కరోనా కలకలం : డిస్నీ ధీమ్‌పార్క్‌ల మూసివేత | Disney To Close Theme Parks In California | Sakshi
Sakshi News home page

కరోనా కలకలం : డిస్నీ ధీమ్‌పార్క్‌ల మూసివేత

Published Fri, Mar 13 2020 11:23 AM | Last Updated on Fri, Mar 13 2020 11:25 AM

Disney To Close Theme Parks In California - Sakshi

న్యూయార్క్‌ : కరోనా కలకలంతో ఈనెలాఖరు వరకూ కాలిఫోర్నియా, ఫ్లోరిడాల్లో ఉన్న మూడు థీమ్‌ పార్క్‌లను మూసివేస్తున్నట్టు వాల్ట్‌డిస్నీ శుక్రవారం వెల్లడించింది. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న క్రమంలో డిస్నీ ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ నెలాఖరు వరకూ డిస్నీ క్రూయిజ్‌ లైన్‌ అన్ని డిపార్చర్లను రద్దు చేసింది. ఫ్లోరిడాలోని వాల్ట్‌డిస్నీ వరల్డ్‌ రిసార్ట్‌లోని మూడు థీమ్‌ పార్క్‌లను, డిస్నీలాండ్‌ పారిస్‌ రిసార్ట్‌ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక తమ డిస్నీల్యాండ్‌, కాలిఫోర్నియా అడ్వంచర్‌ థీమ్‌ పార్క్‌లను శనివారం నుంచి మూసివేస్తామని డిస్నీ ఇప్పటికే ప్రకటించింది.

చదవండి : డిస్నీ చేతికి ఫాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ వ్యాపారం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement