Disney resort
-
కరోనా కలకలం : డిస్నీ ధీమ్‌పార్క్‌ల మూసివేత
న్యూయార్క్ : కరోనా కలకలంతో ఈనెలాఖరు వరకూ కాలిఫోర్నియా, ఫ్లోరిడాల్లో ఉన్న మూడు థీమ్ పార్క్‌లను మూసివేస్తున్నట్టు వాల్ట్‌డిస్నీ శుక్రవారం వెల్లడించింది. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న క్రమంలో డిస్నీ ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ నెలాఖరు వరకూ డిస్నీ క్రూయిజ్ లైన్ అన్ని డిపార్చర్లను రద్దు చేసింది. ఫ్లోరిడాలోని వాల్ట్‌డిస్నీ వరల్డ్ రిసార్ట్‌లోని మూడు థీమ్ పార్క్‌లను, డిస్నీలాండ్ పారిస్ రిసార్ట్‌ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక తమ డిస్నీల్యాండ్, కాలిఫోర్నియా అడ్వంచర్ థీమ్ పార్క్‌లను శనివారం నుంచి మూసివేస్తామని డిస్నీ ఇప్పటికే ప్రకటించింది. చదవండి : డిస్నీ చేతికి ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ వ్యాపారం -
మాయదారి మొసలి ఎంతపని చేసింది
ఆర్లెండో: డిస్నీ రిసార్ట్‌లో మొసలి బారిన పడిన రెండేళ్ల బాలుడు లేన్ గ్రేవ్స్ మృతి చెందాడు. చిన్నారి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. 16 గంటల తర్వాత బాలుడి మృతదేహాన్ని బుధవారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో(స్థానిక కాలమానం ప్రకారం) కనుగొన్నారు. మొసలి లాక్కుపోయిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే లేన్ గ్రేవ్స్ మృతదేహాన్ని గుర్తించామని ఆరెంజ్ కౌంటీ పోలీసు అధికారి జెర్రీ డెమింగ్స్ తెలిపారు. చిన్నారి మృతదేహంపై మొసలి దాడి చేసిన గాయాలున్నాయని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. విహారం కోసం తల్లిదండ్రులు మట్, మిలిసాతో కలిసి మంగళవారం రాత్రి ఆర్లెండోలో ఉన్న డిస్నీ గ్రాండ్ ఫ్లోరిడియన్ రిసార్ట్ అండ్ స్పాకు వెళ్లిన లేన్ గ్రేవ్స్ ను అక్కడి సరస్సులోని మొసలి నీటిలోకి లాక్కెళ్లిపోయింది. మొసలి బారి నుంచి పిల్లాడిని రక్షించడానికి తల్లిదండ్రులిద్దరూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తీరప్రాంత పోలీసులు బోట్లు, హెలికాప్టర్ సాయంతో తీవ్రంగా గాలించి ఎట్టకేలకు బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే లేన్ గ్రేవ్స్ నీటిలో మునిగిపోయిన చనిపోయివుంటాడని భావిస్తున్నట్టు డెమింగ్స్ చెప్పారు. చిన్నారి ఎలా చనిపోయాడన్నది అటాప్సి లో నిర్ధారణవుతుందన్నారు. మొసలి దాడి చేసిన ప్రాంతానికి 15 అడుగుల దూరంలో ఆరు అడుగుల లోతులో అతడి మృతదేహాన్ని గుర్తించినట్టు తెలిపారు. లేన్ గ్రేవ్స్ పై దాడి చేసిన మొసలిని పట్టుకుని డిస్నీ రిసార్ట్ నుంచి తరలించినట్టు ఫ్లోరిడా జంతు పరిరక్షణ అధికారులు వెల్లడించారు. -
అమెరికాలో చిన్నారిపై మొసలి దాడి
ఆర్లెండో: విహారం కోసం డిస్నీ రిసార్ట్‌కు వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. తల్లిదండ్రులు చూస్తుండగానే వారి రెండేళ్ల పిల్లాడిపై మొసలి దాడిచేసి సరస్సులోకి లాక్కుపోయింది. పిల్లాడి మొసలి బారి నుంచి రక్షించడానికి తల్లిదండ్రులిద్దరూ తీవ్రంగా ప్రయత్నించారు. వారు నీళ్లలోకి దిగి పోరాడినప్పటికీ మొసలి లాకెళ్లుతున్న పిల్లాడిని కాపాడలేకపోయారు. అమెరికాలోని ఆర్లెండోలో ఉన్న డిస్నీ గ్రాండ్ ఫ్లోరిడియన్ రిసార్ట్ అండ్ స్పాలో మంగళవారం రాత్రి జరిగింది. గల్లంతయిన బాలుడి కోసం తీరప్రాంత పోలీసులు బోట్లు, హెలికాప్టర్ సాయంతో తీవ్రంగా గాలిస్తున్నారు. నెబ్రాస్కా రాష్ట్రంలో ఉండే బాలుడి కుటుంబం విహారం కోసం ఈ రిసార్ట్‌కు వచ్చింది. రిసార్ట్‌ను ఆనుకుని ఉన్న సరస్సు ఒడ్డున కుటుంబంతో కలసి బాలుడు ఆడుకుంటుండగా మొసలి దాడిచేసి సరస్సులోకి లాక్కుపోయింది. పిల్లాడి తండ్రి వెంటనే అప్రమత్తమై కాపాడేందుకు ప్రయత్నించినా లాభంలేకుండా పోయిందని ఆరెంజ్ కౌంటీ పోలీసుఅధికారి జెర్రీ డెమింగ్స్ వెల్లడించారు.