మెల్‌బోర్న్: సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, 10 సార్లు చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)పై తాను సాధించిన విజయం గాలివాటమేమీ ఇటలీ యువతార యానిక్ సినెర్ నిరూపించాడు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో నాలుగో సీడ్ సినెర్ చాంపియన్‌గా అవతరించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సినెర్ 3–6, 3–6, 6–4, 6–4, 6–3తో ప్రపంచ మూడో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై చిరస్మరణీయ విజయం సాధించాడు.
తద్వారా 1976 తర్వాత పురుషుల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఇటలీ ప్లేయర్ గా, ఆ్రస్టేలియన్ ఓపెన్ సాధించిన తొలి ఇటలీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. 3 గంటల 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 22 ఏళ్ల సినెర్ తొలి రెండు సెట్‌లు కోల్పోయినా ఆందోళన చెంద లేదు. మూడో సెట్ నుంచి సినెర్ నెమ్మదిగా లయలోకి వచ్చాడు. కెరీర్‌లో ఆరోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న మెద్వెదెవ్‌పై ఒత్తిడి తెచ్చాడు.
మూడో సెట్ పదో గేమ్‌లో, నాలుగో సెట్ పదో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌లను బ్రేక్ చేసిన సినెర్ రెండు సెట్‌లు గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్‌లో ఆరో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. విజేత సినెర్‌కు 31 లక్షల 50 వేల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 22 లక్షలు), రన్నరప్ మెద్వెదెవ్‌కు 17 లక్షల 25 వేల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment