
వింబుల్డన్ 2022లో ప్రపంచ మూడో ర్యాంకర్, డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్‌కు శుభారంభం లభించింది. తొలి రౌండ్‌లో దక్షిణ కొరియా ఆటగాడు, ప్రపంచ 81వ ర్యాంకర్ సూన్‌వూ క్వాన్‌పై 6-3, 3-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించిన జకో.. రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో జకో ఓ అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో కనీసం 80 సింగిల్స్ విజయాలు సాధించిన తొలి పురుష ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గ్రాండ్‌స్లామ్ చరిత్రలో ఇప్పటివరకు ఏ పురుష ఆటగాడు ఈ ఫీట్‌ను సాధించింది లేదు.
కాగా, గతేడాది మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు (యూఎస్ ఓపెన్ మినహా) సాధించిన జకోవిచ్.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయాడు. వ్యాక్సిన్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో వైరం కారణంగా అతను ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. అనంతరం ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడినా క్వార్టర్ ఫైనల్లో నదాల్ చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జకో.. వింబుల్డన్‌లో వరుసగా నాలుగో టైటిల్‌పై కన్నేశాడు. జకో రెండో రౌండ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన థనాసి కొక్కినాకిస్‌తో తలపడాల్సి ఉంది.
చదవండి: Wimbledon 2022: వ్యాక్సిన్ విషయంలో తగ్గేదేలే: జకోవిచ్
Comments
Please login to add a commentAdd a comment