినట్లుగా ఉన్నాయి. అవి పెరు దేశంలోని కుస్కో ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డాయని, వాటిని కార్బన్ డేటా ద్వారా పరీక్షించగా దాదాపు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తేలిందని జైమీ మౌసాన్ చెప్పారు. డీఎన్ఏ పరీక్షలోనూ ఈ దేహాల్లో 30 శాతానికిపైగా గుర్తుతెలియని పదార్థాలు ఉన్నట్లు తేలిందని, ఆ భౌతికకాయాలు భూమిపై జన్మించిన జీవులు కాదని, ఇతర గ్రహాల నుంచి వచ్చిన వారివేనని ఆయన వాదించారు. అయితే ఈ వాదనపై ‘నాసా’అనుమానాలు వ్యక్తం చేసింది. తమ వద్ద ఉన్న అపారమైన సమాచారం మేరకు ఇంతవరకు గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఏమైనా అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వస్తే వాటిని శాస్త్రవేత్తల పరిశీలనకు అందుబాటులో ఉంచాలని కోరింది. అమెరికాలోనూఇదే తంతు... యూఎఫ్‌వోలకు సంబంధించి అమెరికా కాంగ్రెస్ కూడా ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అందులో అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డేవిడ్గ్రుస్ అమెరికా ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందని, కూలిపోయిన యూఎఫ్‌వోలు వాటితోపాటు వచ్చిన గ్రహాంతరవాసుల భౌతికకాయాలు అమెరికా అదీనంలో ఉన్నాయని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. అమెరికా ప్రభుత్వం ఈ గ్రహాంతర వాహనాలను రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా మళ్లీ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన పరిశోధనలో తెలిసిందని కూడా డేవిడ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న అమెరికా నౌకాదళ మాజీ పైలట్ ర్యాన్గ్రేవ్స్ మాట్లాడుతూ గతంలో తాను విమానం నడుపుతున్నప్పుడు రెండు సందర్భాల్లో యూఎఫ్వోలను చూశా నని వాంగ్మూలం ఇచ్చారు. అయితే అమెరికా రక్షణశాఖ ఈ వాదనలను తిరస్కరించింది. గ్రహాంతరవాసులు, వాహనాలకు సంబంధించి తమ వద్ద ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదని పెంటగాన్ ప్రతినిధి సూగ్రౌఫ్ ప్రకటన విడుదల చేశారు. ఊహాగానాలకు నెలవుగా ఏరియా 51 అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ఉన్న నిషేధిత ఏరియా 51 ప్రాంతం అనాదిగా వాదవివాదాలకు, ఊహాగానాలకు కేంద్రంగా నిలిచింది. ఈ నిషేధిత ప్రాంతంలో గ్రహాంతరవాసులు, వాహనాలకు సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు విపరీతమైన ప్రచారం జరిగింది. దీనిపై అనేక పుస్తకాలు, టీవీ సీరియల్స్ సైతం వచ్చాయి. కొందరు ఔత్సాహికులు ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టేందుకు విఫలయత్నాలు చేశారు. గ్రహాంతరవాసుల కథనాలతోపాటు అమెరికా చంద్రునిపై కాలుపెట్టిన ఉదంతం వాస్తవానికి ఏరియా 51లో కృత్రిమంగా రూపొందించారన్న ప్రచారం కూడా ఉంది. యాభైయ్యవ దశకంలో ఈ ప్రాంతంలో గ్రహాంతర వాహనాలు తరచూ కనిపించడం వల్లే ఏరియా 51కి అమెరికా అంతటా ఆసక్తి రేకెత్తింది. 2013లో సీఐఏ బహిర్గతం చేసిన రహస్య పత్రాల్లో అసలు విషయం బయటపడింది. యాభైయ్యవ దశకంలో ప్రయాణికుల విమానాలు 10 వేల నుంచి 20 వేల అడుగుల ఎత్తులో మాత్రమే పయనించగలిగేవి. కొన్ని రకాల యుద్ధవిమానాలు 40 వేల అడుగుల ఎత్తు వరకు పయనించేవి. 1955లో అప్పటి అధ్యక్షుడు ఐసెన్‌హోవర్ మరింత ఎత్తులో ఎగిరే యుద్ధవిమానాలు యు–2ల నిర్మాణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. ఈ విమానాలు 60 వేల అడుగుల ఎత్తులో పయనించగలిగేవి. సాధారణ విమాన ప్రయాణికులకు ఈ విషయం తెలియక వాటిని గ్రహాంతర వాహనాలుగా ప్రచారం చేశారు. అయితే ఈ విషయం తెలిసిన వైమానికదళ అధికారులు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తరువాతి కాలంలో అత్యాధునిక యుద్ధవిమానాలను ఏరియా 51లో పరీక్షించేవారు. అల్లంత దూరాన చిగురిస్తున్న ఆశలు... జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పంపిన సమాచారాన్ని విశ్లేíÙంచిన ‘నాసా’భూమికి సుదూరంగా ఉన్న కే2–18బీ అనే గ్రహంలో నీటితో నిండిన సముద్రాలు, అందులో జీవచరాలు ఉండే అవకాశం ఉందని ఇటీవల వెల్లడించింది. భూమికి కనీసం 8.6 రెట్లు పెద్దదైన ఈ గ్రహం మనకు 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ గ్రహం వాతావరణంలో అత్యధిక స్థాయిలో హైడ్రోజన్ ఉండటమే కాకుండా అదే స్థాయిలో మీథేన్, కార్బన్ డయాక్సైడ్, స్వల్ప పరిమాణంలో అమ్మోనియా వాయువులు ఉండటం వల్ల అక్కడ సముద్రజలాలు ఉండే అవకాశం ఉందని నాసా అంచనా వేసింది. అంతకుమించి కే2–18బీ గ్రహ వాతావరణంలో డిమిౖథెల్ సల్ఫైడ్ (డీఎంఎస్) అణువులు కూడా ఉన్నట్లు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొంది. భూమిపై ఈ డీఎంఎస్ను సముద్రంలో వృక్షజాతికి చెందిన నాచులాంటి మొక్కలు మాత్రమే ఉత్పత్తి చేయగలవు. దాంతో కే2–18బీపై కూడా జీవం ఉండే ఆస్కారం మెండుగా ఉందని నాసా భావిస్తోంది. శుక్రుడిపైనా జాడలు... తాజాగా శుక్రగ్రహంపై జీవం ఉండే ఆస్కారం ఉందనడానికి తగిన ఆధారాలు లభించాయి. యూకేలోని వేల్స్లో ఉన్న కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చేపట్టిన పరిశోధనల్లో శుక్రుడిపై వాతావరణంలో ఫాస్ఫైన్ వాయువులు ఉన్నట్లు బయటపడింది. కార్టిఫ్ బృందానికి చెందిన గ్రీవ్స్ అనే శాస్త్రవేత్త ఇటీవల రాయల్ ఆ్రస్టానామికల్ సొసైటీ జాతీయ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫాసై్పన్ వాయువుపై ఇంత ఆసక్తి ఎందుకంటే భూమిపై ఈ వాయువు కేవలం జీవజాలాల నుంచే వెలువడుతుంది. భూమిపై స్వచ్ఛమైన హైడ్రోజన్ తక్కువ పరిమాణంలో ఉన్న చోట జీవజాలం గుండా ఫాస్పైన్ ఉత్పత్తి జరు గుతుంది. శుక్రుడు వాతావరణంలో దిగువ భాగంలోనే ఈ ఫాసై్పన్ మేఘాలు ఆవరించి ఉండటంతో అక్కడ జీవం ఉండే ఆస్కారం అత్యధికంగా ఉందనేది కార్డిఫ్ బృందం అభిప్రాయం. మూడేళ్ల క్రితం ఈ విషయం బయటపడ్డా అప్పట్లో శాస్త్రవేత్తలు అంతగా ఆసక్తి చూపలేదు. కేవలం ఫాస్పైన్ ఉన్నంత మాత్రాన జీవం ఉందని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. కానీ ఇటీవల జరిగిన మరిన్ని పరిశోధనల ఫలితంగా ఇప్పుడు శుక్రుడిపై జీవం జాడలు కనుగొనేందుకు ఆసక్తి పెరిగింది. ఆధారాలను కనుగొనే దిశగా... గ్రహాంతరవాసులపట్ల మనిషికి అనాదిగా ఆసక్తి ఉంది. వాటి కోసం నిరంతర అన్వేషణ జరుగుతూనే ఉంది. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రోదసిలో ఈ గ్రహాంతర జీవుల కోసం వెదుకుతూనే ఉన్నాం. అయినా ఇంతవరకూ కచ్చితమైన ఆధారాలేమీ దొరకలేదు. మెక్సికో కాంగ్రెస్‌లో ప్రదర్శించిన భౌతికకాయాలపై జరుగుతున్న పరీక్షలు వాటిని గ్రహాంతరవాసులుగా తేలిస్తే అవే మనకు మొదటి ఆధారాలు కాగలవు. అంగారకుడిపై ఎప్పుడైనా జీవం ఉన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంతోపాటు అంగారకుడిపై జీవం మనుగడకు అవకాశం ఉందా అనే విషయాన్ని పరిశీలించడానికి నాసా ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టింది. నాసాకు చెందిన ప్రిసర్వేరన్స్ రోవర్ గత జనవరిలో అంగారకుడిపై అనేక ట్యూబ్ లను వదిలింది. ఇవి అక్కడి మట్టి, రాళ్లను సేకరిస్తాయి. వాటిని తిరిగి భూమిపైకి తేవడానికి మార్స్ శాంపిల్ రిటర్న్ (ఎంఎస్ఆర్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. నాసా అంచనా ప్రకా రం ఇది 2030 నాటికి పూర్తవుతుంది. విశ్వంలో జీవానికిమెండుగా అవకాశాలు... అసలు గ్రహాంతరవాసులు ఉన్నాయా లేక కేవలం భూమిపైనే జీవం ఉందా అనే ప్రశ్నకు శాస్త్ర ప్రపంచం ఇచ్చే సమాధానం ఒక్కటే. అనంతకోటి విశ్వంలో భూమిని పోలిన పరిస్థితులు ఉన్న గ్రహాలు ఇంకా ఉండేందుకు అవకాశం మెండుగా ఉంది. విశ్వం మొత్తంలో కోటానుకోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక్క మన పాలపుంత (మిల్కివే) గెలాక్సీలోనే 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇన్నింటి మధ్య భూమిలాంటి వాతావరణం ఉన్న గ్రహాలు అనేకం ఉండే ఆస్కారం ఉంది. అలాంటిచోట జీవం ఆవిర్భవించే అవకాశాలూ ఉన్నాయి. ఏమో ఏదో రోజు మనకు ఈ గ్రహాంతర వాసులతో ములాఖత్ జరిగే అవకాశమూ ఉంది. -దొడ్డ శ్రీనివాసరెడ్డి -
Chandrayaan-3: ఇక అంగారకుడిపైకి అడుగు!
బెంగళూరు: దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తంచేశారు. భారత శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘చంద్రయాన్–3 విజయంతో అంగారకుడిపైకి వెళ్తాం. భవిష్యత్తులో శుక్రుడితోపాటు ఇతర గ్రహాలపైకి వెళ్తాం’ అని చెప్పారు. ఇది ఏ దేశానికైనా కష్టం ‘ఈ రోజు టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినా చంద్రుడిపైకి ప్రయాణం చేయడం ఏ దేశానికైనా అంత సులువు కాదు. అదీగాక సాఫ్ట్ లాండింగ్ మరింత సంక్లిష్టమైన విషయం. అయితే, కేవలం రెండు మిషన్లతోనే భారత్ సుసాధ్యం చేసి చూపింది. మానవరహిత వ్యోమనౌకను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు మాత్రమే చంద్రయాన్–1ను చేపట్టాం.’ అని సోమనాథ్ చెప్పారు. మేడిన్ ఇండియా మిషన్ ‘ చంద్రయాన్–2 నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రతి ఒక్కరూ చంద్రయాన్ విజయం కోసం ప్రార్థించారు. చంద్రయాన్–2 మిషన్‌లో పాలుపంచుకున్న చాలామంది కీలక శాస్త్రవేత్తలు చంద్రయాన్–3 మిషన్ బృందంలో పనిచేశారు. చంద్రయాన్–3లో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఏ టెక్నాలజీ కంటే కూడా తక్కువ కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ సెన్సర్లు మన వద్ద ఉన్నాయి. ఇది పూర్తిగా ప్రపంచస్థాయి పరికరాలతో దేశీయంగా రూపొందించిన మేడిన్ ఇండియా మిషన్’ అని సోమనాథ్ చెప్పారు. -
ఐపీవో.. స్ట్రీట్‌పబ్లిక్ ఇష్యూలకు పోటాపోటీ
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న ప్రైమరీ మార్కెట్ ఇకపై మరింత కళకళలాడనుంది. తాజాగా పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రెండు కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోల కోసం సెప్టెంబర్‌లో ఈ కంపెనీలు దరఖాస్తు చేశాయి. ఈ బాటలో ప్రస్తుతం మరో మూడు సంస్థలు నిధుల సమీకరణకు అనుమతించమంటూ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఐపీవో బాట పట్టిన సంస్థలలో హైదరాబాద్‌కు చెందిన రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ సైతం ఉంది. వివరాలు చూద్దాం.. గ్లోబల్ హెల్త్ రెడీ మేడాంటా బ్రాండ్ ఆసుపత్రుల నిర్వాహక కంపెనీ గ్లోబల్ హెల్త్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ ఓకే చెప్పింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. దీనికి జతగా మరో 4.84 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ 4.33 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. కంపెనీ సహవ్యవస్థాపకులు సునీల్ సచ్దేవ, సుమన్ సచ్దేవ 51 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. వీడా క్లినికల్‌కు సై క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వీడా.. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూ. 832 కోట్లవరకూ సమకూర్చుకోవాలని కంపెనీ ఆశిస్తోంది. ఐపీవోలో భాగంగా వీడా క్లినికల్ రీసెర్చ్ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. అంతేకాకుండా దాదాపు మరో రూ. 332 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రధానంగా బాండ్వే ఇన్వెస్ట్మెంట్ రూ. 260 కోట్లు, బసిల్ ప్రయివేట్ రూ. 142 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నాయి. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, విస్తరణకు వినియోగించనుంది. రెయిన్బో చిల్డ్రన్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా చిన్నపిల్లల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల చైన్ రెయిన్బో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా ఈ హైదరాబాద్ సంస్థ రూ. 2,000 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికలు వేసింది. ఐపీవోలో భాగంగా రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ రూ. 280 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.4 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఆర్హతగల ఉద్యోగులకు సైతం షేర్లను ఆఫర్ చేయనుంది. తాజా ఈక్విటీ నిధులను ఎన్సీడీల చెల్లింపులకు, కొత్త ఆసుపత్రుల ఏర్పాటు, మెడికల్ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. 1999లో యూకే ఫైనాన్స్ కంపెనీ సీడీసీ గ్రూప్ హైదరాబాద్‌లో 50 పడకల పిడియాట్రిక్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నెలకొల్పింది. తదుపరి దేశవ్యాప్తంగా 14 ఆసుపత్రులకు విస్తరించింది. 1500 పడకల సదుపాయాలతో హెల్త్‌కేర్ సేవలు అందిస్తోంది. వీనస్ పైప్స్ ట్యూబ్స్ స్టెయిన్లెస్ స్టీల్ పైపులు, ట్యూబుల తయారీ కంపెనీ వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ ఐపీవో చేపట్టేందుకు సెబీకి దరఖాస్తు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 50.74 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈ నిధులను సామర్థ్య విస్తరణతోపాటు.. సొంత అవసరాలకు వినియోగించే హాలో పైపుల తయారీ ప్రాజెక్టుకు వినియోగించనుంది. కంపెనీ వీనస్ బ్రాండుతో ప్రొడక్టులను దేశ, విదేశాలలో విక్రయిస్తోంది. కెమికల్స్, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్, పవర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, పేపర్ తదితర పలు రంగాలకు ప్రొడక్టులను అందిస్తోంది. క్యాపిల్లరీ టెక్నాలజీస్ క్లౌడ్ దన్నుతో సాఫ్ట్‌వేర్‌నే సొల్యూషన్(శాస్)గా సేవలందించే క్యాపిల్లరీ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఏఐ ఆధారిత సేవలందించే ఈ కంపెనీ ఇందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 850 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 650 కోట్ల విలువైన షేర్లను క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇంటర్నేషనల్ విక్రయానికి ఉంచనుంది. వార్బర్గ్ పింకస్, సీక్వోయా క్యాపిటల్, క్వాల్కామ్ తదితరాలకు పెట్టుబడులున్నప్పటికీ వాటాలను ఆఫర్ చేయకపోవడం గమనార్హం! ఇష్యూ నిధులను రుణ చెల్లింపులు, ప్రొడక్ట్ డెవలప్మెంట్, టెక్నాలజీ అభివృద్ధి, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వినియోగించనుంది. -
నిప్పులకొలిమిలా భగభగలు.. అయినా జీవరాశి ఉనికి!
మిగతా గ్రహాల్లాగే అక్కడా సముద్రాలు, జీవరాశి ఉనికి ఉండేది ఒకప్పుడు. కానీ, సూర్యుడికి దగ్గరగా ఉండడంతో ఆ అధిక వేడిమికి సముద్రాలు ఆవిరైపోవడం, జీవరాశి కనుమరుగైపోవడం.. భూమికి సిస్టర్ గ్రహాంగా అభివర్ణించే శుక్ర గ్రహం విషయంలో జరిగి ఉంటుందనేది ఖగోళ శాస్త్రవేత్తల అంచనా. కానీ, ఇప్పుడు ఆ అంచనాలను తలకిందులు చేసే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. వీనస్‌పై జీవరాశికి ఆస్కారమే లేదని వాదిస్తున్న సైంటిస్టులు.. ఇప్పుడక్కడ జీవరాశికి ఆస్కారం ఉందనే వాదనను తెరపైకి తెచ్చారు. పలు అధ్యయనాల తర్వాత ఫొటోసింథటిక్ మైక్రోఆర్గానిజమ్స్(కిరణజన్య సంయోగ సూక్ష్మజీవులు) ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సౌర వ్యవస్థలో ముందు వరుసలో ఉండడం, పైగా గ్రీన్ హౌజ్ ప్రభావం వల్ల హాట్ గ్యాస్ బెలూన్లా కార్బన్ డై యాక్సైడ్‌తో నిండిపోయింది శుక్ర గ్రహం. దరిమిలా 462 డిగ్రీ సెల్సియస్ సెంటిగ్రేడ్(863 డిగ్రీల ఫారన్‌హీట్) గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యి నిప్పుల కొలిమిని తలపిస్తుంది. అలాంటిది ఈ గ్రహంపైనా జీవరాశి ఉనికిని పసిగట్టారు సైంటిస్టులు. శుక్ర గ్రహం వాతావరణంలో జీవరాశి ఉనికి ఉన్నట్లు గుర్తించారు. శుక్ర గ్రహం మేఘాల నుంచి సూర్యకాంతి చొచ్చుకెళ్లినప్పుడు.. ఫొటోసింథటిక్ మైక్రోఆర్గానిజమ్స్ పెరిగే అవకాశం ఉందని తేల్చారు. 1. A new study has revealed that the sunlight passing through Venus' clouds could support the growth of photosynthetic microorganisms. Moreover, photosynthesis could even occur during the night time thanks to the planet's thermal energy! pic.twitter.com/j5NfFYmPF5 — The Weather Channel India (@weatherindia) October 11, 2021 సోలార్ ఎనర్జీతో పాటు గ్రహం ఉపరితలం నుంచి థర్మల్ ఎనర్జీ పుట్టడం, కాంతి తరంగదైర్ఘ్యం కారణంగా ఫొటోసింథటిక్ పిగ్మెంట్స్‌ను గుర్తించారు. ఇది అచ్చం భూమి మీద సూర్యకిరణాల వల్ల ఏర్పడే ప్రక్రియలాగే ఉంటుందని చెబుతున్నారు. అధ్యయనానికి సంబంధించిన వివరాలను కాలిఫోర్నియా స్టేట్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాకేష్ మొఘల్ వెల్లడించారు. ఆమ్ల, ద్రావణ(వాటర్) చర్యల వల్ల మైక్రోబయాల్ పెరిగే అవకావం ఉందని చెప్తున్నారు వాళ్లు. Astrobiology జర్నల్‌లో శుక్ర గ్రహంపై జీవరాశి ఉనికికి సంబంధించిన కథనం తాజాగా పబ్లిష్ అయ్యింది. చదవండి: శుక్రుడు మా వాడు.. రష్యా సంచలన ప్రకటన -
పెంగ్విన్లు ఏలియన్లా?
ఏలియన్స్ అంటే భూమి అవతల ఎక్కడో గ్రహాల్లోనో, సుదూర సౌర వ్యవస్థల్లోనో ఉన్నాయని అనుకుంటున్నాం. కానీ ఏలియన్స్ ఎప్పుడో భూమ్మీదికి వచ్చి ఉంటాయని, ఇప్పటికీ వాటి అవశేషాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఆ ఏలియన్స్ ఏమిటో తెలుసా..? మంచు ప్రాంతాల్లో తిరిగే పెంగ్విన్ పక్షులట. మరి ఈ విశేషాలు ఏమిటో చూద్దామా? ఉండటమే చిత్రంగా.. భూమి ఉత్తర, దక్షిణ ధృవాల్లోని మంచు ప్రాంతాల్లో జీవించే పక్షులు పెంగ్విన్లు. మామూలుగానే అవి చిత్రంగా ఉంటాయి. పేరుకు పక్షులే అయినా ఎగరలేవు. నిటారుగా రెండు కాళ్లపై నిలబడతాయి, అలాగే నడుస్తాయి. నీటిలో బుడుంగున మునుగుతూ, తేలుతూ వేగంగా ఈదుతాయి. గుంపులు గుంపులుగా జీవిస్తాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. భూమ్మీద ఏ జీవిలోనూ లేని ఓ ప్రత్యేకమైన రసాయన పదార్థం పెంగ్విన్లలో ఉన్నట్టు తాజాగా గుర్తించడం ఆసక్తి రేపుతోంది. శుక్రగ్రహంలోని రసాయనం యూకేకు చెందిన లండన్ ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ డేవ్ క్లెమెంట్స్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తలు ఫాక్లాండ్ ప్రాంతంలోని గెంటూ రకం పెంగ్విన్లపై కొద్దిరోజులుగా పరిశోధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటి విసర్జితాలను పరిశీలిస్తుండగా.. ‘ఫాస్పైన్’ అనే రసాయనం ఆనవాళ్లు లభించాయి. భాస్వరం, హైడ్రోజన్ మూలకాల సమ్మిళితం అయిన ఈ రసాయనం.. సాధారణంగా భూమ్మీది ఏ జీవిలోనూ ఉండదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గత ఏడాదే శుక్రగ్రహ వాతావరణంలో ‘ఫాస్పైన్’ జాడను కనిపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హా 6.1 కోట్ల కిలోమీటర్ల దూరంలోని శుక్రుడిలో ఉన్న రసాయనం పెంగ్విన్ల విసర్జితాల్లో ఉండటం అంటే.. అవి బహుశా మరో ప్రపంచానికి చెందిన జీవులు (ఏలియన్లు) అయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అసలు పెంగ్విన్లలో ఈ రసాయనం ఎలా ఉత్పత్తి అవుతోందన్న దానిని పరిశీలిస్తున్నామని ప్రకటించారు. ఫాస్పైన్.. వెరీ డేంజర్ ఫాస్పైన్ ప్రమాదకర వాయువు. అత్యంత విషపూరితమైనది. పీల్చుకుంటే నిమిషాల్లోనే ప్రాణాలు తీస్తుంది. వేగంగా మండిపోయే స్వభావం ఉంటుంది. దీనిని పారిశ్రామికంగా తయారు చేస్తారు. కీటక నాశనులు, ఎలుకల మందు వంటివాటి తయారీలో వినియోగిస్తారు. కొన్ని పరిశ్రమల్లో మంటలకు ఇంధనంగా, సెమీకండక్టర్ల తయారీ ప్రక్రియలో వినియోగిస్తారు. ఏలియన్ల జాడ తెలుసుకోవచ్చా? పెంగ్విన్ల జీవన విధానం, వాటి శరీరంలోని రసాయనాలను పరిశీలించడం ద్వారా.. భవిష్యత్తులో ఏలియన్ల జాడను గుర్తించేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గతంలో ఎప్పుడో గ్రహాంతర వాసులు భూమ్మీదికి వచ్చి వెళ్లి ఉంటారని.. ఆ క్రమంలోనే పెంగ్విన్ల వంటి ప్రత్యేక జాతులు అభివృద్ధి చెంది ఉంటాయని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
శుక్రుడి మీద జీవం: రష్యా సంచలన ప్రకటన
మాస్కో: భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహమైన శుక్రుడి మీద జీవం ఉండేందుకు ఆస్కారం ఉన్నట్లు ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైన విషయం తెలిసిందే. శుక్ర గ్రహం మీద ఉన్న దట్టమైన మేఘాల్లో ఫాస్ఫైన్ అణువులు ఉన్నట్లు బ్రిటన్‌లోని కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు సోమవారం తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా సంచలన ప్రకటన చేసింది. వీనస్‌ను ‘‘రష్యన్ ప్లానెట్’’ అని పేర్కొంటూ ఆ గ్రహంపై గుత్తాధిపత్యం ప్రకటించుకుంది. ఈ మేరకు మాస్కోలో జరుగుతున్న ఇండస్ట్రీ ఎగ్జిబిషన్లో రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్ దిమిత్రి రొగోజిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘శుక్ర గ్రహం మీద అడుగుపెట్టిన మొట్టమొదటి, ఏకైక దేశం మాదే’’ అని పేర్కొన్నారు. 60, 70,80 దశకాల్లో శుక్రుడి మీద తమ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. ఆ గ్రహానికి సంబంధించి అనేకానేక విషయాలను తమ అంతరిక్షనౌకలు ఏనాడో సమాచారం సేకరించాయని, అక్కడి పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. (చదవండి: శుక్రగ్రహం మీద ఫాస్ఫైన్!) ఇక తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలోనే రష్యా సొంతంగా వీనస్‌పై మరోసారి పరిశోధనలు చేసేందుకు ప్రణాళికలు చేస్తోందని ఆయన ప్రకటించారు. గతంలో అమెరికా సహాయంతో వెనెరా- డి మిషన్‌తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు రొగోజిన్ వెల్లడించారు.‘‘ఆన్- ప్లానెట్ స్టేషన్ల ద్వారా శుక్ర గ్రహ పరిస్థితుల మీద తరచుగా ప్రయోగాలు చేసిన చరిత్ర రష్యాకు ఉంది. సౌరకుటుంబంలో తొలిసారిగా ఇతర గ్రహం మీద విజయవంతంగా అడుగుపెట్టాం. 1970లో వెనెరా-7 ద్వారా కీలక ఘట్టం ఆవిష్కరింపజేశాం. వీనస్ మీది వాతావరణం, మట్టి, ఇతర మూలకాల మిశ్రమం తదితర అంశాల గురించి వివిధ దశల్లో ప్రయోగాలు చేశాం. అంతేకాదు శుక్ర గ్రహం మీద అత్యధికంగా 127 నిమిషాల పాటు యాక్టివ్‌గా ఉన్న స్సేప్క్రాఫ్ట్గా ది సోవియెట్ వెనెరా-13 పేరిట రికార్డు నేటికీ పదిలంగా ఉంది’’అంటూ శుక్ర గ్రహాన్ని రష్యా ప్లానెట్‌గా పేర్కొనడం వెనుక ఉన్న ఉద్దేశం గురించి వివరించారు. ఈ మేరకు ది మాస్కో టైమ్స్ కథనం వెలువరించింది. కాగా.. ఇక బ్రిటన్ శాస్త్రవేత్తల తాజా పరిశోధనల నేపథ్యంలో, ఫాస్ఫైన్ ఉన్నంత మాత్రాన శుక్రుడి మీద జీవం ఉందని చెప్పలేమని, ఒక గ్రహం మీద భాస్వరం సమృద్ధిగా ఉన్నప్పటికి.. జీవం మనుగడకు అనుకూలమైన వాతావరణం అక్కడ లేకపోవచ్చని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. -
ఏలియన్స్ జాడ.. బాంబు పేల్చిన నాసా
వాషింగ్టన్ : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గ్రహంతరవాసుల జాడ గురించి బాంబు లాంటి వార్తను పేల్చింది. భూమికి పొరుగునే ఉన్న వీనస్ గ్రహంపై వాటి ఆనవాళ్లను కనుగొన్నట్లు ప్రకటించింది. నాసా శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘వీనస్(శుక్ర గ్రహం) మేఘాల్లో నల్లటి జాడలను కనుగొన్నాం. అక్కడ జీవదార్థాన్ని గుర్తించాం. బహుశా అక్కడే ఏలియన్లు నివసిస్తూ ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వీలైనంత త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక వీనస్‌పై వాతావరణం దారుణంగా ఉంటుందన్న సైంటిస్టులు. 500 డిగ్రీ సెల్సియస్ ఉష్టోగ్రత.. ఆమ్ల వర్షంతో ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ప్రత్యేక బృందం పరిశోధనలను కొనసాగించబోతోంది అని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బృందం బయోకెమికల్, రసాయనిక అధ్యయనాలు చేపట్టే అవకాశం ఉంది. ఇక 240 మిలియన్ల డాలర్ల వ్యయంతో నాసా ఏలియన్ జాడ కోసం పరిశోధనలను కొనసాగించబోతోంది. నాసా వాస్తవాలు బయటపెట్టాల్సిందే.. ఏలియన్ల మనుగడ విషయంలో నాసా వాస్తవాలను దాస్తోందని బకింగ్హమ్ యూనివర్సిటీ పరిశోధనకారుడు, ప్రొఫెసర్ బారీ డి గ్రెగోరియో ఆరోపిస్తూ వస్తున్నారు. అంగారక గ్రహం గతంలోనే నాసా ఏలియన్ల జాడను కనిపెట్టిందని. క్యూరియాసిటీ రోవర్ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా తీసిందని ఆయన వాదించారు. ఈ నేపథ్యంలో నాసా తాజా ప్రకటన ఆసక్తికర చర్చకు దారితీసింది. -
ముగురుజా మురిసె...
♦ వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ కైవసం ♦ ఫైనల్లో వీనస్‌పై విజయం ♦ రూ. 18 కోట్ల 53 లక్షల ప్రైజ్‌మనీ సొంతం అనుభవంపై పట్టుదల గెలిచింది. స్పెయిన్ యువతార గార్బిన్ ముగురుజా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. ఐదుసార్లు చాంపియన్, 37 ఏళ్ల వీనస్ విలియమ్స్‌తో జరిగిన ఫైనల్లో 23 ఏళ్ల ముగురుజా కళ్లు చెదిరే ఆటతీరును ప్రదర్శించింది. ఆరోసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను సాధించడంతోపాటు ఓపెన్ శకంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కురాలిగా రికార్డు సృష్టించాలని ఆశించిన వీనస్‌కు నిరాశే మిగిలింది. లండన్: తన ప్రత్యర్థి అపార అనుభవజ్ఞురాలైనా... వింబుల్డన్ గ్రాస్‌కోర్టులపై అద్భుత రికార్డు కలిగినా... అవేమీ పట్టించుకోకుండా స్పెయిన్ స్టార్ గార్బిన్ ముగురుజా ఒక వ్యూహం ప్రకారం ఆడింది. వీనస్‌ను ఎక్కువ భాగం బేస్‌లైన్‌కే పరిమితం చేస్తూ... సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధిస్తూ... అనవసర తప్పిదాలు చేసేలా ఆడుతూ ముగురుజా అనుకున్న ఫలితాన్ని సాధించింది. రెండేళ్ల క్రితం వింబుల్డన్ సెంటర్ కోర్టులో సెరెనా విలియమ్స్ చేతిలో ఫైనల్లో ఎదురైన పరాజయానికి... ఈసారి అదే వేదికపై సెరెనా అక్క వీనస్‌పై ముగురుజా ప్రతీకారం తీర్చుకుంది. తన కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంతోపాటు తొలిసారి వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 14వ సీడ్ ముగురుజా 7–5, 6–0తో పదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా)ను ఓడించింది. విజేతగా నిలిచిన ముగురుజాకు 22 లక్షల పౌండ్లు (రూ. 18 కోట్ల 53 లక్షలు), రన్నరప్ వీనస్‌కు 11 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొమ్మిదోసారి వింబుల్డన్ ఫైనల్ ఆడిన వీనస్ నాలుగోసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. తాజా విజయంతో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్స్‌లో విలియమ్స్ సిస్టర్స్ సెరెనా, వీనస్‌లను ఓడించిన ఏకైక క్రీడాకారిణిగా ముగురుజా గుర్తింపు పొందింది. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సెరెనాను ఓడించి ముగురుజా చాంపియన్‌గా నిలిచింది. కొంచిటా మార్టినెజ్ (1994లో) తర్వాత వింబుల్డన్ మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ క్రీడాకారిణిగా ముగురుజా ఘనత వహించింది. ఈ టోర్నీలో ముగురుజాకు కొంచిటా కోచ్‌గా ఉండటం మరో విశేషం. బ్రేక్ పాయింట్లు కాపాడుకొని... ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం పోరాడటంతో తొలి సెట్ ఆసక్తికరంగా సాగింది. స్కోరు 5–4 వద్ద ఉన్నపుడు ముగురుజా సర్వీస్‌లో వీనస్‌కు రెండు సెట్ పాయింట్లు లభించాయి. అయితే ముగురుజా కచ్చితమైన సర్వీస్‌లు చేసి ఈ గేమ్‌ను కాపాడుకుంది. దాంతో స్కోరు 5–5తో సమమైంది. 11వ గేమ్‌లో వీనస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముగురుజా ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్లో ముగురుజా పూర్తి ఆధిపత్యం చలాయించింది. మూడుసార్లు వీనస్ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతోపాటు తన సర్వీస్‌లను కాపాడుకొని చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకుంది. మ్యాచ్ మొత్తం లో ముగురుజా 14 విన్నర్స్ కొట్టి, 11 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు వీనస్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 25 అనవసర తప్పిదాలు చేసింది. సిలిచ్ @ ఫెడరర్ నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్ సాయంత్రం గం. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
సలామ్ సెరెనా
-
ఎస్... నేనంటే నేనే!
సాక్షి క్రీడావిభాగం సెరెనా విలియమ్స్ తొలి గ్రాండ్‌స్లామ్ విజయానికి, 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు మధ్యలో 6349 రోజుల వ్యవధి ఉంది. ఇన్ని రోజుల్లో ప్రపంచం చాలా మారిపోయింది. కానీ కొత్త మిలీనియంకు అటువైపు, ఇటువైపు ప్రతినిధిగా ఇప్పటికీ సెరెనా జైత్రయాత్ర మాత్రం ఇంకా కొనసాగుతోంది. 18 ఏళ్ల ప్రాయంలో ప్రపంచాన్ని గెలిచిన రోజు నుంచి మరో 18 ఏళ్ల తర్వాత కొత్త చరిత్రను సృష్టించే రోజు వరకు ఆమె చేసిన ప్రయాణం అసమానం. సాధించిన ప్రతీ ఘనత ఒక అద్భుతం. ఆమె ఆటలో పవర్ ఉంది. మాటల్లో పంచ్ ఉంది. అన్ని రకాల ఆటుపోట్లను తట్టుకొని నిలిచిన తర్వాత ప్రపంచాన్నే ఎదిరించిన ధిక్కారం కూడా సెరెనాలో కనిపిస్తుంది. జాతీయ నంబర్‌వన్‌గా ఉన్నా పదేళ్ల వయసులోనే వర్ణ వివక్ష కారణంగా టోర్నమెంట్ల నుంచి తప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితుల నుంచి ప్రపంచ నంబర్‌వన్‌గా ఎదగడం వరకు కసిగా ఆమె ఆటతోనే అందరికీ సమాధానమిచ్చింది. 14 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్‌గా మారిన సెరెనా, 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా టెన్నిస్ ప్రపంచాన్ని శాసించగలగడం ఆమెను ‘ఆల్‌టైమ్ గ్రేట్’గా నిలబెట్టాయి. తాజా విజయంతో మహిళల టెన్నిస్‌లో ఎవరు గొప్ప అనే చర్చకు ఆమె ఫుల్స్టాప్ పెట్టేసింది. శ్వేత జాతీయులకంటే ఎక్కువగా గుర్తింపు దక్కాలంటే తాము అన్ని విధాలా ఎక్కువగా కష్టపడాలని, 150 శాతం ప్రదర్శన ఇస్తే గానీ వారితో సమంగా నిలవలేమనే బలమైన అభిప్రాయం నల్లజాతి అమెరికన్లలో ఉంది. గతంలోనూ పలువురు శ్వేత జాతీయేతరులు ఆటల్లో అగ్రగామిగా నిలిచినా సెరెనా ప్రస్థానం భిన్నం. ఇతర క్రీడలతో పోలిస్తే తెల్ల జాతీయుల ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉన్న టెన్నిస్‌లో ఆమె రారాణిగా ఎదగడం సెరెనాను మరింత స్పెషల్‌గా మార్చేశాయి. దోపిడీ దొంగలకు నిలయమైన కాంప్టన్ ప్రాంతంలో సెరెనా పెరిగింది. ఆమెతో పాటు సోదరి వీనస్‌ను అగ్రశ్రేణి క్రీడాకారిణులుగా తీర్చిదిద్దడంలో తండ్రి రిచర్డ్స్ విలియమ్స్ ఎన్నో కష్టనష్టాలకోర్చారు. సాధారణ కౌలు రైతు అయిన విలియమ్స్, టెన్నిస్ అకాడమీల వద్దకు వెళ్లి ప్రాక్టీస్ కోసం పాత బంతులు తనకు అమ్మమని అడిగిన రోజులు కూడా ఉన్నాయి! ఆరంభంలో కొద్ది రోజులు బయట శిక్షణ ఇప్పించినా, తనకున్న పరిజ్ఞానం, పుస్తకాల ద్వారా నేర్చుకున్న సమాచారంతో అతనే వారికి పూర్తి స్థాయి కోచ్‌గా మారిపోయాడు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పోరాటం ఆపకపోవడం, నల్ల జాతికి సంబంధించిన వ్యాఖ్యల విషయంలో మాటకు మాట జవాబివ్వడంలో సెరెనా ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఒకప్పుడు తనను, వీనస్‌ను ‘అన్నదమ్ములు’ అంటూ సంబోధించినవారిని హెచ్చరించడం, వింబుల్డన్‌లో ఆట పట్టిస్తున్న ప్రేక్షకులపై ‘నన్ను రెచ్చగొట్టొద్దు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం, లైన్ ఉమెన్ను ‘గొంతు కోస్తా’ అంటూ బెదిరించడం సెరెనాకే చెల్లింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆడేది అక్కతోనే అయినా పాయింట్ పోగొట్టుకున్నప్పుడు ఆగ్రహంతో రాకెట్ విరిచేసి ఉద్వేగం ప్రదర్శించడం చూస్తే ఆమె విషయంలో విజయం విలువేమిటో అర్థమవుతుంది. వరల్డ్ నంబర్‌వన్ క్రీడాకారిణిగా సెరెనా ఏమిటో ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ కోర్టు బయట కూడా ‘నలుపు’ గురించి తక్కువ చేసి మాట్లాడటం సెరెనాకు నచ్చదు. అది ఫ్యాషన్ విషయంలోనైనా సరే! అందానికి రంగుతో పని లేదంటూ తన పేరులో అక్షరాలను వెనక్కి రాస్తూ ANERE పేరుతో డిజైనర్ దుస్తుల, హెయిర్టెక్ పేరుతో సౌందర్య సాధనాల వ్యాపారంలోకి అడుగు పెట్టి చూపించింది. 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్, 4 ఒలింపిక్ స్వర్ణాలు, 309 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్ (సశేషం), కోట్లాది డాలర్ల ఆదాయం... వీనస్ విజయ విహారం ఇంకా ముగిసిపోలేదు. మరిన్ని విజయాలు, మరెన్నో ఘనతలు ఆమె కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు మాత్రం ఆమె జగజ్జేత స్థాయిని అనుభవిస్తూ శిఖరాన నిలిచిం ది. ‘బతకడం, ప్రేమించడం, గెలవడం కోసం పది సూత్రాలు’ అనేది సోదరి వీనస్‌తో కలిసి సెరెనా రాసిన పుస్తకం పేరు. దానికి తగినట్లుగానే ఎలా బతకాలో, ఆటను ఎంతగా ప్రేమిం చాలో, ఏ రకంగా గెలవాలో చేసి చూపించిన సెరెనాకు హ్యాట్సాఫ్. -
సలామ్ సెరెనా
ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన అమెరికా స్టార్ • ఫైనల్లో సోదరి వీనస్‌పై విజయం • అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో రికార్డు • మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ హస్తగతం • రూ. 19 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం నిరీక్షణ ముగిసింది. అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మరో మైలురాయిని చేరుకుంది. ఓపెన్ శకంలో (1968 నుంచి) అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా సెరెనా కొత్త చరిత్ర సృష్టించింది. 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) పేరిట ఉన్న రికార్డును ఈ ‘నల్లకలువ’ బద్దలు కొట్టింది. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో తన అక్క వీనస్ విలియమ్స్‌పై సెరెనా గెలుపొంది ఏడోసారి ఈ టైటిల్‌ను సాధించింది. అదే క్రమంలో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఓపెన్ శకం అంటే.... 1968 కంటే ముందు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో కేవలం అమెచ్యూర్ ఆటగాళ్లు మాత్రమే ఆడేవారు. అయితే 1968 నుంచి ప్రొఫెషనల్ ఆటగాళ్లకు కూడా గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఆడే అవకాశం కల్పించారు. అప్పటి నుంచి ఓపెన్ శకం ప్రారంభమైంది. జోర్డాన్ బహుమతి... ఫైనల్ సందర్భంగా సెరెనాకు అరుదైన కానుక లభించింది. బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్ 23 గ్రాండ్‌స్లామ్ టైటి ల్స్‌కు సూచికగా 23 అంకె ముద్రించిన షూస్‌ను సెరెనాకు పంపించారు. బహుమతి ప్రదానోత్సవంలో సెరెనా ఈ షూస్ ధరించింది. మెల్బోర్న్: అదే జోరు. అదే ఫలితం. మరోసారి తన అక్క వీనస్ విలియమ్స్‌పై చెల్లెలు సెరెనా ఆధిపత్యం చలాయించింది. ఏడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సెరెనా (అమెరికా) 6–4, 6–4తో 13వ సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా)ను ఓడించింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో వీనస్ తన సోదరికి గట్టి పోటీనే ఇచ్చినా కీలకదశలో సెరెనాయే పైచేయి సాధించింది. టైటిల్ గెలిచే క్రమంలో సెరెనా ఒక్క సెట్ కూడా తన ప్రత్యర్థులకు కోల్పోకపోవడం విశేషం. 2008లో మరియా షరపోవా (రష్యా) తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఒక్క సెట్ చేజార్చుకోకుండా నెగ్గిన క్రీడాకారిణి సెరెనాయే. విజేతగా నిలిచిన సెరెనాకు 37 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 19 కోట్ల 3 లక్షల 68 వేలు)... రన్నరప్ వీనస్‌కు 18 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 9 కోట్ల 51 లక్షలు) లభించింది. ప్రస్తుతం రెండో ర్యాంక్‌లో ఉన్న సెరెనా ఈ విజయంతో సోమవారం విడుదల చేసే మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) తాజా ర్యాంకింగ్స్‌లో అధికారికంగా మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకుంటుంది. వీనస్, సెరెనాల మధ్య ఫైనల్ బ్రేక్ పాయింట్లతో మొదలైంది. ఇద్దరూ తమ తొలి సర్వీస్‌లను కోల్పోవడంతో స్కోరు 1–1తో సమమైంది. ఆ తర్వాత ఏడో గేమ్‌లో వీనస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని తొలి సెట్‌ను 41 నిమిషాల్లో 6–4తో దక్కించుకుంది. బేస్‌లైన్ వద్ద ఆడుతూనే అడపాదడపా సెరెనా నెట్ వద్దకు దూసుకొచ్చి పాయింట్లు సాధించింది. మరోవైపు వీనస్ ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లు లయ తప్పడంతోపాటు అనవసర తప్పిదాలు ఎక్కువ చేయడంతో సెరెనాకు అంతగా ఇబ్బంది ఎదురుకాలేదు. రెండో సెట్లో ఏడో గేమ్‌లో వీనస్ సర్వీస్‌లో బ్రేక్ సంపాదించిన సెరెనా తన సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. నీవు లేక నేను లేను... ఇది చాలా కఠినమైన మ్యాచ్. దేవుడి దయ వల్లే ఇక్కడున్నాను. వీనస్ వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆమె లేకుంటే నా 23 గ్రాండ్‌స్లామ్ విజయాలే లేవు. నేను నంబర్‌వన్‌గా ఉండేదాన్నే కాదు. ఆమె లేకుంటే అసలు నేనే లేను. ఆమె నాకు ప్రేరణగా నిలిచింది. మీ అందరి ముందు నేనిక్కడ ఉండడానికి కారణం కూడా ఆమే. నన్ను అత్యుత్తమ క్రీడాకారిణిగా తీర్చిదిద్దిన ఘనత వీనస్దే. – సెరెనా సెరెనా ‘గ్రాండ్’ టైటిల్స్... 23 ఆస్ట్రేలియన్ ఓపెన్ (7) : 2003, 2005, 2007, 2009, 2010, 2015, 2017 ఫ్రెంచ్ ఓపెన్ (3) : 2002, 2013, 2015 వింబుల్డన్ (7) : 2002, 2003, 2009, 2010, 2012, 2015, 2016 యూఎస్ ఓపెన్ (6) : 1999, 2002, 2008, 2012, 2013, 2014 నేటి షెడ్యూల్ పురుషుల సింగిల్స్ ఫైనల్ ఫెడరర్ @ రాఫెల్ నాదల్ మధ్యాహ్నం గం. 2.00 నుంచి మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ సానియా మీర్జా, డోడిగ్@ స్పియర్స్, సెబాస్టియన్ ఉదయం గం. 10.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సెరెనా, వీనస్ లు డోపింగ్ కి పాల్పడ్డారా?
అమెరికన్ మహిళా టెన్నిస్ దిగ్గజాలు సెరెనా విలియమ్స్, వీనస్ లు డోపింగ్ కు పాల్పడ్డారా?. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా) వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఈ విషయాన్నే నొక్కి చెబుతున్నారు. సెరెనా, వీనస్ లతో పాటు రియో ఒలింపిక్స్ లో నాలుగు బంగారుల పతకాలు సాధించిన జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ కూడా నిషేధ ఉత్ర్పేరకాలు వాడినట్లు వారు పేర్కొన్నారు. వాడా వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన రష్యాకు చెందిన 'ఫ్యాన్సీ బీరర్స్' హ్యాకర్లు అమెరికన్ ఆటగాళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లను బయటపెట్టినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. వాడా డేటాబేస్ లోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట డజన్ల కొద్ది అమెరికన్ అథ్లెట్లు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినా.. వారు క్రీడల్లో పాల్గొనేందుకు వాడా అంగీకరించినట్లు ఫ్యాన్సీ బీరర్స్ పేర్కొంది. ఈ వార్తలపై స్పందించిన వాడా తమ వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైనట్లు ప్రకటించింది. క్రీడాకారులు గాయపడినప్పుడు ఉపయోగించే మందులలో వాడా నిషేధిత ఉత్ప్రేరకాన్ని అమెరికన్లు ఉపయోగించినట్లు ఫ్యాన్సీ బీరర్స్ తెలిపింది. వాడా నిబంధనల ప్రకారం గాయాల దృష్ట్యా నిషేధిత మందు వినియోగం అనివార్యమైనప్పుడు మాత్రమే వాటిని తీసుకోవాలి. ఈ నిబంధనను అడ్డంపెట్టుకుని అవసరం ఉన్నా లేకపోయినా అమెరికన్ అథ్లెట్లు దొంగ సర్టిఫికేట్లను సృష్టించి ఉత్ప్రేరకాలను తీసుకున్నారని ఫ్యాన్సీ బీరర్స్ పేర్కొంది. రియోలో అమెరికా సాధించిన పతాకాలన్నీ నిషేధిత ఉత్ర్పేరకం ఉపయోగించి గెలుచుకున్నవేనని ఆరోపించింది. క్రీడాకారులకు చెందిన రహస్య సమాచారాన్ని దొంగిలిచడాన్ని వాడా ఖండించింది. గత మూడు వారాలుగా వాడా వెబ్ సైట్ ను హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు వాడా చైర్మన్ తెలిపారు. ఫ్యాన్సీ బీరర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. నిషేధిత ఉత్ప్రేరకాలైన ఆక్సీకొడోన్, హైడ్రోమార్ఫోన్, ప్రిడ్నిసోన్, మిథైల్ ప్రిడ్నిసోలోన్ లను సెరెనా విలియమ్స్ 2010, 2014, 2015లలో వినియోగించినట్లు చెప్పింది. ప్రిడ్నిసోన్, ప్రిడ్నిసోలోన్, ట్రైయామ్సీలోన్ లాంటి నిషేధిత ఉత్ర్ఫేరకాలను 2010, 2011, 2012, 2013లలో వీనస్ ఉపయోగించినట్లు పేర్కొంది. అయితే, నిషేధిత ఉత్ర్పేరకాలను ఉపయోగించిన అథెట్లను వాడా ఎందుకు అనుమతించిందనే వివరాలు డేటాబేస్ లో లేవని తెలిపింది. రియోలో నాలుగు స్వర్ణాలు సాధించిన జిమ్నాస్ట్ బైల్స్ మిథైల్ ఫెనిడేట్ అనే నిషేధిత ఉత్ప్రేరకాన్నివినయోగించినా ఆమెపై నిషేధం విధించలేదని చెప్పింది. ఫ్యాన్సీ బీరర్స్ ప్రకటనలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసి) స్పందించింది. హ్యాకర్ల గ్రూప్ ప్రకటించిన ఆటగాళ్లలో ఎవరూ డోపింగ్ కు పాల్పడలేదని పేర్కొంది. ప్రపంచస్థాయి అథ్లెట్ల గౌరవానికి భంగం కలిగేలా చేయడాన్ని ఖండించింది. -
సూపర్ సెరెనా
వింబుల్డన్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సెమీస్‌లో వెస్నినాపై గెలుపు కెర్బర్ చేతిలో వీనస్‌కు చుక్కెదురు లండన్: ప్రత్యర్థి అనుభవరాహిత్యాన్ని ఆసరాగా చేసుకున్న అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్... వింబుల్డన్‌లో దుమ్మురేపింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ... తొమ్మిదోసారి ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్‌సీడ్ సెరెనా 6-2, 6-0తో ప్రపంచ 50వ ర్యాంకర్ ఎలెనా వెస్నినా (రష్యా)పై గెలిచింది. దీంతో ఈ టోర్నీలో ఇప్పటికి ఆరుసార్లు విజేతగా నిలిచిన అమెరికన్ ఏడో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. కేవలం 48 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా... పదునైన సర్వీస్‌లు... తిరుగులేని ఏస్‌లు... బలమైన బేస్‌లైన్ ఆటతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. కెరీర్లో 32వ గ్రాండ్‌స్లామ్ సెమీస్ మ్యాచ్ ఆడిన సెరెనా... 11 ఏస్‌లు, 28 విన్నర్లతో చెలరేగిపోయింది. ఏడు అనవసర తప్పిదాలు చేసినా... ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. సెరెనా కెరీర్లో ఇది 28వ స్లామ్ ఫైనల్. తొలిసెట్లో సెరెనా సర్వీస్‌లో వెస్నినా కేవలం మూడు పాయింట్లు మాత్రమే సాధించగా, రెండో సెట్లో ఒక్కటీ నెగ్గలేదు. రష్యా ప్లేయర్ సెమీస్‌కు చేరడం ఇదే మొదటిసారి కావడంతో బ్యాక్ హ్యాండ్ షాట్లతో కోర్టులో చురుకుగా కదిలిన సెరెనా.. 28 నిమిషాల్లోనే తొలిసెట్‌ను ముగించింది. రెండుసార్లు సర్వీస్‌ను బ్రేక్ చేసి, రెండుసార్లు సర్వీస్‌ను కాపాడుకోవడంతో 4-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదు, ఏడు గేమ్‌ల్లో వెస్నినా సర్వీస్‌ను నిలబెట్టుకున్నా... ఆరు, ఎనిమిది గేమ్‌లను సెరెనా సర్వీస్‌తో దక్కించుకుంది. ఇక రెండో సెట్లో ఒకటి, మూడు, ఐదు గేమ్‌ల్లో వెస్నినా సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు మూడుసార్లు తన సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ను మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. వీనస్ ఆశలు ఆవిరి ఐదేళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు చేరుకున్న వెటరన్ ప్లేయర్ వీనస్ విలియమ్స్.. వింబుల్డన్‌లో నిరాశపర్చింది. ఏడేళ్ల తర్వాత టైటిల్ గెలవాలన్న ఆశలకు అడుగు దూరంలోనే నిలిచిపోయింది. రెండో సెమీస్‌లో ఎనిమిదోసీడ్ వీనస్ (అమెరికా) 6-4, 6-4తో నాలుగోసీడ్ కెర్బర్ (జర్మనీ) చేతిలో ఓడింది. గంటా 11 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... వీనస్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. మూడు ఏస్‌లు, 24 విన్నర్లు సంధించిన ఈ అమెరికన్.. కీలక సమయంలో సర్వీస్‌లను చేజార్చుకుంది. మరోవైపు కెర్బర్ రెండు ఏస్‌లు, 17 విన్నర్లు సాధించింది. 2008లో చివరిసారి ఇక్కడ టైటిల్ గెలిచిన వీనస్... యూఎస్ ఓపెన్ (2010) తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి. శనివారం జరిగే ఫైనల్లో సెరెనా.... కెర్బర్తో తలపడనుంది. -
సిస్టర్స్ సులభంగా...
* వింబుల్డన్ సెమీస్‌లో సెరెనా, వీనస్ * కెర్బర్, వెస్నినా కూడా... లండన్: డిఫెండింగ్ చాంపియన్ హోదాను కొనసాగిస్తూ చెల్లెలు... ఏడేళ్ల తర్వాత సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటూ అక్క... వింబుల్డన్‌లో అమెరికా సిస్టర్స్ సెరెనా, వీనస్‌లు చెలరేగిపోయారు. స్థాయికి తగ్గ ప్రదర్శనతో ప్రత్యర్థులపై ఆధిపత్యం కొనసాగిస్తూ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేశారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో టాప్‌సీడ్ సెరెనా 6-4, 6-4తో 21వ సీడ్ అనస్థాసియా పావులుచెంకోవా (రష్యా)పై; 8వ సీడ్ వీనస్ 7-6 (7/5), 6-2తో యారోస్లోవా ష్వెదోవా (కజకిస్తాన్)పై నెగ్గి సెమీస్‌లోకి దూసుకెళ్లారు. పావులుంచెకోవాతో గంటా 12 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సెరెనా వ్యూహాత్మకంగా ఆడింది. భారీ సర్వీస్‌లతో కాకుండా తెలివిగా చిన్న చిన్న షాట్స్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. తొలిసెట్లో ఇరువురు చెరో నాలుగు గేమ్‌ల్లో సర్వీస్‌ను నిలబెట్టుకున్నారు. కానీ తొమ్మిదో గేమ్‌లో పావులుచెంకోవా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా.. ఆ వెంటనే సర్వీస్‌ను కాపాడుకుని సెట్‌ను నిలబెట్టుకుంది. రెండోసెట్‌లోనూ ఇదే తరహా ఫలితాన్ని పునరావృతం చేసి సెట్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మార్టినా నవ్రోతిలోవా (1994లో) తర్వాత వింబుల్డన్ సెమీస్‌కు చేరిన ఎక్కువ వయసు మహిళగా రికార్డులకెక్కిన 36 ఏళ్ల వీనస్... క్వార్టర్స్ మ్యాచ్‌లో ఆకట్టుకుంది. 2008లో చివరిసారి ఇక్కడ టైటిల్ గెలిచిన వీనస్... 2010 యూఎస్ ఓపెన్ తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి. ష్వెదోవాతో గంటా 42 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఇరువురు సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో స్కోరు 6-6తో సమమైంది. అయితే టైబ్రేక్‌లో వీనస్ వరుసగా సర్వీస్‌లను కాపాడుకుంటూ సెట్‌ను చేజిక్కించుకుంది. ఇక రెండోసెట్లో ఒకసారి సర్వీస్‌ను కోల్పోయిన వీనస్ మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నాలుగోసీడ్ కెర్బర్ (జర్మనీ) 7-5, 7-6 (7/2)తో ఐదోసీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై; ఎలెనా వెస్నినా (రష్యా) 6-2, 6-2తో 19వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా)పై గెలిచారు. సెమీస్‌లో సెరెనా... వెస్నినాతో; వీనస్... కెర్బర్తో తలపడతారు. సానియా జోడీకి చుక్కెదురు మిక్స్డ్ డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా-ఇవాన్ డుడిగ్ (క్రొయేషియా) జోడికి చుక్కెదురైంది. రెండోరౌండ్లో టాప్‌సీడ్ సానియా-డుడిగ్ 6-4, 3-6, 5-7తో బ్రిటన్ జంట నీల్ స్కుపిస్కీ-అనా స్మిత్‌ల చేతిలో ఓడారు. దాదాపు రెండు గంటలకుపైగా సాగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు చెరో సెట్‌ను సాధించాయి. మూడో గేమ్‌లో బ్రేక్ పాయింట్‌తో తొలిసెట్‌ను చేజిక్కించుకున్న సానియా ద్వయం... రెండోసెట్లో వరుసగా సర్వీస్‌లను చేజార్చుకున్నారు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో ఓ దశలో సానియా-డుడిగ్ 5-3 ఆధిక్యంలో నిలిచారు. అయితే కీలకమైన తొమ్మిదో గేమ్‌లో స్కోరు 40-30 వద్ద మ్యాచ్ పాయింట్‌ను చేజార్చుకున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న బ్రిటన్ జోడి భారీ సర్వీస్‌లతో చెలరేగిపోయింది. మరోసారి మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకుని ప్రత్యర్థి ఆధిక్యాన్ని 4-5కు తగ్గించారు. తర్వాత సర్వీస్‌ను కాపాడుకుని మ్యాచ్‌లో నిలిచారు. ఇక 11వ గేమ్‌లో సానియా జోడి సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు 12వ గేమ్‌లో తమ సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ను మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. బాలికల రెండోరౌండ్లో కర్మన్ కౌర్ (భారత్) 6-4, 2-6, 2-6తో బోల్క్వెడ్జ్ (జార్జియా) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో రోహన్ బోపన్న (భారత్)-రొడినోవా (ఆస్ట్రేలియా) జంటకు ఓటమి ఎదురైంది. కొలంబియా ద్వయం కాబెల్-మారినో 7-6 (7/5), 6-3తో బోపన్న జోడిపై నెగ్గింది. -
వీనస్.. ఓ సెలబ్రిటీ
ఫేస్బుక్ పేజీకి 10 లక్షల లైకులు.. ఇన్‌స్టాగ్రాంలో 6 లక్షలకు పైగా ఫాలోవర్లు.. కుప్పలు తెప్పలుగా ఫ్యాన్స్.. మరీ ఇంతలా క్రేజ్ ఉన్న సెలబ్రిటీ ఎవరో తెలుసా..! ఫొటోలో ఉన్న ఈ పిల్లి గారే. ముఖానికి ఓ వైపు నల్ల రంగు, మరో వైపు ఆరెంజ్ రంగు ఉన్న ఈ పిల్లి పేరు వీనస్. ఉత్తర కరోలినాకు చెందిన దీని యజమానులు క్రిస్టియానా, క్రిస్.. వీనస్ పేరుతో సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పేజీ నడుపుతున్నారు. కాస్త డిఫరెంట్‌గా ఉండేసరికి రోజురోజుకు దీని ఫాలోవర్ల సంఖ్య పెరిగిపోతోంది. అయితే వీనస్ ముఖానికి రంగు వేసి పోస్ట్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ‘కనీసం కళ్లకు కాటుక కూడా పెట్టుకోలేదు’ అంటూ వారికి కౌంటర్ ఇస్తున్నారు వీనస్ యజమానులు. ఏదైతేనేం ఇప్పుడు సోషల్ మీడియాలో వీనస్ సంచలనం సృష్టిస్తోంది. -
అక్కను దాటితేనే చరిత్ర..!
క్యాలెండర్ స్లామ్ కు మూడు మ్యాచ్ ల దూరంలో ఉన్న సెరెనా విలియమ్స్ క్వార్టర్స్ లో అక్క వీసన్ విలియమ్స్ తో తలపడ నుంది. ఈ మ్యాచ్ గురించే ఇప్పుడు న్యూయార్కర్ లు ప్రధానంగా చర్చించు కుంటున్నారు. మహిళా టెన్సి స్ కి పవర్ గేమ్ పరిచయం చేసిన ఈ అక్కా చెళ్లెల్లు మరో సారి తలపడనున్నారు. వింబుల్డన్ లో అక్కపై చెల్లి పై చేయి సాధించడంతో.. లెక్క సరిచేయడానికి అక్క సిద్దమైతోంది. అక్కను చెల్లి ఓడిస్తుందా..? లేదా చెల్లికి అక్క చెక్ పెడుతుందా..? అమెరికా నల్ల కలువలు సొంత మైదానంలో ముఖాముఖి పోరుకు సిద్దమైయ్యారు. ఈ ఏడాది వింబుల్డన్ నాలుగో రౌండ్ లో తలపడిన విలియమ్స్ సిస్టర్స్ తాజాగా యూఎస్ ఓపెన్ క్వార్ట్ర ర్స్ లో మరో సారి అమితుమీ తేల్చుకోనున్నారు. సెరెనా, వీనస్ చిన్నప్పటి నుంచి కలిసే ప్రాక్టీస్ చేశారు. ఒకరి లోపాలు ఒకరికి బాగా తెలుసు.. తొలిసారి 1998లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ లో విలియమ్ సిస్టర్స్ ముఖాముఖి తలపడ్డారు. తర్వాత వారిద్దరి మధ్య మరో 25 ముఖాముఖి మ్యాచ్ లు జరిగాయి. మొత్తంగా చూస్తూ అక్కపై చెల్లికే మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకూ 15 సార్లు వీనస్ పై సెరెనా, గెలవగా.. వీనస్ 11 సార్లు చెల్లిని చిత్తు చేసింది. వారిద్దరి మధ్య వరుసగా జరిగిన ఏడు మ్యాచ్ ల్లో ఆరు సార్లు సెరెనా గెలవగా.. గత ఏడాది మాట్రియల్ సెమీస్ లో మాత్రం సెరెనా ను వీనస్ మట్టి కరిపించింది. ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడిన సెరెనా.. అక్క వీనస్ కు కితాబిచ్చింది. ఆమెతో మ్యాచ్ ఎప్పుడైనా సవాలే.. ఏమాత్రం అలసత్వం వహించినా.. విజయం మీద ఆశ వదులు కోవాల్సిందే.. ఇక ఈ టోర్నీలో కూడా వీనస్ అద్బుతంగా ఆడుతోందని వివరించింది. ఇక అందరి కంటే ఎక్కువగా సెరెనా పై గెలిచిన రికార్డు వీనస్ సొంతం. మరో వైపు వీసన్ చెల్లి తో మ్యాచ్ లో జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. సెరెనా సంధించే ఏస్ లను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానని చెప్పింది. తాజాగా.. యూస్ ఓపెన్ లో ఈ సిస్టర్స్ నాలుగు సార్లు తలపడ్డారు. చెరి రెండు సార్లు గెలిచి 2-2 తో స్కొర్ సమం చేశారు. రీసెంట్ ఫాం ప్రకారం చూస్తే ఈ మ్యాచ్ లో సెరేనాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టోర్నీ హిస్టరీ కూడా వీనస్ కు సపోర్టు చేస్తోంది. సెరీనా యూఎస్ ఓపెన్ లో గత మూడు ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యం వహిస్తోంది. ప్రస్తుతం క్యాలెండర్ స్లామ్ పూర్తి చేయాలన్నలక్ష్యంతో బరిలోకి దిగిన సెరెనా.. ఆ ఒత్తిడిని జయిస్తుందో?లేదో?చూడాల్సిందే.