శని ఉందని చెట్టుతోనో, పుట్టతోనో ముందు పెళ్లి చేస్తే... అది పోతుందనే సంప్రదాయం మనదగ్గరా ఉంది. కానీ మొసలిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అని అనుమానంతో చూడకండి. ఈ మెక్సికన్ మేయర్ చేసుకున్నాడు. వందల ఏళ్ల పాత సంప్రదాయంలో భాగంగా అతను మొసలిని పెళ్లి చేసుకోవడమే కాదు... దాన్ని ముద్దుపెట్టుకుంటూ ఫొటోలకు పోజులు కూడా ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. కప్పల పెళ్లిళ్లు చేస్తే, వరదపాశం వండి బండమీదపోసి తింటే.. వరదలు పారే వర్షాలు కురుస్తాయని మన దగ్గర కొన్ని నమ్మకాలున్నాయి కదా! అలా మెక్సికోలోనూ ఓ పాత పద్ధతి ఉంది. అక్కడ గ్రామ పెద్ద మొసలిని పెళ్లి చేసుకుంటే... వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండుతాయని, చేపలు సమృద్ధిగా దొరుకుతాయని నమ్మకం.
ఇంకేముంది.. ఈ ఏడు కూడా అలాగే జరగాలని సాన్ పెడ్రో హామెలుల గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. మేయర్ విక్టర్ హ్యూగో సోసాకు కూడా మొసలితో పెళ్లి చేయాలనుకున్నారు. పెళ్లి కూతురు మొసలిని... పెళ్లి దుస్తుల్లో అందంగా అలంకరించారు. తెల్లని ముసుగును కూడా కప్పారు. సంప్రదాయ సంగీతం, మేళ తాళాలు, నృత్యాల మధ్య వధువును వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం వరుడు మేయర్, వధువు మొసలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ గ్రామం అన్నింటా సమృద్ధిగా ఉండాలని ప్రార్థనలు కూడా చేశాడు. ఇక వేడుక మొత్తం ఆ మొసలి పెళ్లికూతురిని ముద్దు పెడుతూనే ఉన్నాడు ఆ మేయర్. మరి ముద్దులు పెడుతుంటే ఆ మొసలి అతడిని ఏమీ అనలేదా అన్న అనుమానం వస్తోంది కదూ! ఫొటో జాగ్రత్తగా చూడండి దాని మూతిని తాడుతో కట్టేశారు.
చదవండి: పాకిస్తాన్‌లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి
In an age-old ritual, a Mexican mayor married his alligator bride to secure abundance. Victor Hugo Sosa sealed the nuptials by kissing the alligator's snout https://t.co/jwKquOPg93 pic.twitter.com/Vmqh4GpEJu
— Reuters (@Reuters) July 1, 2022
Comments
Please login to add a commentAdd a comment