grand slam
-
సినెర్, స్వియాటెక్ అలవోకగా...
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో కొందరు సీడెడ్ ప్లేయర్లకు అనూహ్య పరాజయాలు ఎదురవుతుంటే... టాప్ స్టార్లు అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... వీరికి దీటుగా యువ క్రీడాకారులు సైతం మేటి ఆటగాళ్లను ఢీకొట్టి మరీ మూడో రౌండ్‌ను దాటేశారు. క్వాలిఫయర్ లెర్నర్ టియెన్, 22 ఏళ్ల మిచెల్సన్ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లో ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.మెల్బోర్న్: పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ఇటలీ స్టార్ యానిక్ సినెర్...మహిళల విభాగంలో ఫ్రెంచ్ ఓపెన్ ‘హ్యాట్రిక్’ చాంపియన్, పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్లు ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో స్వియాటెక్‌తో పాటు ఆరో సీడ్ ఎలినా రిబాకినా (కజకిస్తాన్), ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా), తొమ్మిదో సీడ్ డారియా కసత్కినా (రష్యా) ప్రిక్వార్టర్స్ చేరారు. వీరితో పాటు ఎనిమిదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా), 13వ సీడ్ హోల్గర్ రూన్ (డెన్మార్క్) నాలుగో రౌండ్ చేరుకున్నారు. ఇరు విభాగాల్లో నాలుగో సీడ్ ప్లేయర్లు ఫ్రిట్జ్ (అమెరికా), పావొలిని (ఇటలీ)లకు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. భార్యభర్తలు స్వితోలినా (ఉక్రెయిన్), మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) చెప్పుకోదగిన విజయాలతో ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో ముందంజ వేశారు. స్వితోలినా గత సీజన్ రెండు గ్రాండ్‌స్లామ్‌ల రన్నరప్ పావొలినిని కంగుతినిపిస్తే, మోన్ఫిల్స్... గత యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్కు చెక్ పెట్టాడు. సినెర్ జోరు... డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ యానిక్ సినెర్ అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్ చేరాడు. శనివారం పురుషుల సింగిల్స్‌లో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో అతను 6–3, 6–4, 6–2తో అమెరికాకు చెందిన 46వ ర్యాంకర్ మార్కొస్ గిరోన్‌ను వరుస సెట్లలో ఓడించాడు. గత సీజన్లో ఆసీస్, ఫ్రెంచ్ ఓపెన్లను గెలుచుకున్న 23 ఏళ్ల ఇటలీ టాప్‌స్టార్ ఈ సీజన్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. మరో మ్యాచ్‌లో గేల్ మోన్ఫిల్స్ ప్రిక్వార్టర్స్ చేరడం ద్వారా వన్నె తగ్గని వెటరన్ ప్లేయర్‌గా టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సరసన నిలిచాడు. మూడో రౌండ్లో 38 ఏళ్ల మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 3–6, 7–5, 7–6 (7/1), 6–4తో నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)కు షాకిచ్చాడు. 2020లో ఫెడరర్ 38 ఏళ్ల వయసులో తన ఆఖరి ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడి సెమీస్ చేరాడు. డి మినార్ (ఆసీస్) 5–7, 7–6 (7/3), 6–3, 6–3తో సెరుండొలొ (అర్జెంటీనా)పై, 13వ సీడ్ రూన్ (డెన్మార్క్) 6–7 (5/7), 6–3, 4–6, 6–4, 6–4తో కెక్మనోవిచ్ (సెర్బియా)పై గెలిచారు. సంచలన క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ (అమెరికా) 7–6 (12/10), 6–3, 6–3తో ఫ్రాన్స్‌కు చెందిన మౌటెట్ను ఓడించాడు. అన్‌సీడెడ్ మిచెల్సన్ (అమెరికా) 6–3, 7–6 (7/5), 6–2తో 19వ సీడ్ కచనొవ్ (రష్యా)ను కంగుతినిపించాడు. స్వితోలినా ముందంజ మోన్ఫిల్స్ భార్య ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) తన భర్త నెగ్గిన కోర్టులోనే అనంతరం జరిగిన మ్యాచ్‌లో 2–6, 6–4, 6–0తో గత ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ (2024)ల రన్నరప్ జాస్మిన్ పావొలిని (ఇటలీ)ని కంగుతినిపించింది. రెండో సీడ్ స్వియాటెక్ 6–1, 6–0తో యూఎస్ ఓపెన్ (2021) మాజీ చాంపియన్, బ్రిటన్ ప్లేయర్ ఎమ్మా రాడుకానుపై అలవోక విజయం సాధించింది. 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–4, 6–4తో పదోసీడ్ సహచర ప్లేయర్ కొలిన్స్‌ను ఓడించింది. 6వ సీడ్ రిబాకినా 6–3, 6–4తో డయానా యా్రస్తెస్కా (ఉక్రెయిన్)పై, 8వ సీడ్ నవారో 6–4, 3–6, 6–4తో ఓన్స్ జాబెర్ (ట్యూనిíÙయా)పై, 9వ సీడ్ కసత్కినా (రష్యా) 7–5, 6–1తో పుతిన్‌త్సెవా (కజకిస్తాన్)పై గెలుపొందారు. బాలాజీ జోడీ అవుట్ ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ నుంచి భారత డబుల్స్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ నిష్క్రమించాడు. మెక్సికన్ భాగస్వామి మిగుల్ ఏంజిల్ రేయెస్ వారెలతో జోడీ కట్టిన భారత ఆటగాడు రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. పురుషుల డబుల్స్‌లో శనివారం జరిగిన పోరులో బాలాజీ–ఏంజిల్ రేయెస్ ద్వయం 6–7 (1/7), 6–4, 3–6తో పోర్చుగల్‌కు చెందిన న్యూనో బోర్జెస్–ఫ్రాన్సిస్కొ కాబ్రల్ జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
‘బ్రిస్బేన్’తో జొకోవిచ్ సీజన్ మొదలు
బెల్గ్రేడ్: కొత్త ఏడాదిలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటకు టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ సిద్ధమయ్యాడు. జనవరి 12 నుంచి జరిగే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న జొకోవిచ్... దానికి ముందు మరో టోర్నీతో తన సీజన్ మొదలు పెడుతున్నాడు. డిసెంబర్ 29 నుంచి జనవరి 5 వరకు జరిగే బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో ఈ సెర్బియా దిగ్గజం ఆడతాడు. 2009 తర్వాత అతను ఈ టోర్నీలో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. జొకోవిచ్‌తో పాటు దిమిత్రోవ్, రూన్, టియాఫో, కిరియోస్ తదితర అగ్రశ్రేణి ఆటగాళ్లు బ్రిస్బేన్ టోర్నీలో పాల్గొంటున్నారు. ఆ్రస్టేలియన్ ఓపెన్‌ను 10 సార్లు గెలిచిన జొకోవిచ్ మరోసారి టైటిల్ సాధిస్తే రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ అతని ఖాతాలో చేరుతుంది. -
U S Open 2024: కోకో గాఫ్ అవుట్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోకో గాఫ్ (అమెరికా) ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. అమెరికాకే చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారోతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ కోకో గాఫ్ 3–6, 6–4, 3–6తో ఓడిపోయింది. 2 గంటల 12 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కోకో గాఫ్ ఏకంగా 19 డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం. కేవలం 14 విన్నర్స్ కొట్టిన కోకో 60 అనవసర తప్పిదాలు చేసింది. తన సరీ్వస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన కోకో ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ఏడో సీడ్ కిన్వెన్ జెంగ్ (చైనా), రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కిన్వెన్ జెంగ్ 7–6 (7/2), 4–6, 6–2తో డోనా వెకిచ్ (క్రొయేషియా)పై, సబలెంకా 6–2, 6–4తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలి యా) ద్వయం 1–6, 5–7తొ మాక్సిమో–మొల్తాని (అర్జెంటీనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
Australian Open 2024: విన్నర్ సినెర్...
మెల్బోర్న్: సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, 10 సార్లు చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)పై తాను సాధించిన విజయం గాలివాటమేమీ ఇటలీ యువతార యానిక్ సినెర్ నిరూపించాడు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో నాలుగో సీడ్ సినెర్ చాంపియన్‌గా అవతరించి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సినెర్ 3–6, 3–6, 6–4, 6–4, 6–3తో ప్రపంచ మూడో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై చిరస్మరణీయ విజయం సాధించాడు. తద్వారా 1976 తర్వాత పురుషుల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఇటలీ ప్లేయర్ గా, ఆ్రస్టేలియన్ ఓపెన్ సాధించిన తొలి ఇటలీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. 3 గంటల 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 22 ఏళ్ల సినెర్ తొలి రెండు సెట్లు కోల్పోయినా ఆందోళన చెంద లేదు. మూడో సెట్ నుంచి సినెర్ నెమ్మదిగా లయలోకి వచ్చాడు. కెరీర్లో ఆరోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న మెద్వెదెవ్పై ఒత్తిడి తెచ్చాడు. మూడో సెట్ పదో గేమ్‌లో, నాలుగో సెట్ పదో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌లను బ్రేక్ చేసిన సినెర్ రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లో ఆరో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. విజేత సినెర్‌కు 31 లక్షల 50 వేల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 22 లక్షలు), రన్నరప్ మెద్వెదెవ్కు 17 లక్షల 25 వేల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
Australian Open: సంచలన విజయం.. చరిత్ర సృష్టించిన సుమిత్
Australian Open 2024- Sumit Nagal First Indian In 35 Years: ఆస్ట్రేలియా ఓపెన్-2024లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ సంచలన విజయం సాధించాడు. మెన్స్ సింగిల్స్‌లో 137వ ర్యాంకర్ అయిన ఈ హర్యానా కుర్రాడు.. వరల్డ్ నెంబర్ 27 అలెగ్జాండర్ బబ్లిక్‌పై గెలుపొంది చరిత్ర సృష్టించాడు. భారత టెన్నిస్ చరిత్రలో 35 ఏళ్ల తర్వాత.. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన రెండో ఆటగాడిగా సుమిత్ రికార్డులకెక్కాడు. కాగా ఆస్ట్రేలియా ఓపెన్ తాజా ఎడిషన్‌లో భాగంగా తొలి రౌండ్లో.. సుమిత్ నాగల్.. కజకిస్తాన్ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ బబ్లిక్‌తో పోటీపడ్డాడు. ర్యాంకింగ్ పరంగా తనకంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్న అలెగ్జాండర్‌కు ఆది నుంచే గట్టి పోటీనిస్తూ చుక్కలు చూపించాడు సుమిత్. రెండో రౌండ్లో అడుగుపెట్టిన సుమిత్ మొత్తంగా రెండు గంటల 38 నిమిషాల పాటు పోరాడి ఆఖరికి 6-4, 6-2, 7-6తో విజయం సాధించాడు. అయితే, తొలి రెండు సెట్లలో తేలిగ్గానే తలవంచిన అలెగ్జాండర్ మూడో సెట్లో మాత్రం సుమిత్‌ను చెమటోడ్చేలా చేశాడు. ఈ క్రమంలో టై బ్రేకర్‌లో ఎట్టకేలకు పైచేయి సాధించిన సుమిత్.. ప్రత్యర్థిని ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. హర్యానాకు చెందిన 26 ఏళ్ల సుమిత్ నాగల్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. 2021లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన అతడు ఈసారి మాత్రం చారిత్రక విజయంతో మొదటి ఆటంకాన్ని అధిగమించాడు. రమేశ్ క్రిష్ణన్ తర్వాత అదే విధంగా.. రమేశ్ క్రిష్ణన్ తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్‌లో సీడెడ్ ప్లేయర్‌ను ఓడించిన భారత రెండో ఆటగాడిగా సుమిత్ నాగల్ అరుదైన ఘనత సాధించాడు. కాగా 1989 నాటి ఆస్ట్రేలియా ఓపెన్‌లో రమేశ్ క్రిష్ణన్ ఆనాటి నంబర్ వన్ ప్లేయర్ మ్యాట్స్ విలాండర్ను ఓడించి సంచలనం సృష్టించాడు. 35 ఏళ్ల తర్వాత మళ్లీ సుమిత్ ఆ ఫీట్‌ను నమోదు చేశాడు. పదేళ్ల వయసులోనే.. హర్యానాలో 1997, ఆగష్టు 16న జన్మించిన సుమిత్ నాగల్ 10వ ఏటనే టెన్నిస్ రాకెట్ పట్టుకున్నాడు. మహేశ్ భూపతి మిషన్ 2018 ప్రోగ్రాంలో భాగమైన అతడు.. 2015లో తొలిసారి ప్రతిష్టాత్మక విజయం సాధించాడు. వింబుల్డన్ బాయ్స్ డబుల్స్ టైటిల్ పోరులో తన వియత్నాం పార్ట్నర్ లీ హొంగ్ నామ్‌తో కలిసి విజేతగా నిలిచాడు. అయితే, 2019లో మొదటిసారి సుమిత్ నాగల్ క్రీడా ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. Well played Sumit Nagal💐💐💐.Although Sumit Nagal lost, But surely it was an exciting match . Winning a set against @rogerfederer is nothing less than an achievement. #FederervsNagal #USOpen pic.twitter.com/XN3WVuHDiq — Mahesh Kanakaraj🇮🇳 (@maheshmech06) August 27, 2019 ఏకంగా ఫెడరర్తోనే నాటి యూఎస్ ఓపెన్ టోర్నీలో టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెడరర్‌తో తొలి రౌండ్లో పోటీ పడ్డ సుమిత్.. తొలి సెట్‌ను 6-4తో గెలిచాడు. ఆ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ ఫెడరర్‌కు పోటీనిచ్చిన యంగ్‌స్టర్‌గా తనదైన ముద్ర వేయగలిగాడు. చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి.. The first Indian man in 3️⃣5️⃣ years to beat a seed at a Grand Slam 🇮🇳@nagalsumit • #AusOpen • #AO2024 • @Kia_Worldwide • #Kia • #MakeYourMove pic.twitter.com/SY55Ip4JaG — #AusOpen (@AustralianOpen) January 16, 2024 -
చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఆ ఘనత సాధించిన ఏకైక మొనగాడిగా రికార్డు
వింబుల్డన్ 2022లో ప్రపంచ మూడో ర్యాంకర్, డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్‌కు శుభారంభం లభించింది. తొలి రౌండ్లో దక్షిణ కొరియా ఆటగాడు, ప్రపంచ 81వ ర్యాంకర్ సూన్‌వూ క్వాన్‌పై 6-3, 3-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించిన జకో.. రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో జకో ఓ అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో కనీసం 80 సింగిల్స్ విజయాలు సాధించిన తొలి పురుష ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గ్రాండ్‌స్లామ్ చరిత్రలో ఇప్పటివరకు ఏ పురుష ఆటగాడు ఈ ఫీట్‌ను సాధించింది లేదు. కాగా, గతేడాది మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు (యూఎస్ ఓపెన్ మినహా) సాధించిన జకోవిచ్.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయాడు. వ్యాక్సిన్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో వైరం కారణంగా అతను ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. అనంతరం ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడినా క్వార్టర్ ఫైనల్లో నదాల్ చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జకో.. వింబుల్డన్‌లో వరుసగా నాలుగో టైటిల్‌పై కన్నేశాడు. జకో రెండో రౌండ్లో ఆస్ట్రేలియాకు చెందిన థనాసి కొక్కినాకిస్తో తలపడాల్సి ఉంది. చదవండి: Wimbledon 2022: వ్యాక్సిన్ విషయంలో తగ్గేదేలే: జకోవిచ్ -
గదుల్లో ఎలుకలు, నాణ్యతలేని ఆహారం
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వచ్చి క్వారంటైన్లో చిక్కుకుపోయిన విదేశీ టెన్నిస్ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గదుల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఒకరు పేర్కొనగా, తమకు అందిస్తున్న భోజనం సరిగా లేదని మరో ప్లేయర్ వాపోయాడు. శనివారం మెల్బోర్న్కు ప్లేయర్లను తీసుకొచ్చిన విమానాల్లో నలుగురికి కరోనా పాజిటివ్ ఫలితం రావడంతో అందులో ప్రయాణించిన 47 మంది ఆటగాళ్లను కఠిన క్వారంటైన్‌కు తరలించారు. ఇందులో ఒకరైన కజకిస్తాన్ మహిళా ప్లేయర్ యులియా పుతిన్సెవా తన గదిలో ఎలుక తిరుగుతోన్న వీడియోను ట్విట్టర్లో పంచుకుంది. ప్రాక్టీస్‌కు అనుమతించకపోవడంతో ఆమె తన గదిలోని బీరువాను ప్రాక్టీస్ వాల్‌గా మార్చుకుంది. బీరువాకు బంతి కొడుతూ షాట్లు ప్రాక్టీస్ చేసింది. విమానంలో ప్రయాణించిన వారిలో ఒకరికి వైరస్ సోకితే మిగతా వారంతా క్వారంటైన్లో ఉండాలని తనకు ముందే చెబితే అసలు ఈ ప్రయాణం గురించి పునరాలోచించుకునేదాన్నని ఆమె వ్యాఖ్యానించింది. ప్రపంచ 15వ ర్యాంక్ ప్లేయర్ పాబ్లో కరెనో బుస్టా... క్వారంటైన్లో తనకు అందించిన నాణ్యతలేని భోజనంపై అసంతృప్తి వెలిబుచ్చగా, ఫ్రెంచ్ ప్లేయర్ బెనోయిట్ పెయిర్ హోటల్ భోజనాన్ని తిరస్కరించి బయట నుంచి తెప్పించుకున్నట్లు చెప్పాడు. మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్ చీఫ్ క్రెగ్ టిలీ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 8 నుంచి పోటీలు జరుగుతాయని ఆదివారం స్పష్టం చేశారు. కష్టమైనప్పటికీ ఆటగాళ్లు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సిందేనని పేర్కొన్నారు. -
సెరెనా అదిరెన్...
తనకెంతో కలిసొచ్చిన వేదికపై అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (24) ఆల్‌టైమ్ రికార్డును సమం చేసేందుకు మళ్లీ ప్రయత్నిస్తున్న 38 ఏళ్ల సెరెనా ఈ క్రమంలో కొత్త రికార్డును సృష్టించింది. యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌ల్లో విజయాలు అందుకున్న ప్లేయర్‌గా సెరెనా ఘనత వహించింది. 101 విజయాలతో అమెరికాకే చెందిన మరో దిగ్గజం క్రిస్ ఎవర్ట్ పేరిట ఇన్నాళ్లూ ఉన్న రికార్డును 102వ విజయంతో సెరెనా బద్దలు కొట్టింది. 1998లో తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ఆడిన సెరెనా ఈ మెగా టోర్నీలో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచింది. ఈసారీ సెరెనా గెలిస్తే అత్యధికసార్లు యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా క్రిస్ ఎవర్ట్ (6 సార్లు) పేరిటే ఉన్న రికార్డును సవరించి చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. న్యూయార్క్: కరోనా వైరస్ భయంతో యూఎస్ ఓపెన్ టోర్నీకి టాప్–10లోని ఆరుగురు క్రీడాకారిణులు గైర్హాజరీ అయిన స్థితిలో... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... చరిత్రలో స్థానం సంపాదించేందుకు అమెరికా మహిళా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తొలి అడుగు వేసింది. గత రెండేళ్లలో ఫైనల్‌కు చేరుకొని రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకున్న సెరెనా ఈసారి మాత్రం ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సెరెనా 7–5, 6–3తో తన దేశానికే చెందిన క్రిస్టీ ఆన్‌పై విజయం సాధించింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లోసెరెనా 13 ఏస్‌లు సంధించింది. కెరీర్లో 20వసారి యూఎస్ ఓపెన్‌లో ఆడుతున్న సెరెనా తాజా గెలుపుతో ఈ మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా (పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలు కలిపి) తనకంటూ ప్రత్యేక స్థానాన్ని లిఖించుకుంది. 101 విజయాలతో క్రిస్ ఎవర్ట్ (అమెరికా) పేరిట ఉన్న ఈ రికార్డును సెరెనా అధిగమించింది. ఒకవేళ సెరెనా ఈసారి చాంపియన్‌గా నిలిస్తే అత్యధికంగా ఏడుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పుతుంది. 1998లో ఈ టోర్నీలో అరంగేట్రం చేసిన సెరెనా ఆరుసార్లు విజేతగా (1999, 2002, 2008, 2012, 2013, 2014)... నాలుగుసార్లు రన్నరప్‌గా (2001, 2011, 2018, 2019) నిలిచింది. 2003, 2017లలో సెరెనా ఈ టోర్నీలో ఆడలేదు. యూఎస్ ఓపెన్‌కు సన్నాహాల్లో భాగంగా రెండు టోర్నీలు ఆడిన సెరెనా రెండింటిలోనూ క్వార్టర్ ఫైనల్ దాటలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆమె మూడు సెట్లపాటు పోరాడాల్సి వచ్చింది. ‘యూఎస్ ఓపెన్‌లో ఆడేందుకు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక రికార్డు బద్దలు కొట్టానని నాతో చెబుతుంటారు. అయితే నేనెప్పుడూ రికార్డుల కోసం ఆడలేదు. వాటి గురించి ఆలోచించడంలేదు. టైటిల్ గెలవడమే నా ముందున్న లక్ష్యం’ అని సెరెనా వ్యాఖ్యానించింది. మాజీ చాంపియన్ క్లియ్‌స్టర్స్‌కు నిరాశ... ఎనిమిదేళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పునరాగమనం చేసిన మూడుసార్లు యూఎస్ ఓపెన్ చాంపియన్ కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం)కు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో 37 ఏళ్ల క్లియ్‌స్టర్స్ 6–3, 5–7, 1–6తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 6–2, 6–2తో విక్‌మాయెర్ (బెల్జియం)పై, తొమ్మిదో సీడ్ యోహానా కొంటా (బ్రిటన్) 7–6 (9/7), 6–1తో హీథెర్ వాట్సన్ (బ్రిటన్)పై, ఐదో సీడ్ సబలెంకా (బెలారస్) 7–6 (7/1), 6–4తో ఒషీన్ డోడిన్ (ఫ్రాన్స్)పై, ఏడో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–1, 6–1తో తిమియా బాబోస్ (హంగేరి)పై, ప్రపంచ మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) 6–1, 6–2తో బార్బరా హాస్ (ఆస్ట్రియా)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో కెర్బర్, క్విటోవా.... మహిళల సింగిల్స్‌లో మాజీ విజేత కెర్బర్ (జర్మనీ), ఆరో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), ఎనిమిదో సీడ్ పెట్రా మార్టిక్ (క్రొయేషియా), 14వ సీడ్ అనెట్ కొంటావె (ఎస్తోనియా) మూడో రౌండ్లోకి చేరారు. రెండో రౌండ్లో కెర్బర్ 6–3, 7–6 (8/6)తో ఫ్రీడ్సామ్ (జర్మనీ)పై, మార్టిక్ 6–3, 6–4తో కాటరీనా బొండారెంకో (ఉక్రెయిన్)పై, కొంటావె 6–4, 6–1తో కయా యువన్ (స్లొవేనియా)పై, క్విటోవా 7–6 (7/3), 6–2తో కొజ్లోవా (ఉక్రెయిన్)పై గెలిచారు. అయితే 12వ సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్) 1–6, 2–6తో సస్నోవిచ్ (బెలారస్) చేతిలో... 30వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) 6–1, 6–7 (2/7), 0–6తో గ్రషెవా (రష్యా) చేతిలో ఓడిపోయారు. వీనస్ రికార్డు... అత్యధికసార్లు యూఎస్ ఓపెన్‌లో ఆడిన క్రీడాకారిణిగా వీనస్ విలియమ్స్ (అమెరికా) రికార్డు సృష్టించింది. సెరెనా అక్క అయిన 40 ఏళ్ల వీనస్ యూఎస్ ఓపెన్‌లో 22వసారి బరిలోకి దిగింది. అయితే ఆమెకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 7–5తో వీనస్‌ను ఓడించింది. ఇప్పటిదాకా మార్టినా నవ్రతిలోవా (21 సార్లు) పేరిట ఉన్న రికార్డును వీనస్ సవరించింది. ముర్రే అద్భుతం... పురుషుల సింగిల్స్ విభాగంలో మాజీ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) అద్భుత విజయం సాధించాడు. దాదాపు 20 నెలల తర్వాత తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడిన ముర్రే 4–6, 4–6, 7–6 (7/5), 7–6 (7/4), 6–4తో యోషిహిటో నిషియోక (జపాన్)పై గెలుపొందాడు. 4 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే తొలి రెండు సెట్లు కోల్పోయి ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. వరుసగా రెండు సెట్లు చేజార్చుకున్నాక విజయాన్ని అందుకోవడం ముర్రే కెరీర్లో ఇది పదోసారి కావడం విశేషం. మూడో సీడ్ మెద్వెదేవ్ (రష్యా), రెండో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఎనిమిదో సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్), పదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. దివిజ్ శరణ్ జంట ఓటమి పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్ (భారత్)–నికోలా కాచిచ్ (సెర్బియా) జంట తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. శరణ్–కాచిచ్ ద్వయం 4–6, 6–4, 3–6తో కూలాఫ్–మెక్టిక్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడిపోయింది. -
కప్ కొడితే కాసుల పంట...
న్యూయార్క్: ప్రతికూల పరిస్థితుల్లోనూ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌ను దిగ్విజయంగా నిర్వహించాలని పట్టుదలతో ఉన్న యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ (యూఎస్‌టీఏ) ఈ మెగా ఈవెంట్ ప్రైజ్‌మనీ వివరాలను వెల్లడించింది. ఈసారి పురుషుల, మహిళల సింగిల్స్ విభాగంలో విజేతలుగా నిలిచిన వారికి 30 లక్షల డాలర్ల (రూ. 22 కోట్ల 51 లక్షలు) చొప్పున లభిస్తాయి. ఓవరాల్‌గా యూఎస్ ఓపెన్ టోర్నీ ప్రైజ్‌మనీ 5 కోట్ల 34 లక్షల డాలర్లు (రూ. 400 కోట్లు) కావడం విశేషం. ఈ మొత్తం కాకుండా... కరోనా కారణంగా అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీలు ఆగిపోవడంతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆటగాళ్లకు సహాయం నిమిత్తం 76 లక్షల డాలర్లను (రూ. 57 కోట్లు) అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) క్రీడాకారుల సంక్షేమ నిధికి విరాళంగా ఇవ్వనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి తొలి రౌండ్లో ఓడిన వారికి ఐదు శాతం ప్రైజ్‌మనీ పెంచారు. గత సంవత్సరం 58 వేల డాలర్లు ఇవ్వగా... ఈసారి తొలి రౌండ్లో వెనుదిరిగిన వారికి 61 వేల డాలర్లు (రూ. 45 లక్షల 77 వేలు) లభిస్తాయి. కరోనా కారణంగా ఈసారి యూఎస్ ఓపెన్ టోర్నీని నేరుగా మెయిన్ ‘డ్రా’తో మొదలుపెట్టనున్నారు. క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌ను నిర్వహించడంలేదు. ప్రైజ్‌మనీ వివరాలు సింగిల్స్ విజేత (పురుషులు, మహిళలు) 30 లక్షల డాలర్లు∙(రూ. 22 కోట్ల 51 లక్షలు) రన్నరప్ 15 లక్షల డాలర్లు (రూ. 11 కోట్ల 25 లక్షలు) సెమీఫైనల్ – 8 లక్షల డాలర్లు (రూ. 6 కోట్లు) క్వార్టర్ ఫైనల్ – 4 లక్షల 25 వేల డాలర్లు (రూ. 3 కోట్ల 18 లక్షలు) -
ఫ్రెంచ్ ఓపెన్ టికెట్ల డబ్బులు వాపస్
పారిస్: ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీని ప్రత్యక్షంగా తిలకించడం కోసం టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు టికెట్ వెల మొత్తాన్ని రిఫండ్ చేయనున్నట్లు ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య (ఎఫ్టీఎఫ్) గురువారం ప్రకటించింది. నిజానికి మే 24 నుంచి జూన్ 7 మరకు జరగాల్సిన ఈ టోర్నీని కరోనా మహమ్మారి వల్ల సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్లను కొన్న ప్రేక్షకులకు డబ్బును తిరిగి చెల్లించాలని నిర్వాహకులు నిర్ణయించారు. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4 కు మారిన షెడ్యూల్ ప్రకారం చేపట్టే టికెట్ల విక్రయాన్ని ఈవెంట్‌కు ముందు వెల్లడిస్తామని ఎఫ్టీఎఫ్ వర్గాలు తెలిపాయి. వైరస్ విజృంభిస్తుండటంతో ఆల్ ఇంగ్లండ్ క్లబ్... వింబుల్డన్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. -
‘మిక్స్డ్’ ఫైనల్లో బోపన్న జంట ఓటమి
మెల్బోర్న్: కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ నెగ్గాలని ఆశించిన భారత స్టార్ రోహన్ బోపన్నకు అనుకున్న ఫలితం రాలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బోపన్న–తిమియా బాబోస్ (హంగేరి) జంట మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా)–మాట్ పావిక్ (క్రొయేషియా) ద్వయంతో ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న–బాబోస్ జంట 6–2, 4–6, 9–11తో ‘సూపర్ టైబ్రేక్’లో ఓడిపోయింది. గతేడాది దబ్రౌస్కీతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన బోపన్న ఈసారి ఆమెను ప్రత్యర్థిగా ఎదుర్కొన్నాడు. చెరో సెట్ గెలిచిన తర్వాత నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో బోపన్న జంట 9–8తో మ్యాచ్ పాయింట్ సాధించినా... ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. విజేత దబ్రౌస్కీ–పావిక్ జంటకు లక్షా 75 వేలు (రూ. 90 లక్షల 30 వేలు), రన్నరప్ బోపన్న–బాబోస్ జోడీకి 90 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 46 లక్షల 44 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
ఆస్ట్రేలియా ఓపెన్‌లో మరో సంచలనం
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్లో మరో సంచలనం నమోదైంది. బల్గేరియాకు చెందిన మూడో సీడ్ ఆటగాడు దిమిత్రోవ్.. అన్ సీడెడ్ క్రీడాకారుడిగా బరిలోకి దిగిన బ్రిటీష్ యువ ఆటగాడు ఎడ్మండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూశాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో ఎడ్మండ్ 6-3, 3-6, 6-3, 6-4 తేడాతో దిమిత్రోవ్‌ను ఓడించి సెమీ ఫైనల్‌కు చేరాడు. దాంతో గ్రాండ్ స్లామ్ టోర్నీలో తొలిసారి సెమీస్‌కు చేరిన ఘనతను సొంతం చేసుకున్నాడు. మరొకవైపు గ్రాండ్ స్లామ్ ఓపెన్ ఎరాలో సెమీస్‌కు చేరిన ఆరో బ్రిటీష్ క్రీడాకారుడిగా ఎడ్మండ్ గుర్తింపు సాధించాడు. ఎడ్మండ్‌తో హోరాహోరీగా సాగిన పోరులో దిమిత్రోవ్ తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తొలి సెట్‌ను కోల్పోయి వెనుకబడిన దిమిత్రోవ్.. రెండో సెట్లో గెలిచి పోరులో నిలిచాడు. అయితే కీలకమైన మూడో సెట్‌ను కాపాడుకోవడంలో విఫలమైన దిమిత్రోవ్ మళ్లీ వెనుకబడ్డాడు. ఆపై నాల్గో సెట్లో సైతం బల్గేరియా స్టార్ ఆటగాడు ఆకట్టుకోలేకపోవడంతో టోర్నీ నుంచి నిష్ర్కమించాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో సెర్బియా స్టార్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ప్రిక్వార్టర్ ఫైనల్లో దక్షిణకొరియా ఆటగాడు హెయాన్ చుంగ్ చేతిలో జోకర్ ఓటమి పాలై టోర్నీ నుంచి వైదొలిగాడు. -
టాప్-10లో ఫెడరర్..
మెల్బోర్న్:ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్లోవిజేతగా నిలిచిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ ను గెలిచిన తరువాత ఫెడరర్ టాప్-10లో నిలిచాడు. తాజాగా విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్ లో ఫెడరర్ పదో స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో తన పూర్వపు ఫామ్‌ను అందుకున్న ఫెడరర్.. ఆ టోర్నీలో ఆద్యంత నిలకడగా రాణించి టైటిల్ ను ఎగురేసుకుపోయాడు. ఆదివారం జరిగిన తుది పోరులో ఫెడరర్ 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌పై విజయం సాధించి గ్రాండ్ స్లామ్‌ను సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన పోరులో ఫెడరర్ తన అనుభవాన్నిఉపయోగించి నాదల్ కు చెక్ పెట్టాడు. దాంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకాడు. మరొకవైపు మహిళల సింగిల్స్ లో విజేతగా నిలిచిన అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్ తిరిగి తన టాప్ ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ గ్రాండ్ స్లామ్‌కు ముందు రెండో ర్యాంకులో ఉన్న సెరెనా.. టైటిల్ ను కైవసం చేసుకోవడంతో నంబర్ వన్ స్థానానికి చేరింది. -
జొకోవిచ్ కొత్త చరిత్ర
► 10 కోట్ల డాలర్ల ప్రైజ్‌మనీ నెగ్గిన తొలి ప్లేయర్‌గా రికార్డు ► ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లోకి ► వీనస్ ఇంటికి... సెరెనా ముందుకు పారిస్: కెరీర్ గ్రాండ్‌స్లామ్‌పై గురి పెట్టిన సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లడం ద్వారా ఈ నంబర్‌వన్ ప్లేయర్ మరో ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. టెన్నిస్ చరిత్రలో 10 కోట్ల డాలర్ల (రూ. 674 కోట్లు) ప్రైజ్‌మనీని సంపాదించిన తొలి క్రీడాకారుడిగా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. 9 కోట్ల 96 లక్షల 73 వేల 404 డాలర్ల ప్రైజ్‌మనీతో ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన జొకోవిచ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరడంతో అతని ఖాతాలో అదనంగా 3 లక్షల 27 వేల 471 డాలర్లు జమయ్యాయి. దాంతో జొకోవిచ్ కెరీర్ ప్రైజ్‌మనీ 10 కోట్ల 875 డాలర్లకు చేరింది. ఓవరాల్ కెరీర్ ప్రైజ్‌మనీ జాబితాలో ఫెడరర్ (స్విట్జర్లాండ్-9 కోట్ల 80 లక్షల 11 వేల 727 డాలర్లు), రాఫెల్ నాదల్ (స్పెయిన్-7 కోట్ల 82 లక్షల 23 వేల 403 డాలర్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 3-6, 6-4, 6-1, 7-5తో 14వ సీడ్ రొబెర్టో బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. వర్షం కారణంగా మంగళవారం మూడో సెట్లో నిలిచిపోయిన ఈ మ్యాచ్ బుధవారం కొనసాగింది. జొకోవిచ్ మూడు, నాలుగు సెట్లలో గెలిచి వరుసగా 28వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)తో జొకోవిచ్ తలపడతాడు. మిగతా ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో బెర్డిచ్ 6-3, 7-5, 6-3తో 11వ సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)పై, 12వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 4-6, 6-2, 6-2, 6-3తో గుల్బిస్ (లాత్వియా)పై, 13వ సీడ్ థీమ్ (ఆస్ట్రియా) 6-2, 6-7 (2/7), 6-1, 6-4తో గ్రానోలెర్స్ (స్పెయిన్)పై గెలిచారు. సెమీస్‌లో వావ్రింకా: మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్లో వావ్రింకా 6-2, 6-1, 7-6 (9/7)తో రామోస్ వినోలాస్ (స్పెయిన్)పై గెలిచాడు. బాసిన్‌స్కీ జోరు: మహిళల సింగిల్స్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ‘విలియమ్స్ సిస్టర్స్’ సెరెనా, వీనస్ (అమెరికా)లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. టాప్ సీడ్ సెరెనా 6-1, 6-1తో 18వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్)ను చిత్తుగా ఓడించగా... ఎనిమిదో సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 6-2, 6-4తో తొమ్మిదో సీడ్ వీనస్‌పై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) 7-6 (7/4), 6-3తో 15వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై, యూలియా పుతింత్సెవా (కజకిస్తాన్) 7-5, 7-5తో 12వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)పై సంచలన విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్లోకి చేరారు. ‘మిక్స్డ్’ క్వార్టర్స్‌లో సానియా జంట మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో సానియా మీర్జా (భారత్)-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట 6-7 (6/8), 6-4, 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో అలీజా కార్నెట్-ఐసెరిక్ (ఫ్రాన్స్) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ విభాగంలో బోపన్న (భారత్) -మెర్జియా (రుమేనియా)... పేస్ (భారత్)-మట్కోవ్‌స్కీ (పోలండ్) జంటలకు క్వార్టర్ ఫైనల్లో పరాజయాలు ఎదురయ్యాయి. -
నాదల్ @200
గ్రాండ్‌స్లామ్ ల్లో స్పెయిన్ స్టార్ గెలిచిన మ్యాచ్‌లు {ఫెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్లోకి ప్రవేశం పారిస్: ఆరంభంలో కాస్త తడబడినా... కీలక సమయంలో తన రాకెట్ పవర్‌ను చూపెట్టిన ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్... ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడోరౌండ్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో నాలుగోసీడ్ నాదల్ 6-3, 6-0, 6-3తో ప్రపంచ 99వ ర్యాంకర్ ఫకుండో బాగ్నిస్ (అర్జెంటీనా)పై అలవోకగా నెగ్గాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో నాదల్కు ఇది 200వ విజయం కాగా ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 302 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా, జొకోవిచ్ (216) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) 7-5, 6-3, 6-4తో క్వాలిఫయర్ స్టీవ్ డార్సిస్ (బెల్జియం)పై నెగ్గి... గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 50 విజయాన్ని అందుకున్నాడు. ఆరోసీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-7 (6/8), 3-6, 6-3, 6-2, 6-2తో బగ్దాటిస్ (సైప్రస్)పై గెలిచి గ్రాండ్‌స్లామ్‌ల్లో వంద విజయాలు సాధించిన మూడో ఫ్రాన్స్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. సెరెనా అలవోకగా..: మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్‌సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6-2, 6-1తో టెలియానా పెరైరా (బ్రెజిల్)పై గెలిచింది. ప్రిక్వార్టర్స్‌లో పేస్ జోడి: భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి.... మిక్స్డ్ డబుల్స్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన తొలి రౌండ్లో పేస్-హింగిస్ 6-4, 6-4తో గ్రెనోఫీల్డ్ (జర్మనీ)-రాబెర్ట్ ఫరా (కొలంబియా)పై నెగ్గారు. మహిళల మిక్స్‌డ్‌లో రెండోసీడ్ సానియా-డుడిగ్ (క్రొయేషియా) 6-4, 6-3తో జాన్సన్ (ఫ్రాన్స్)-లామాసినే (ఫ్రాన్స్)పై గెలిచారు. -
అక్కను దాటితేనే చరిత్ర..!
క్యాలెండర్ స్లామ్ కు మూడు మ్యాచ్ ల దూరంలో ఉన్న సెరెనా విలియమ్స్ క్వార్టర్స్ లో అక్క వీసన్ విలియమ్స్ తో తలపడ నుంది. ఈ మ్యాచ్ గురించే ఇప్పుడు న్యూయార్కర్ లు ప్రధానంగా చర్చించు కుంటున్నారు. మహిళా టెన్సి స్ కి పవర్ గేమ్ పరిచయం చేసిన ఈ అక్కా చెళ్లెల్లు మరో సారి తలపడనున్నారు. వింబుల్డన్ లో అక్కపై చెల్లి పై చేయి సాధించడంతో.. లెక్క సరిచేయడానికి అక్క సిద్దమైతోంది. అక్కను చెల్లి ఓడిస్తుందా..? లేదా చెల్లికి అక్క చెక్ పెడుతుందా..? అమెరికా నల్ల కలువలు సొంత మైదానంలో ముఖాముఖి పోరుకు సిద్దమైయ్యారు. ఈ ఏడాది వింబుల్డన్ నాలుగో రౌండ్ లో తలపడిన విలియమ్స్ సిస్టర్స్ తాజాగా యూఎస్ ఓపెన్ క్వార్ట్ర ర్స్ లో మరో సారి అమితుమీ తేల్చుకోనున్నారు. సెరెనా, వీనస్ చిన్నప్పటి నుంచి కలిసే ప్రాక్టీస్ చేశారు. ఒకరి లోపాలు ఒకరికి బాగా తెలుసు.. తొలిసారి 1998లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ లో విలియమ్ సిస్టర్స్ ముఖాముఖి తలపడ్డారు. తర్వాత వారిద్దరి మధ్య మరో 25 ముఖాముఖి మ్యాచ్ లు జరిగాయి. మొత్తంగా చూస్తూ అక్కపై చెల్లికే మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకూ 15 సార్లు వీనస్ పై సెరెనా, గెలవగా.. వీనస్ 11 సార్లు చెల్లిని చిత్తు చేసింది. వారిద్దరి మధ్య వరుసగా జరిగిన ఏడు మ్యాచ్ ల్లో ఆరు సార్లు సెరెనా గెలవగా.. గత ఏడాది మాట్రియల్ సెమీస్ లో మాత్రం సెరెనా ను వీనస్ మట్టి కరిపించింది. ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడిన సెరెనా.. అక్క వీనస్ కు కితాబిచ్చింది. ఆమెతో మ్యాచ్ ఎప్పుడైనా సవాలే.. ఏమాత్రం అలసత్వం వహించినా.. విజయం మీద ఆశ వదులు కోవాల్సిందే.. ఇక ఈ టోర్నీలో కూడా వీనస్ అద్బుతంగా ఆడుతోందని వివరించింది. ఇక అందరి కంటే ఎక్కువగా సెరెనా పై గెలిచిన రికార్డు వీనస్ సొంతం. మరో వైపు వీసన్ చెల్లి తో మ్యాచ్ లో జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. సెరెనా సంధించే ఏస్ లను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నానని చెప్పింది. తాజాగా.. యూస్ ఓపెన్ లో ఈ సిస్టర్స్ నాలుగు సార్లు తలపడ్డారు. చెరి రెండు సార్లు గెలిచి 2-2 తో స్కొర్ సమం చేశారు. రీసెంట్ ఫాం ప్రకారం చూస్తే ఈ మ్యాచ్ లో సెరేనాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టోర్నీ హిస్టరీ కూడా వీనస్ కు సపోర్టు చేస్తోంది. సెరీనా యూఎస్ ఓపెన్ లో గత మూడు ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యం వహిస్తోంది. ప్రస్తుతం క్యాలెండర్ స్లామ్ పూర్తి చేయాలన్నలక్ష్యంతో బరిలోకి దిగిన సెరెనా.. ఆ ఒత్తిడిని జయిస్తుందో?లేదో?చూడాల్సిందే. -
ఫెడరర్ రాడ్ లేవర్
మెల్బోర్న్: ఒకరేమో టెన్నిస్‌లో రెండు సార్లు ‘గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసిన దిగ్గజం రాడ్ లేవర్... మరొకరు 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఈ తరం అద్భుత క్రీడాకారుడు ఫెడరర్. బుధవారం వీరిద్దరూ కలిసి రోజర్ ఫెడరర్ ఫౌండేషన్ కోసం నిధుల సేకరణలో భాగంగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో తలపడ్డారు. ‘ఆయన పేరిటే ఉన్న రాడ్ లేవర్ ఎరీనా కోర్టులోనే ఈ మ్యాచ్ ఆడటంతో నా కల నిజమైనట్లుంది. ఆ సమయంలో నా రాకెట్ చాలా బరువుగా అనిపించిందంటే నేను ఎంత ఉద్వేగానికి లోనయ్యానో చెప్పలేను’ అని ఫెడరర్ వ్యాఖ్యానించాడు.