అక్కను దాటితేనే చరిత్ర..!
క్యాలెండర్ స్లామ్ కు మూడు మ్యాచ్ ల దూరంలో ఉన్న సెరెనా విలియమ్స్ క్వార్టర్స్ లో అక్క వీసన్ విలియమ్స్ తో తలపడ నుంది. ఈ మ్యాచ్ గురించే ఇప్పుడు న్యూయార్కర్ లు ప్రధానంగా చర్చించు కుంటున్నారు. మహిళా టెన్సి స్ కి పవర్ గేమ్ పరిచయం చేసిన ఈ అక్కా చెళ్లెల్లు మరో సారి తలపడనున్నారు. వింబుల్డన్ లో అక్కపై చెల్లి పై చేయి సాధించడంతో.. లెక్క సరిచేయడానికి అక్క సిద్దమైతోంది. అక్కను చెల్లి ఓడిస్తుందా..? లేదా చెల్లికి అక్క చెక్ పెడుతుందా..?
అమెరికా నల్ల కలువలు సొంత మైదానంలో ముఖాముఖి పోరుకు సిద్దమైయ్యారు. ఈ ఏడాది వింబుల్డన్ నాలుగో రౌండ్ లో తలపడిన విలియమ్స్ సిస్టర్స్ తాజాగా యూఎస్ ఓపెన్ క్వార్ట్ర ర్స్ లో మరో సారి అమితుమీ తేల్చుకోనున్నారు.
సెరెనా, వీనస్ చిన్నప్పటి నుంచి కలిసే ప్రాక్టీస్ చేశారు. ఒకరి లోపాలు ఒకరికి బాగా తెలుసు.. తొలిసారి 1998లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ లో విలియమ్ సిస్టర్స్ ముఖాముఖి తలపడ్డారు. తర్వాత వారిద్దరి మధ్య మరో 25 ముఖాముఖి మ్యాచ్ లు జరిగాయి. మొత్తంగా చూస్తూ అక్కపై చెల్లికే మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకూ 15 సార్లు వీనస్ పై సెరెనా, గెలవగా.. వీనస్ 11 సార్లు చెల్లిని చిత్తు చేసింది. వారిద్దరి మధ్య వరుసగా జరిగిన ఏడు మ్యాచ్ ల్లో ఆరు సార్లు సెరెనా గెలవగా.. గత ఏడాది మాట్రియల్ సెమీస్ లో మాత్రం సెరెనా ను వీనస్ మట్టి కరిపించింది.
ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడిన సెరెనా.. అక్క వీనస్ కు కితాబిచ్చింది. ఆమెతో మ్యాచ్ ఎప్పుడైనా సవాలే.. ఏమాత్రం అలసత్వం వహించినా.. విజయం మీద ఆశ వదులు కోవాల్సిందే.. ఇక ఈ టోర్నీలో కూడా వీనస్ అద్బుతంగా ఆడుతోందని వివరించింది. ఇక అందరి కంటే ఎక్కువగా సెరెనా పై గెలిచిన రికార్డు వీనస్ సొంతం. మరో వైపు వీసన్ చెల్లి తో మ్యాచ్ లో జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. సెరెనా సంధించే ఏస్ లను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానని చెప్పింది.
తాజాగా.. యూస్ ఓపెన్ లో ఈ సిస్టర్స్ నాలుగు సార్లు తలపడ్డారు. చెరి రెండు సార్లు గెలిచి 2-2 తో స్కొర్ సమం చేశారు. రీసెంట్ ఫాం ప్రకారం చూస్తే ఈ మ్యాచ్ లో సెరేనాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టోర్నీ హిస్టరీ కూడా వీనస్ కు సపోర్టు చేస్తోంది. సెరీనా యూఎస్ ఓపెన్ లో గత మూడు ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యం వహిస్తోంది. ప్రస్తుతం క్యాలెండర్ స్లామ్ పూర్తి చేయాలన్నలక్ష్యంతో బరిలోకి దిగిన సెరెనా.. ఆ ఒత్తిడిని జయిస్తుందో?లేదో?చూడాల్సిందే.