మాయదారి మొసలి ఎంతపని చేసింది | Disney gator attack: 2-year-old boy found dead | Sakshi
Sakshi News home page

మాయదారి మొసలి ఎంతపని చేసింది

Published Thu, Jun 16 2016 8:42 AM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

మాయదారి మొసలి ఎంతపని చేసింది

మాయదారి మొసలి ఎంతపని చేసింది

ఆర్లెండో: డిస్నీ రిసార్ట్‌లో మొసలి బారిన పడిన రెండేళ్ల బాలుడు లేన్ గ్రేవ్స్ మృతి చెందాడు. చిన్నారి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. 16 గంటల తర్వాత బాలుడి మృతదేహాన్ని బుధవారం మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో(స్థానిక కాలమానం ప్రకారం) కనుగొన్నారు. మొసలి లాక్కుపోయిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే లేన్ గ్రేవ్స్ మృతదేహాన్ని గుర్తించామని ఆరెంజ్ కౌంటీ పోలీసు అధికారి జెర్రీ డెమింగ్స్ తెలిపారు. చిన్నారి మృతదేహంపై మొసలి దాడి చేసిన గాయాలున్నాయని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి.

విహారం కోసం తల్లిదండ్రులు మట్, మిలిసాతో కలిసి మంగళవారం రాత్రి ఆర్లెండోలో ఉన్న డిస్నీ గ్రాండ్ ఫ్లోరిడియన్ రిసార్ట్ అండ్ స్పాకు వెళ్లిన లేన్ గ్రేవ్స్ ను అక్కడి సరస్సులోని మొసలి నీటిలోకి లాక్కెళ్లిపోయింది. మొసలి బారి నుంచి పిల్లాడిని రక్షించడానికి తల్లిదండ్రులిద్దరూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తీరప్రాంత పోలీసులు బోట్లు, హెలికాప్టర్ సాయంతో తీవ్రంగా గాలించి ఎట్టకేలకు బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారు.

అయితే లేన్ గ్రేవ్స్ నీటిలో మునిగిపోయిన చనిపోయివుంటాడని భావిస్తున్నట్టు డెమింగ్స్ చెప్పారు. చిన్నారి ఎలా చనిపోయాడన్నది అటాప్సి లో నిర్ధారణవుతుందన్నారు. మొసలి దాడి చేసిన ప్రాంతానికి 15 అడుగుల దూరంలో ఆరు అడుగుల లోతులో అతడి మృతదేహాన్ని గుర్తించినట్టు తెలిపారు. లేన్ గ్రేవ్స్ పై దాడి చేసిన మొసలిని పట్టుకుని డిస్నీ రిసార్ట్‌ నుంచి తరలించినట్టు ఫ్లోరిడా జంతు పరిరక్షణ అధికారులు వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement