ఆర్లెండో: విహారం కోసం డిస్నీ రిసార్ట్‌కు వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. తల్లిదండ్రులు చూస్తుండగానే వారి రెండేళ్ల పిల్లాడిపై మొసలి దాడిచేసి సరస్సులోకి లాక్కుపోయింది. పిల్లాడి మొసలి బారి నుంచి రక్షించడానికి తల్లిదండ్రులిద్దరూ తీవ్రంగా ప్రయత్నించారు. వారు నీళ్లలోకి దిగి పోరాడినప్పటికీ మొసలి లాకెళ్లుతున్న పిల్లాడిని కాపాడలేకపోయారు. అమెరికాలోని ఆర్లెండోలో ఉన్న డిస్నీ గ్రాండ్ ఫ్లోరిడియన్ రిసార్ట్ అండ్ స్పాలో మంగళవారం రాత్రి జరిగింది.
గల్లంతయిన బాలుడి కోసం తీరప్రాంత పోలీసులు బోట్లు, హెలికాప్టర్ సాయంతో తీవ్రంగా గాలిస్తున్నారు. నెబ్రాస్కా రాష్ట్రంలో ఉండే బాలుడి కుటుంబం విహారం కోసం ఈ రిసార్ట్‌కు వచ్చింది. రిసార్ట్‌ను ఆనుకుని ఉన్న సరస్సు ఒడ్డున కుటుంబంతో కలసి బాలుడు ఆడుకుంటుండగా మొసలి దాడిచేసి సరస్సులోకి లాక్కుపోయింది. పిల్లాడి తండ్రి వెంటనే అప్రమత్తమై కాపాడేందుకు ప్రయత్నించినా లాభంలేకుండా పోయిందని ఆరెంజ్ కౌంటీ పోలీసుఅధికారి జెర్రీ డెమింగ్స్ వెల్లడించారు.
అమెరికాలో చిన్నారిపై మొసలి దాడి
Published Wed, Jun 15 2016 11:27 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement