నాదల్ @200 | Spain star to win a Grand Slam matches | Sakshi
Sakshi News home page

నాదల్ @200

Published Fri, May 27 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

నాదల్ @200

నాదల్ @200

గ్రాండ్‌స్లామ్ ల్లో స్పెయిన్ స్టార్  గెలిచిన మ్యాచ్‌లు
{ఫెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్‌లోకి ప్రవేశం

 

పారిస్: ఆరంభంలో కాస్త తడబడినా... కీలక సమయంలో తన రాకెట్ పవర్‌ను చూపెట్టిన ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్... ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడోరౌండ్‌లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండోరౌండ్‌లో నాలుగోసీడ్ నాదల్ 6-3, 6-0, 6-3తో ప్రపంచ 99వ ర్యాంకర్ ఫకుండో బాగ్నిస్ (అర్జెంటీనా)పై అలవోకగా నెగ్గాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో నాదల్‌కు ఇది 200వ విజయం కాగా ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 302 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా, జొకోవిచ్ (216) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) 7-5, 6-3, 6-4తో క్వాలిఫయర్ స్టీవ్ డార్సిస్ (బెల్జియం)పై నెగ్గి... గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 50 విజయాన్ని అందుకున్నాడు. ఆరోసీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-7 (6/8), 3-6, 6-3, 6-2, 6-2తో బగ్దాటిస్ (సైప్రస్)పై గెలిచి గ్రాండ్‌స్లామ్‌ల్లో వంద విజయాలు సాధించిన మూడో ఫ్రాన్స్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

 
సెరెనా అలవోకగా..
: మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్‌సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6-2, 6-1తో టెలియానా పెరైరా (బ్రెజిల్)పై గెలిచింది.

 
ప్రిక్వార్టర్స్‌లో పేస్ జోడి: భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి.... మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన తొలి రౌండ్‌లో పేస్-హింగిస్ 6-4, 6-4తో గ్రెనోఫీల్డ్ (జర్మనీ)-రాబెర్ట్ ఫరా (కొలంబియా)పై నెగ్గారు. మహిళల మిక్స్‌డ్‌లో రెండోసీడ్ సానియా-డుడిగ్ (క్రొయేషియా) 6-4, 6-3తో జాన్సన్ (ఫ్రాన్స్)-లామాసినే (ఫ్రాన్స్)పై గెలిచారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement