
ఏలియన్స్ జాడ గుర్తించినట్లు నాసా చెబుతున్న ప్రాంతమిదే
వాషింగ్టన్ : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గ్రహంతరవాసుల జాడ గురించి బాంబు లాంటి వార్తను పేల్చింది. భూమికి పొరుగునే ఉన్న వీనస్ గ్రహంపై వాటి ఆనవాళ్లను కనుగొన్నట్లు ప్రకటించింది.
నాసా శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘వీనస్(శుక్ర గ్రహం) మేఘాల్లో నల్లటి జాడలను కనుగొన్నాం. అక్కడ జీవదార్థాన్ని గుర్తించాం. బహుశా అక్కడే ఏలియన్లు నివసిస్తూ ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వీలైనంత త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక వీనస్‌పై వాతావరణం దారుణంగా ఉంటుందన్న సైంటిస్టులు. 500 డిగ్రీ సెల్సియస్ ఉష్టోగ్రత.. ఆమ్ల వర్షంతో ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ప్రత్యేక బృందం పరిశోధనలను కొనసాగించబోతోంది అని తెలిపారు.
ఇందుకోసం ప్రత్యేక బృందం బయోకెమికల్, రసాయనిక అధ్యయనాలు చేపట్టే అవకాశం ఉంది. ఇక 240 మిలియన్ల డాలర్ల వ్యయంతో నాసా ఏలియన్ జాడ కోసం పరిశోధనలను కొనసాగించబోతోంది.
నాసా వాస్తవాలు బయటపెట్టాల్సిందే.. ఏలియన్ల మనుగడ విషయంలో నాసా వాస్తవాలను దాస్తోందని బకింగ్‌హమ్ యూనివర్సిటీ పరిశోధనకారుడు, ప్రొఫెసర్ బారీ డి గ్రెగోరియో ఆరోపిస్తూ వస్తున్నారు. అంగారక గ్రహం గతంలోనే నాసా ఏలియన్ల జాడను కనిపెట్టిందని. క్యూరియాసిటీ రోవర్ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా తీసిందని ఆయన వాదించారు. ఈ నేపథ్యంలో నాసా తాజా ప్రకటన ఆసక్తికర చర్చకు దారితీసింది.
Comments
Please login to add a commentAdd a comment