సోషల్ మీడియా అనగానే ఎన్నో వింతలు, విశేషాలు దర్శనమిస్తాయి. అయితే, కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా చాటుకుని తమ ప్రతిభను నిరూపించుకుని రాత్రికిరాత్రే ఎంతో ఫేమస్ అయ్యారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇక, కేటగిరిలో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు కూడా చాలానే ఉన్నాయి.
అయితే, వన్యప్రాణుల ఫొటోలను, వీడియోలను తీసేందుకు ఇప్పటి వరకు ఎంతో మంది వినూత్నంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు ఫొటోగ్రాఫర్స్ విజయవంతంగా అయ్యారు. మరికొందరు ఫేయిల్ అయ్యారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి డ్రోన్ సాయంతో స్పెషల్ వీడియో తీసేందుకు ప్రయత్నించారు. ఇందు కోసం ఓ నదిలో ఉన్న ఎలిగేటర్‌ను ఎందుకున్నాడు. దీంతో, రంగంలోకి దిగిన ఫొటోగ్రాఫర్‌కు చేదు అనుభవమే ఎదురైంది.
కాగా, వీడియో ప్రకారం.. నీటిలో ఉన్న ఎలిగేటర్ కదిలికపై ఫొటోగ్రాఫర్ ఫోకస్ పెట్టాడు. ఓ డ్రోన్ సాయంతో ఎలిగేటర్‌కు సమీపం వరకు వెళ్లి వీడియో తీయడం ప్రారంభించాడు. డ్రోన్ కాసేపటి వరకు వీడియో తీసింది. దీంతో, డ్రోన్ సౌండ్‌కు చిర్రెత్కుకుపోయిన ఎలిగేటర్.. డ్రోన్ తన వద్దకు రాగానే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి.. డ్రోన్‌ను నోటితో పట్టుకుని నీటిలోకి దూకింది. ఎలిగేటర్ దాడిపై ఒక్కసారిగా షాకైన ఫొటోగ్రాఫర్.. చూస్తూ నిలబడిపోయాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Using drones to capture wildlife video footage. 🐊😮 pic.twitter.com/RCdzhTcGSf
— H0W_THlNGS_W0RK (@HowThingsWork_) December 19, 2022
Comments
Please login to add a commentAdd a comment