Viral Video: Python Swallows 5-Foot Alligator Could Not Digest Paid His Life - Sakshi
Sakshi News home page

Viral Video: మొసలిని అమాంతం మింగేసింది కొండచిలువ..పాపం ఆ తర్వాత..

Published Tue, May 9 2023 9:14 PM | Last Updated on Wed, May 10 2023 2:36 PM

Viral Video: Python Swallows 5 Foot Alligator Could Not Digest Paid His Life - Sakshi

ఓ కొండచిలువ అమాంతం ఓ మొసలిని మింగేసింది. ఆ తర్వాత అదిపడ్డ బాధ అంతా ఇంతా కాదు. చివరికి కక్కలేక మింగలేక నానాపాట్లు పడి.. విగతజీవిగా మారింది. అదే సమయంలో కొండచిలువ పొట్టలో ఉన్న మొసలి సైతం ఊపిరాడక చనిపోయింది.

ఈ షాకింగ్‌ ఘటన బర్మాలో చోటు  చేసుకుంది. కానీ వైద్యులు ఆ రెండు జీవుల్లో ఒక్కదాన్నైనా రక్షించాలనుకున్నారు. అందులో భాగంగానే వైద్యులు కొండచిలువ పొట్టకోసి మొసలిని తీసే యత్నం చేశారు. ఐతే అది అప్పటికే చనిపోయింది. ఆ కొండచిలువ సుమారు ఐదడుగుల మొసలిని మింగేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. దాన్ని అరగించుకోలేక ప్రాణాలు విడిచినట్లు వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై స్పందించిన నెటిజన్లు తనకు మించి భారీగా ఉన్నవాటిని మింగితే వాటిని కొండచిలువలు ఉమ్మేస్తాయని కొందరూ చెబుతున్నారు. మరికొందరూ కొండచిలువ అలా చేయగలిగే అవకాశం ఉన్న చేయలేక చనిపోయిందని ట్వీట్‌ చేశారు. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి:

(చదవండి: ఏం స్వారీ చేశాడు భయ్యా! అర్థరాత్రి తాగిన మైకంలో ఎద్దుపైకి ఎక్కి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement